- Home
- Life
- మామిడి ఆకులు కిడ్నీల్లో రాళ్లను తొలగించడమే కాదు.. మధుమేహాన్ని, రక్తపోటును కూడా కంట్రోల్ లో ఉంచుతాయి..
మామిడి ఆకులు కిడ్నీల్లో రాళ్లను తొలగించడమే కాదు.. మధుమేహాన్ని, రక్తపోటును కూడా కంట్రోల్ లో ఉంచుతాయి..
mango leaves: మామిడి ఆకులను ఇంటి తోరణాలుగానే కాదు.. దేవుడి పూజలో కూడా ఉపయోగిస్తుంటారు. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ వీటిలో ఉండే ఔషద గుణాలు ఎన్నో రోగాలను నయం చేస్తాయని ఎవరికీ తెలియదేమో..

ప్రస్తుతం మామిడి పండ్ల సీజన్ నడుస్తోంది. ఈ సీజన్ పోతే మళ్లీ మామిడి పండ్లు దొరకవని జనాలు వీటిని ఎక్కువగా లాగించేస్తున్నారు. ఇక ఈ పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కూడా. ఈ సంగతి దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. కానీ వీటి ఆకులు కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయన్న సంగతి మాత్రం బహుషా ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ మామిడి ఆకుల్లో కూడా ఎన్నో ఔషద గుణాలుంటాయి. ఇవన్నీ ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి.
మామిడి ఆకుల్లో ( mango leaves) యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants), విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎన్నో రోగాలను నయం చేస్తాయి. మామిడి ఆకులు మనకు ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకుందాం పదండి.
మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది: మధుమేహులకు మామిడి ఆకులు దివ్య ఔషదంతో సమానం. ఎందుకంటే ఈ ఆకుల్లో ఉండే ఆంథోసైనిడిన్స్ అనే టానిన్లు డయాబెటీస్ ను నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి. ఇందుకోసం మామిడి ఆకులను బాగా ఎండబెట్టి పౌడర్ చేసుకుని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఒక గిన్నె తీసుకుని అందులో నీళ్లు పోసి కొన్ని మామిడి ఆకులను వేసి బాగా మరిగించి పక్కకు పెట్టుకోవాలి. వాటర్ ను రాత్రంతా అలాగే ఉంచి.. ఉదయం వడగట్టి పరిగడుపున తాగితే మధుమేహం నియంత్రణ (Diabetes control)లో ఉంటుంది.
కిడ్నీలో రాళ్ల (Kidney stones) ను తొలగిస్తుంది: మామిడి ఆకులు కిడ్నీల్లో ఉండే రాళ్లను తొలగించడానికి కూడా సహాయపడతాయి. ఇందుకోసం..మామిడి ఆకుల పౌడర్ ను టీ స్పూన్ తీసుకుని గ్లాస్ నీటిలో వేయాలి. దీన్ని రాత్రంతా అలాగే ఉంచి.. పొద్దున పరిగడుపున తాగాలి. తరచుగా ఇలా చేస్తే రాళ్లు తొలగిపోతాయి.
రక్తపోటు కంట్రోల్ అవుతుంది: బీపీని తగ్గించడంలో మామిడి ఆకులు ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి.. ఇందుకోసం ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో మామిడి ఆకులను వేసి బాగా మరగబెట్టి కాషాయంగా తాగాలి. ఇది హైబీపీ (Blood pressure control)ని తగ్గిస్తుంది.
పొట్టను ఆరోగ్యంగా (Stomach healthy)ఉంచుతుంది: మామిడి ఆకులు ఉదర సంబంధిత సమస్యలను తగ్గించడానికి కూడా ఎంతో సహాయపడతాయి. ఇందుకోసం రాత్రంతా నార్మల్ వాటర్ లో మామిడి ఆకులను నానబెట్టాలి. తర్వాతి రోజు ఉదయం పరిగడుపున ఈ నీళ్లను తాగాలి. తరచుగా ఇలా చేస్తే ఉదర సంబంధ సమస్యలు తొలగిపోతాయి.
జుట్టును పెంచడానికి సహాయపడుతుంది: మామిడి ఆకులు కూడా జుట్టు గ్రోత్ కు ఎంతో సహాయపడతాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు డ్యామేజ్ అయిన జుట్టును బాగు చేస్తాయి. అలాగే జుట్టును వేగంగా పెంచడానికి సహాయపడతాయి. అలాగే హెయిర్ ఫాల్ (Hair fall) సమస్యను కూడా తగ్గిస్తుంది.