Coronavirus: కరోనా నెగిటీవ్ వచ్చినా రుచి, వాసన తెలియట్లేదా.. ఈ చిట్కాలను పాటించండి..
Coronavirus: ప్రస్తుతం చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. కొవిడ్ సోకిన కొంతమందికి లక్షణాలు తీవ్ర స్థాయిలో లేకపోయినప్పటికీ.. మరికొంత మందిపై కొవిడ్ విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా కొవిడ్ నుంచి కోలుకున్న కొంతమందికి రుచి, వాసన తెలియడం లేదు. అలాంటప్పుడు ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుకుందాం.

Coronavirus: కూరలో ఉప్పు, కారం కొంచె అటు ఇటైనా.. చాలా చప్పగా ఉంది.. దీన్ని ఎలా తినడం అంటూ అన్నాన్ని తినని వారు చాలా మంది ఉన్నారు. అలాంటిది పూర్తిగా వాసనను, రుచిని కోల్పోతే ఇక ఆ కూరను ఎలా తినేది? ముందే తినాలనే కోరికను కలిగించడానికి వాసన, రుచులే చాలా ముఖ్యం . మరి ఆ రుచులు, వాసనలే తెలియకపోతే ఫుడ్ ను తీసుకోవడం ఎంత కష్టంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం కదా. అయితే చాలా మందికి కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత రుచి, వాసన తెలియడం లేదు. దాంతో వారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాగా కొంతమందికి టేస్ట్ తెలిసినా.. వాసన మాత్రం తెలియడం లేదు. రుచి వాసన తెలియడానికి కొంతమందికి 10 రోజులు పడితే.. మరికొంతమందికి నెల రోజుల సమయం పడుతుంది. 99 శాతం మందికి కొవిడ్ నెగిటీవ్ వచ్చి నెల రోజుల్లోనే వాసన, రుచులు తెలుస్తున్నాయట. కానీ కొందరికి మాత్రం ఈ రుచి వాసన ఎన్ని రోజులు గడిచినా తెలియడం లేదట. ఈ సమస్యలకు ఎటువంటి వైద్యం లేదు. కానీ కొన్ని సింపుల్ చిట్కాలను పాటిస్తే ఈ సమస్య నుంచి తొందరగా బయటపడగలుగుతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మరసం: నిమ్మపండు కోల్పోయిన వాసన తిరిగి పొందడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఎందుకంటే ఇది ఒక సిట్రస్ పండు. ఇది మంచి స్మెల్ ను కలిగుంటుంది. ఒక గ్లాసు నీళ్లలో కాస్త తేనె, నిమ్మరసం కలుపుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే కోల్పోయిన వాసన, రుచిని తొందరగా పొందగలుగుతారు.
అల్లం: అల్లం ముక్క ద్వారా కూడా వాసనను, రుచిని తిరిగి పొందవచ్చు. కాస్త అల్లం ముక్కను తీసుకోవాలి. దాని పై పొట్టును అంతా తీసి శుభ్రంగా కడిగి కొద్ది కొద్దిగా నమలాలి. దాన్ని నమలడం కష్టమనుకుంటే అల్లం టీ చేసుకుని తాగినా మంచి ఫలితం ఉంటుంది. దీనివల్ల వాసన తెలుస్తుంది. అంతేకాదు ఈ అల్లం రుచి గ్రంథులను ప్రేరేపిస్తుంది.
పుదీనా: కొన్ని పుదీనా ఆకులను తీసుకుని వాటిని కొన్ని నీళ్లల్లో ఉడికించుకోవాలి. ఆ నీరు బాగా మరిగాక దించుకోవాలి. అవి చల్లారాకా వడగట్టుకుని అందులో కొంచెం తేనె కలుపుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది. పుదీనా ఆకుల్లో ఉండే మెంథాల్ యాంటీ మైక్రోబయల్, Anti-inflammatory గుణాలను కలిగి ఉంటుంది. ఇది రుచి, వాసన తిరిగి పొందడానికి ఎంతగానో సహాయపడతాయి. కాబట్టి వీటిని తరచుగా తాగండి. దానివల్ల మీరు కోల్పోయిన వాసన,రుచి శక్తిని తిరిగి పొందగలుగుతారు.
వెల్లుల్లి రెబ్బలు: కోల్పోయిన రుచి, వాసనను తిరిగి పొందేలా చేయడానికి వెల్లుల్లి రెబ్బలు కూడా బాగా ఉపయోగపడతాయి. దీనికోసం .. ఒక కప్పు నీటిని తీసుకుని అందులో తరిగిన మూడు వెల్లుల్లి రెబ్బలను వేసి సన్నటి మంటపై మరగబెట్టాలి. ఐదు నిమిషాల తర్వాత ఆ నీళ్లను కిందికి దించుకుని చల్లారాకా వాటిని వడగట్టుకుని తాగేయాలి. ఈ రసంలో Anti-inflammatory గుణాలు ఎక్కువగా ఉంటాయి. అవి వాసన, రుచిని తెలిసేలా చేస్తాయి.