చలికాలంలో అల్లాన్ని ఎక్కువగా తింటే ఎన్ని లాభాలున్నాయో తెలుసా?
చలికాలంలో బాడీ టెంపరేచర్ దారుణంగా పడిపోతూ ఉంటుంది. అందులోనూ మగవాళ్లకంటే ఆడవాళ్లకు ఇంకా ఎక్కువ చలి పెడుతుందట. అందుకే ఈ సీజన్ లో వేడిని పెంచే ఆహారాలను తప్పకుండా తినాలంటారు ఆరోగ్య నిపుణులు.

చలికాలంలో వెదర్ చాలా చాలా కూల్ గా ఉంటుంది. ఈ చల్లటి గాలుల వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. శరీరాన్ని వెచ్చగా, ఆరోగ్యంగా ఉంచడానికి, కాలానుగుణంగా వచ్చే అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండటానికి కొన్ని రకాల ఆహారాలు బాగా ఉపయోగడపతాయి. వాటిలో అల్లం ఒకటి. అల్లాన్ని వింటర్ సూపర్ ఫుడ్ అని కూడా పిలుస్తారు. ఈ సీజన్ లో ప్రతి ఒక్కరూ అల్లాన్ని తప్పకుండా తీసుకోవాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు సలహానిస్తున్నారు. ఎందుకంటే..
జీర్ణక్రియకు సహాయపడుతుంది
అల్లం జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ముఖ్యంగా తిన్న ఆహారం సులువుగా జీర్ణం అయ్యేందుకు జీర్ణవ్యవస్థకు సహాయపడుతుంది. అంతేకాదు కడుపులో గ్యాస్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. వాంతులు, వికారం వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. ఈ సీజన్ లో అల్లాన్ని పుష్కలంగా తీసుకుంటే మొత్తం జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుంది.
<p>ginger </p>
దగ్గు, జలుబు, ఫ్లూతో పోరాడటానికి సహాయపడుతుంది
ఈ సీజన్ లో దగ్గు, గొంతునొప్పి, జలుబు, జ్వరం, ఫ్లూతో పాటుగా ఇన్ఫెక్షన్లు కూడా తరచుగా వస్తుంటాయి. ఇలాంటి వారు అల్లాన్ని తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే అల్లంలో ఉండే ఔషదగుణాలు గొంతు నొప్పిని తగ్గిస్తాయి. మంటను తగ్గించడానికి సహాయపడతాయి. అల్లంలో యాంటీ బ్యాక్లీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది
అల్లంలో యాంటీ క్యాన్సర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. అల్లం మీ ఇమ్యూనిటీ వపర్ ను పెంచడానికి ఎంతో సహాయపడతాయి. అలాగే అల్లంలో ఉండే శోథ నిరోధక లక్షణాలు కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతే గుండెకు రక్తసరఫరా సరిగ్గా జరగదు. దీనివల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక రోగాలొస్తాయి. అయితే అల్లం కొలెస్ట్రాల్ ను తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గే అవకాశం ఉంది. అల్లం మన శరీరం కొలెస్ట్రాల్ వాడకాన్ని పెంచే ఎంజైమ్ ను ప్రభావితం చేస్తుంది.
అల్లం కూడా కఫం నుంచి ఉపశమనం కలిగించే ప్రత్యేక సామర్థ్యాన్ని కలిగి ఉంది. అలెర్జీ ఉన్నవారు కూడా అల్లాన్ని తీసుకోవచ్చు. చలికాలంలో గ్యాస్ , కడుపు ఉబ్బరం వంటి సమస్యలు సాధారణం. ఎందుకంటే చల్లని వాతావరణంలో జీర్ణక్రియ మందగిస్తుంది. అల్లం ఈ సమస్యలను తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది.
అల్లం టీ, అల్లం..దాల్చినచెక్క టీ, అల్లం..యాలకుల టీ వంటి టీలు చలికాలంలో రెగ్యులర్ గా తాగొచ్చు. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. అల్లాన్ని టీ కే కాకుండా ఇతర ఆహార పదార్థాలకు కూడా జోడించొచ్చు.