MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • బై.. బై.. 2023.. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.. ఫ్రెండ్స్ కు, బంధువులకు ఇలా విషెస్ చెప్పేయండి

బై.. బై.. 2023.. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.. ఫ్రెండ్స్ కు, బంధువులకు ఇలా విషెస్ చెప్పేయండి

Happy New Year 2024: పాత సంవత్సరానికి బాయ్ బాయ్ చెప్పేసి, కొత్త సంవత్సరానికి వెల్ కం చెప్పేసే టైం వచ్చేసింది. అందుకే ఈ న్యూ ఇయర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, బంధువులకు, ప్రియమైన వారికి ఎలా విషెస్ చెప్పాలో తెలుసుకుందా పదండి.   

3 Min read
Shivaleela Rajamoni
Published : Dec 31 2023, 06:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
19
happy new year

happy new year

Happy New Year 2024: సంవత్సరపు చివరి రోజు ఇది. అందుకే ఈ ఇయర్ లాస్ట్ డేను చాలా మంది బాగా ఎంజాయ్ చేస్తారు. 2023 లో జరిగిన ఎన్నో మెమోరీస్ ను నెమరు వేసుకుంటారు. మంచి జరిగితే ఇవి మళ్లీ జరగాలని, చెడు జరిగితే.. కొత్త ఏడాదిలో ఇలాంటి సందర్భాలు రావొద్దని కోరుకుంటారు. మనలో చాలా మంది న్యూ ఇయర్ రిజల్యూషన్ ను కూడా రాసే పెట్టుకుని ఉంటారు. ఇక వాటిలో ఏవి జరుగుతాయి? ఏవి జరగవు అనేది కూడా మనకు తెలిసే ఉంటుంది. ఇకపోతే కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం కాబట్టి.. ఫ్రెండ్స్ కు, ఫ్యామిలీ మెంబర్స్ కు, ప్రియమైన వారికి ఎలా విషెస్ చెప్పాలో ఓ లుక్కేద్దాం పదండి. 

29
Asianet Image

నేను కిందపడ్డ ప్రతిసారీ నన్ను పైకి లేపి ముందుకు సాగడానికి ప్రోత్సహించిన మీకందరికీ థ్యాంక్స్.. హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్!

మీ కలలకు రెక్కలనిస్తూ ఈ కొత్త ఏడాది మీకు ఆత్మవిశ్వాసం, ధైర్యం ఇవ్వాలని కోరుకుంటూ.. హ్యాపీ న్యూ ఇయర్

ఈ కొత్త సంవత్సరం మీకు ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని తీసుకురావాలి. మీకు శాంతి, ప్రేమ, విజయం లభించాలి. హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు!
 

39
Asianet Image

- ఈ సంవత్సరం మీ జీవితంలో కొత్త ఆనందాన్ని, కొత్త లక్ష్యాలను, కొత్త విజయాలను, ఎన్నో కొత్త ప్రేరణలను తీసుకురావాలి. ఈ ఏడాదంతా మీరు ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను. 

- పాత సంవత్సరానికి బాయ్ బాయ్ చెప్పేయండి. అలాగే కొత్త ఆశలు, కలలతో నిండిన కొత్త సంవత్సరానికి వెల్ కం చెప్పండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు !

- గత సంవత్సరంలో జరిగిన తప్పొప్పులను ఇకమర్చిపోండి. ఈ కొత్త సంవత్సరపు ప్రారంభాన్ని ఎంతో ఉత్సాహం, ఆనందంతో స్వీకరించండి. హ్యాపీ న్యూ ఇయర్
 

49
Asianet Image

- కొత్త సంవత్సరం.. పరిస్థితులను చక్కదిద్దడానికి, మన జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని తెరవడానికి మనకు మరొక అవకాశాన్ని తీసుకువచ్చింది. హ్యాపీ న్యూ ఇయర్

- మిమ్మల్ని నవ్వించే క్షణాలు, మిమ్మల్ని బలంగా మార్చే సవాళ్లతో నిండిన సంవత్సరం ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. అలాగే మీ కలలన్నీ నిజమవ్వాలి. హ్యాపీ న్యూ ఇయర్  ఫ్రెండ్
 

