హ్యాపీ ఫాదర్స్ డే: నాన్నకు ప్రేమతో.. ఇలా విషెస్ చెప్పండి
పిల్లల కోసం నాన్న పడే తపన, ఆరాటం, ఆయన ప్రేమ గురించి ఎందరో కవులు పాటల రూపంలో, మాటల రూపంలో, కవితల రూపంలో వ్యక్తపరుస్తూనే ఉన్నారు. నాన్న పైకి గంభీరంగా కనిపించినా.. ఆయన ప్రేమకు సాటి ఏదీ లేదు.

Happy Father's Day 2023
సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ఒక్క రోజునే కేటాయించినా.. ప్రతి రోజూ నాన్నదే. నాన్న లేకుండా మనం లేము. నాన్న ప్రేమకు సాటి ఏదీ లేదు. పిల్లలు పుట్టినప్పటి నుంచి నాన్న జీవితంలో మొత్తం పిల్లలే ఉంటారు. పిల్లల కోసమే జీవిస్తాడు. పిల్లల భవిష్యత్తే తన భవిష్యత్తుగా భావిస్తాడు. తనలా కాయా కష్టం చేయొద్దని రాత్రింభవళ్లు పనిచేస్తాడు. అలాంటి నాన్నకు మనం ఎంత చేసినా.. తక్కువే. ఏం చేసినా చిన్నదే. అందుకే నాన్న గొప్పతనాన్ని గుర్తించడానికి ఒక ప్రత్యేక రోజుకు కేటాయించారు. ప్రతి ఏడాది ఫాదర్స్ డేను సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ ఏడాది ఫాదర్స్ డే జూన్ 18 అంటే ఈ రోజే జరుపుకుంటుంన్నాం. మరి ఈ ఫాదర్స్ డే నాడు తండ్రులకు ఎలా విషెస్ చెప్పాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Happy Father's Day 2023
నిజంగా మీరు నా తండ్రిగా రావడం నా అదృష్టం. మీలా నన్ను ఇంత ప్రేమగా ఎవరూ చూసుకొని ఉండరు నాన్న.. హ్యాపీ ఫాదర్స్ డే
మీ బిడ్డగా నేను పుట్టినందుకు చాలా చాలా గర్వపడుతున్నాను. నాకు బెస్ట్ నాన్న ఉన్నాడు. నేను మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తున్నాను నాన్నా. హ్యాపీ ఫాదర్స్ డే
Happy Father's Day 2023
నా చిన్నప్పుడు నాతో పాటుగా మీరు కూడా పిల్లాడిలా ఉన్నందుకు, అవసరమైనప్పుడు నాకు స్నేహితుడిలా ప్రవర్తించినందుకు, దిశా నిర్ధేశం చేసే తల్లిదండ్రుల్లా వ్యవహరించినందుకు ధన్యవాదాలు. నాకు తెలిసిన బెస్ట్ మ్యాన్ నువ్వే నాన్న. హ్యాపీ ఫాదర్స్ డే.
నాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మొదటగా గుర్తొచ్చేది నువ్వే నాన్న. నీవు లేకుంటే నేను ఎలా ఉండేవాడినో.. నాకు ఎప్పుడూ నీ తోడు కావాలి నాన్న.. హ్యాపీ ఫాదర్స్ డే డాడ్..
Happy Father's Day 2023
నా మొదటి గురువువు నీవే. నా బెస్ట్ ఫ్రెడ్ వు నీవే. నీవు లేకుంటే.. నేను ఏమైపోయేవాడినో.. నీవు నా వెన్నంటే ఉన్నందుకు నేను చాలా లక్కీ.. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న..
నన్ను కష్టాల నుంచి గట్టెక్కించడానికి ఎంతో కృషి చేసిన మా నాన్నకు.. లవ్ యూ సో మచ్. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న
కాలం, దూరం మనల్ని విడదీసినా.. మీ మార్గదర్శకత్వం, సలహాలు, ప్రేమ అన్నీ నాకు అండగా ఉన్నాయి. నువ్వు లేకుండా నేను ఈ రోజు ఎలా ఉండేవాణ్ణి కాదు. హ్యాపీ ఫాదర్స్ డే
Happy Father's Day 2023
నిజం చెప్పాలంటే - మీరు లేకపోతే మీకు ఈ ప్రత్యేకమైన రోజు ఉండేది కాదు! హ్యాపీ ఫాదర్స్ డే.
నాన్నా నువ్వే నా హీరో, నా రోల్ మోడల్. నా కోసం ఎన్నో చేశావు.. చేస్తూనే ఉన్నావు. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న
హ్యాపీ ఫాదర్స్ డే.. మీరు నా తండ్రి మాత్రమే కాదు, నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా. హ్యాపీ ఫాదర్స్ డే
Happy Father's Day 2023
వయసు పెరిగే కొద్దీ నీలాంటి తండ్రి ఉండటం ఎంత ముఖ్యమో నాకు అర్థమవుతోంది. మీరు నా జీవితంలో ఎన్నో చేశారు. నాకు అవసరమైన ప్రేమ, ఆమోదాన్ని అందించారు. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న.
నా ఎదుగుదల కోసం మీరు చేసిన ప్రతిదానికీ నేను ఏం చేసినా తక్కువే. కానీ నన్ను పెంచడానికి మీరు చేసిన కృషిని నేను ఎప్పుడూ మర్చిపోలేను. నువ్వు లేకపోతే నేను ఈ రోజు ఎలా ఉండేవాణ్ణి కాదు.
ఒక అమ్మాయిని తండ్రి కంటే ఎక్కువగా ఎవరూ ప్రేమించలేరు. డాడీ నువ్వెప్పుడూ నా హీరోవి, ఎప్పటికీ నాతోనే ఉంటావు. హ్యాపీ ఫాదర్స్ డే.