- Home
- Life
- Dasara Wishes 2026: తెలుగులో ప్రేమపూర్వక దసరా శుభాకాంక్షలు.. బంధువులకు, స్నేహితులకు పంపేయండి
Dasara Wishes 2026: తెలుగులో ప్రేమపూర్వక దసరా శుభాకాంక్షలు.. బంధువులకు, స్నేహితులకు పంపేయండి
Dasara Wishes 2026: తెలుగు వారికి దసరా అతి పెద్ద పండుగ. దసరా పండుగ కోసం అంతా పట్టణాల నుంచి పల్లెలకు చేరుకుంటారు. దసరాకు మీ బంధువుకు, స్నేహితులకు తెలుగు అందంగా దసరా శుభాకాంక్షలు చెప్పేయండి.

దసరా శుభాకాంక్షలు
1. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి.
ఆ జగన్మాత ఆశీస్సులతో మీ ఇంట ఆయురారోగ్యాలు,
సుఖసంతోషాలు ఎల్లప్పుడూ వెల్లివిరియాలని కోరుకుంటూ...
మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు!
2. దుర్గాభవాని దివ్య కృపాకటాక్షాలతో
మీరు తలపెట్టిన ప్రతి కార్యం
దిగ్విజయంగా పూర్తి కావాలని మనసారా ఆకాంక్షిస్తూ...
విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు.
3. ఈ విజయదశమి మీ జీవితంలోని
ప్రతికూలతలను తొలగించి,
నవ చైతన్యాన్ని, నిండు సంతోషాన్ని
నింపాలని కోరుకుంటూ... హ్యాపీ దసరా!
4. ధర్మం, న్యాయం, సత్య మార్గంలో నడిచేవారికి
ఎల్లప్పుడూ విజయమే లభిస్తుందని గుర్తుచేసే పండుగ దసరా.
కనకదుర్గమ్మ ఆశీస్సులు మీకు సదా ఉండాలని
కోరుకుంటూ దసరా శుభాకాంక్షలు!
5. ఈ దసరా పండుగ మీ ఇంట సిరిసంపదల కాంతులు నింపి,
అనుకున్న లక్ష్యాలను చేరుకునే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ...
మిత్రులందరికీ విజయదశమి శుభాకాంక్షలు!
తెలుగులో దసరా విషెస్
6. మీ మనసులోని కష్టాలు, ఆందోళనలన్నీ దహనమై...
జీవితంలో సరికొత్త ఆశలు, విజయాలు చిగురించాలని ఆశిస్తూ
దసరా శుభాకాంక్షలు!
7. జమ్మి చెట్టు బంగారంలా మీ జీవితం ఎల్లప్పుడూ విలసిల్లాలి.
మీకు, మీ ఆత్మీయులకు విజయదశమి శుభాకాంక్షలు!
8. నవరాత్రుల భక్తి, విజయదశమి శోభ
మీ జీవితంలో ప్రతిక్షణం ఆనందాన్ని నింపాలి.
హ్యాపీ విజయదశమి!
9. చెడుపై సాధించిన విజయం
మన ఆలోచనల్లో, పనుల్లో ప్రతిఫలించాలి.
అందరికీ విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు!
10. ఈ విజయదశమి మీ కెరీర్లో
సరికొత్త మైలురాళ్లను అధిగమించే ధైర్యాన్ని,
సకల విజయాలను అందించాలని ఆకాంక్షిస్తూ...
దసరా శుభాకాంక్షలు!
విజయ దశమి విషెస్
11. మీరు ప్రారంభించే ప్రతి కొత్త ప్రాజెక్ట్ విజయం సాధించాలని,
వృత్తిపరంగా మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటూ...
హ్యాపీ దసరా!
12. నవదుర్గల అనుగ్రహంతో
మీ పనిలో నూతనోత్తేజం,
విజయాలు సొంతం కావాలని ఆశిస్తూ...
విజయదశమి శుభాకాంక్షలు!
13. అజ్ఞానంపై జ్ఞానం, అధర్మంపై ధర్మం,
చెడుపై మంచి సాధించిన మహోన్నత విజయమే విజయదశమి.
అందరికీ దసరా శుభాకాంక్షలు!
14. ఆయుధపూజతో కార్యసిద్ధి,
దుర్గామాత ఆశీస్సులతో సర్వతోముఖాభివృద్ధి
కలగాలని కోరుకుంటూ... దసరా పండుగ శుభాకాంక్షలు
15. అమ్మవారి దివ్య దీవెనలతో మీ ఇల్లు ఎల్లప్పుడూ శాంతి,
సౌభాగ్యాలతో కళకళలాడాలి. మీకు, మీ కుటుంబానికి హ్యాపీ విజయదశమి!

