ఈ అనారోగ్య సమస్యలు ఉన్నాయా? అయితే మీరు ఖచ్చితంగా మజ్జిగను తాగాల్సిందే..!
ఎండాకాలం వస్తే చాలు మజ్జిగ లేకుండా ఒక్కరోజూ కూడా ఉండరు. నిజానికి మజ్జిగ మన దాహాన్ని తీర్చడమే కాదు.. ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది.

ఇతర పాల ఉత్పత్తులతో పోలిస్తే చాలా మందికి మజ్జిగంటేనే చాలా ఇష్టం. ఇక ఎండాకాలంలో పూట పూటకు తాగామన్నా తాగుతుంటారు. ఇది చాలా మంచి అలవాటంటారు నిపుణులు. ఎందుకంటే మజ్జిగలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీన్ని తాగడం వల్ల ఒక్క దాహం తీరడమే కాదు ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి.
butter milk
అయితే చాలా మంది పెరుగును, మజ్జిగను ఒక్క ఎండాకాలంలోనే ఎక్కువగా తీసుకుంటారు. కారణం చలువ చేయాలని. వేసవి దాహం తీరాలని. నిజానికి మజ్జిగను కాలాలతో సంబంధం లేకుండా తాగొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది
మజ్జిగలో విటమిన్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా మజ్జిగలో ఉండే కాల్షియం, విటమిన్ బి, మెగ్నీషియం, పొటాషియంలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రోజూ గ్లాస్ మజ్జిగను తాగడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటుంది. దగ్గు, జలుబుతో బాధపడేవారు చిక్కని మజ్జిగను తాగకూడదు. ఇది వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు.
butter milk
జీర్ణక్రియ మెరుగుపడుతుంది
మలబద్దకం, అజీర్థి వంటి సమస్యలకు మజ్జిగ బెస్ట్ మెడిసిన్ లా పనిచేస్తుంది. ఎందుకంటే మజ్జిగను తాగడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మెరుగ్గా పనిచేస్తుంది. ఈ మజ్జిగలో జీరా పౌడర్ వేసుకుని తాగితే జీర్ణక్రియ బాగుంటుంది. మలబద్దకం సమస్య వచ్చే అవకాశమే ఉండదు.
butter milk
కడుపు నొప్పి తగ్గిపోతుంది
పిల్లలకు మజ్జిగను తప్పకుండా ఇవ్వాలి. ఎందుకంటే ఇది పిల్లల్లో వచ్చే కడుపు నొప్పిని తగ్గిస్తుంది. గడబిడ కూడా తగ్గిపోతుంది. మజ్జిగ ఎలాంటి కడుపునకు సంబంధించిన సమస్యలైనా ఇట్టే తగ్గిస్తుంది.
ఎసిడిటీ
స్పైసీ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వంటి బయటి ఆహారాలను ఎక్కువగా తింటే గ్యాస్ట్రిక్, అల్సర్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. కానీ ఈ సమస్యలు అంత తొందరగా తగ్గవు. అయితే ఆ సమయంలో ఒక గ్లాస్ మజ్జిగను తాగితే ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు వెంటనే తగ్గిపోతాయి. అందుకే ఇలాంటి ఆహారాలను తిన్న తర్వాత మజ్జిగను ఖచ్చితంగా తాగండి.
రక్తపోటు తగ్గుతుంది
ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా అధిక రక్తపోటు బారిన పడుతున్నారు. కానీ ఈ బీపీ గుండె పోటుతో సహా ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుంది. ఇలాంటి వారికి మజ్జిగ ఔషదంలా పనిచేస్తుంది. మజ్జిగ బీపీని ఫాస్ట్ గా తగ్గిస్తుంది.
ఇలా తాగితే మంచిది..
సాదా మజ్జిగ కాకుండా దానిలో కొత్తిమీర, పుదీనా ఆకులు, జీరా పౌడర్, ఉప్పు, రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను వేసుకుని తాగితే టేస్ట్ బాగుంటుంది. హెల్త్ కూడా బాగుంటుంది.