పుదీనాతో పాదాల పగుళ్ల నుంచి మొటిమల వరకు ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి తెలుసా..?
benefits of mint leaves: పుదీనాలో ఉండే యాంటీ ఆక్సిండెంట్లు జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. అంతేకాదు పుదీనాలో పాదాల పగుళ్లకు చెక్ పెట్టొచ్చు. మొటిమల సమస్య నుంచి బయటపడొచ్చు.

పుదీనా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పుదీనా ఆకుల్లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఎంతో సహాయపడుతుంది. ఇక ఈ ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణ సమస్యలను తొలగిస్తాయి. అంతేకాదు ఇవి జీర్ణక్రియ ప్రక్రియను వేంగవంతం కూడా చేస్తాయి.
mint leaves
పుదీనా ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ యే కాదు.. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి శ్వాస సంబంధిత సమస్యలను తొలగిస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. అందుకే ఆస్తమా రోగులు వీటిని తమ రోజు వారి ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.
mint leaves
దోమలు కుట్టడం వల్ల చర్మంపై దురదగా అనిపిస్తుంది. అయితే దోమ కుట్టిన చోట పుదీనా ఆకుల రసాన్ని అప్లై చేస్తే దురద పోతుంది. చర్మం కూడా మృదువుగా అవుతుంది.
<p>mint leaves</p>
యువతలో మొటిమలు సర్వసాధారణ సమస్యగా మారిపోయింది. ఈ మొటిమల మూలంగా నల్లని మచ్చలు కూడా అవుతుంటాయి. ఈ మచ్చలు ఎన్ని క్రీమ్స్ వాడినా అస్సలు పోవు. అయితే పుదీనా ఆకులతో వీటిని సులువుగా వదిలించుకోవచ్చు. ఇందుకోసం పుదీనా జ్యూస్, ఓట్ మీల్ ను మిక్స్ చేసి ముఖానికి రాయాలి. దీనివల్ల ముఖంపై ఉంచే మచ్చలు పోవడమే కాదు చర్మంలోని మృతకణాలు కూడా తొలగిపోతాయి.
పాదాల పగుళ్లను తగ్గించడంలో కూడా పుదీనా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం కొన్ని పుదీనా ఆకులను తీసుకుని నీళ్లలో మరిగించండి. ఆ నీళ్లు గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో పాదాలను కాసేపటి దాకా ఉంచండి. తరచుగా ఇలా చేస్తే పాదాల పగుళ్లు మటుమాయం అవుతాయి.
పుదీనా నీరు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. క్రమం తప్పకుండా పుదీనా నీటిని తాగడం వల్ల ఆందోళన, ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.
పుదీనా బరువు తగ్గడానికి కూడా సహాయపడతుంది. అలాగే దీనిలో ఉండే డైజెస్టివ్ ఎంజైమ్స్ జీర్ణ సమస్యలను తొలగించడానికి సహాయపడుతుంది. అలాగే ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. పుదీనా చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందుకోసం పుదీనా నీటిలో కాస్త తేనె, నిమ్మరసం వేసి కలుపుకుని తాగొచ్చు. ఈ పానీయం తలనొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది.