Betel Leaf: రోజుకు రెండు తమలపాకులు చాలు ఆ రోగాలన్నీ పోవడానికి...
Betel Leaf: పూజా కార్యాక్రమాల్లో ఎక్కువగా ఉపయోగించే తమలపాకులు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. రోజుకు రెండు తమలపాకులు తిన్నా మన ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదని నిపుణులు చెబుతున్నారు.

డాక్టర్ అవసరం రాకూడదంటే రోజుకు ఒక యాపిల్ పండు తినాలని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు. అలాగే రోజుకు రెండు తమలపాకులు నమిలితే కూడా వైద్యుడి దగ్గరికి పోవాల్సిన అవసరం ఉండదని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
Betel Leaf
ఈ ఆకులను ఇప్పటికీ కూడా మన నాయినమ్మలు, అమ్మమ్మలు నములుతూ ఉంటారు. ఇదీకాక పూర్వ కాలంలో ప్రతి ఒక్కరూ నిత్యం ఒక తమలపాకును నమిలేవారట.
కానీ ప్రస్తుతం వీటిని తినేవారి సంఖ్య బాగాతగ్గిపోయింది. తింటే పాన్ రూపంలో కొంతమంది తీసుకుంటూ ఉంటారు. ఇక ఈ పాన్ తినడానికి చాలా మంది వెనకడుగు వేస్తుంటారు.
తమలపాకులో సున్నం, లేదా పొగాకు, అరేకా గింజలు పెట్టి పాన్ ను తయారుచేస్తుంటారు. దీనివల్ల వచ్చే లాభాలు పెద్దగా ఉండవు. కానీ వట్టి తమలపాకును నమిలితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాదు ఇది వివిధ రోగాలను నయం చేస్తుంది కూడా.
తమలపాకుల్లో విటమిన్ సి ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది రోగ నిరోధకశక్తిని పెంచడానికి ఎంతో సహాయపడుతుంది. అంతేకాదు ఇందులో కాల్షియం కూడా అధికంగానే ఉంటుంది. దీన్ని తినడం వల్ల కాల్షియం లోపం కూడా తొలగిపోతుంది.
కాల్షియం లోపమున్న వారు తమలపాకులో కాస్త సున్నం పెట్టుకుని తినాలి. అలాగని ప్రతిరోజూ తమలపాకుకు సున్నం పెట్టుకుని తింటామంటే కుదరదు. ఎప్పుడో ఒకసారి మాత్రమే తమలపాకుకు సున్నం పెట్టాలి. రోజూ మాత్రం వట్టి తమలపాకును మాత్రమే తినాలి.
బాలింతలు తమలపాకులు తింటే వారి ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. తమలపాకుల్లో చిటికెడు సున్నం వేసుకుని తింటే శరీరంలో వేడి తగ్గుతుంది. ఈ తమలపాకుల్లో ఉండే పీచుపదార్థం Digestion rate ను పెంచుతుంది.
పిల్లలకు జలుబు చేస్తే.. తమలపాకు రసాన్ని రెండు చుక్కలు పాలల్లో వేసి తాగిస్తే.. దెబ్బకు ఆ సమస్య తొలగిపోతుంది. ఇది వారిలో ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతుంది. ఈ పాలను పెద్దవాళ్లు తాగితే కూడా మంచిదే..
తీవ్రమైన తలనొప్పి వేధిస్తుంటే.. తమలపాకుల నుంచి రసాన్ని పిండి దాన్ని నుదిటికి అప్లై చేసి కాసేపు మసాజ్ చేస్తే ఆ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు.
ప్రస్తుత కాలంలో మానసిక సమస్యలు, డిప్రెషన్ వంటవి ఎక్కువ అయ్యాయి. ఇలాంటి వారు ప్రతిరోజూ ఒక తమలపాకును తింటే మంచి ఫలితం ఉంటుంది. వీటిని తింటే మానసిక ప్రశాంతంగా తయారవుతారని నిపుణులు చెబుతున్నారు. ఆకలి వేయని వారు రోజుకు రెండు తమలపాకులను తింటే.. వారికి ఆకలి బాగా పుడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.