జాలువారే స్ట్రెయిట్ జుట్టు కోసం.. ఇంట్లోనే ఈ హెయిర్ మాస్క్.. ఎలా అంటే..
సహజసిద్ధంగా జుట్టును స్ట్రెయిట్ చేసుకోవచ్చా...? అంటే బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. స్ట్రెయిట్ హెయిర్ చూడడానికి నీట్ గా కనిపించడమే కాకుండా చూడడానికి క్లాసీగా కూడా ఉంటుంది.
జుట్టున్నమ్మ ఏ కొప్పేసినా అందమే అని పెద్దలు చెబుతుంటారు. అయితే ఉన్న జుట్టునే ఆరోగ్యవంతంగా ఉంచుకుని, అందంగా చూపించగలిగితేనే ఆ అందం ద్విగుణీకృతం అవుతుందనేది నేటి ట్రెండ్..
hair loss
వంకర్లు లేని, రింగులు లేని స్టెయిట్ హెయిర్ చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తుంది. సినీ తారలు సెలబ్రిటీల జుట్టు పట్టుకుచ్చుల్లా.. అలా కొండమీదినుంచి జాలువారుతున్నట్టుగా నీట్ గా.. అందంగా కనిపిస్తుంది. అలాంటి జుట్టు ఉంటే బాగుండని కోరుకోని వారు ఉండరు. దీనికోసం పార్లర్ ల చూట్టూ తిరగడం.. జుట్టును స్ట్రెయిటన్ చేసుకోవడం.. చేస్తుంటారు.
అయితే అలా కాకుండా సహజసిద్ధంగా జుట్టును స్ట్రెయిట్ చేసుకోవచ్చా...? అంటే బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. స్ట్రెయిట్ హెయిర్ చూడడానికి నీట్ గా కనిపించడమే కాకుండా చూడడానికి క్లాసీగా కూడా ఉంటుంది.
దీనికోసం స్ట్రెయిట్నర్ వాడి జుట్టును పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే హెయిర్ మాస్క్ ను తయారు చేసుకోవచ్చు. దాన్ని రెగ్యులర్ గా వాడడం వల్ల జుట్టును సహజంగా స్ట్రెయిట్ గా అయ్యేలా చేసుకోవచ్చు. ఈ సహజ సిద్ధమైన హెయిర్ మాస్క్ ఎలా తయారు చేయాలి? దీనికి కావాల్సిన పదార్థాలేంటీ? అంటే..
సహజసిద్ధమైన స్టెయిటెన్ హెయిర్ మాస్క్ తయారు చేయడానికి బాగా పండిన రెండు అరటి పండ్లను తీసుకుని దాన్ని బాగా మెత్తగా చేయండి. రెండు టేబుల్ స్పూన్ల తేనె తీసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ పెరుగు తీసుకోవాలి.
ఇప్పుడు.. ఈ అన్నింటినీ ఓ గిన్నెలో వేసి బాగా కలపాలి. అంతే మీ హెయిర్ మాస్క్ రెడీ అయినట్టే.. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి.. అరగంట పాటు అలా వదిలేయాలి. అరగంట తరువాత జుట్టును నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడు సార్లు చేయాలి. జుట్టు ఎలా స్ట్రెయిట్ గా తయారవుతుందో మీరు చూస్తారు.
ఈ హెయిర్ మాస్క్ తో జుట్టు అందంగా, స్ట్రెయిట్ గా మారడమే కాకుండా.. అరటి, తేనె, పెరుగు, ఆలివ్ ఆయిల్ లలోని పోషకాలు జుట్టుకు పట్టి.. మీ జుట్టు అందంగా, ఆరోగ్యంగా, మెరుస్తూ కనిపిస్తుంది.
hair mask
ఈ హెయిర్ మాస్క్ తో జుట్టు అందంగా, స్ట్రెయిట్ గా మారడమే కాకుండా.. అరటి, తేనె, పెరుగు, ఆలివ్ ఆయిల్ లలోని పోషకాలు జుట్టుకు పట్టి.. మీ జుట్టు అందంగా, ఆరోగ్యంగా, మెరుస్తూ కనిపిస్తుంది.