59
Asianet Image

-రాబోయే సంవత్సరం నవ్వు, ప్రేమ, జీవితం అందించే అన్ని మంచి విషయాల సింఫనీగా ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ 

-ఈ నూతన సంవత్సరం మీకు ఎన్నో అవకాశాలను, ఎప్పటికీ మర్చిపోలేని మధుర క్షణాలను, జ్ఞాపకాలను తీసుకురావాలని కోరుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్

-గతం నుంచి పాఠాలు నేర్చుకుని, వర్తమానంలో జీవిస్తూ, భవిష్యత్తు అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఏడాది గడిచిపోయింది.. నూతన సంవత్సర శుభాకాంక్షలు మిత్రమా..!

69
Asianet Image

-కొత్త సంవత్సరం మీ కలలను సాధించే  ధైర్యాన్ని, మీ మార్గంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించే శక్తిని తీసుకురావాలని కోరకుంటూ హ్యాపీ న్యూ ఇయర్.. 

-రాబోయే సంవత్సరం మీకు ఆనందం, ప్రేమ, జీవితాన్ని అందంగా మార్చే అన్ని చిన్న విషయాలతో నిండి ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్!

-పాజిటివ్ వైబ్స్, మంచి ఎనర్జీ, ఏదైనా సాధ్యమే అనే నమ్మకం.. ఈ కొత్త సంవత్సరంలో మీకు కలగాలని కోరుకుంటూ.. హ్యాపీ న్యూ ఇయర్!
 

79
Asianet Image

-కలలను ఛేదించడం, హద్దులు దాటడం, అందమైన జీవిత ప్రయాణాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న కొత్త  ఏడాదికి అభినందనలు. హ్యాపీ న్యూ ఇయర్!

-సవాళ్లను స్వీకరించడం, ఎదురుదెబ్బల నుంచి పాఠాలు నేర్చుకోవడం, వచ్చిన విజయాలను అభినందించడం విజయానికి బాటలు.. నూతన సంవత్సర శుభాకాంక్షలు!
 

89
Asianet Image

'ప్రతి వయసు కొత్త పుట్టిన సంవత్సరంగా భావించింది. పండుగ ఉత్సాహానికి అనువైన సమయం." - సర్ వాల్టర్ స్కాట్

"రేపు ఇంకా తప్పులు లేని కొత్త రోజు అనుకోవడం మంచిది కాదా?" - ఎల్.ఎం.మాంట్గోమెరీ

"హొరిజోన్ ముందుకు వంగి, మార్పు కొత్త అడుగులు వేయడానికి మీకు స్థలాన్ని ఇస్తుంది." - మాయా ఏంజెలో

"కొత్త విషయం చూడాలనే ఆశతో నిద్ర లేస్తాను." - అనీ డిల్లార్డ్

"ఏ పనిలోనైనా ఆరంభం చాలా ముఖ్యమైన భాగం." - ప్లేటో
 

99
Asianet Image

గత ఏడాది పదాలు గత ఏడాది భాషకు చెందినవి కాగా, వచ్చే ఏడాది పదాలు మరో గొంతుక కోసం ఎదురు చూస్తున్నాయి. ముగింపు పలకడమంటే ఒక ఆరంభం చేయడమే." - టి.ఎస్.ఇలియట్

"ముగింపులను సెలబ్రేట్ చేసుకోండి— ఎందుకంటే అవి క్రొత్త ప్రారంభాలకు ముందు ఉంటాయి." — జోనాథన్ లాక్ వుడ్ హ్యూయ్

"ప్రతిరోజూ సంవత్సరంలో ఉత్తమమైన రోజు అని మీ హృదయంలో రాయండి." - రాల్ఫ్ వాల్డో ఎమర్సన్

"క్రొత్త ప్రారంభాల్లోని మాయాజాలం నిజంగా అన్నింటికంటే శక్తివంతమైనది." - జోసియా మార్టిన్

ఇప్పుడు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాం. ఎన్నడూ లేని విషయాలతో నిండి ఉంది." - రైనర్ మరియా రిల్కే

Shivaleela Rajamoni
About the Author
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు. Read More...
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved