నూనె ఇలా పెడితే.. జుట్టు ఊడిపోయే ప్రసక్తే ఉండదు తెలుసా..
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జుట్టు ఆరోగ్యంగా పెరగాలన్నా.. హెయిర్ ఫాల్ తగ్గాలన్నా.. జుట్టుకు నూనెను తప్పనిసరిగా పెట్టాలి. జుట్టును నూనెను పెడుతున్నామా? లేదా? అనేదే కాదు.. ఎలా పెడుతున్నామనేది కూడా ముఖ్యమంటున్నారు నిపుణులు.

ఆఫీసులకు, కాలేజీలకు వెళ్లే వారు చాలా మంది జుట్టుకు నూనెను అసలే పెట్టుకోరు. దీనివల్ల జుట్టు పొడిబారుతుంది. వెంట్రుకలు ఎర్రగా మారతాయి. అలాగే గరుకుగా కూడా అవుతుంది. అందుకే జుట్టుకు రెగ్యులర్ గా కాకున్నా.. అప్పుడప్పుడైనా నూనెను పెట్టాలి. జుట్టుకు నూనెను రాయడం వల్ల కొత్త జుట్టు మొలుస్తుంది. వెంట్రుకలు పెరుగుతాయి కూడా. అంతేకాదు జుట్టు సిల్కీగా, సాఫ్ట్ గా కూడా అవుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జుట్టు హెల్తీగా ఉండాలంటే.. హెయిర్ ఆయిల్ ను తప్పనిసరిగా ఉపయోగించాలి. అయితే జుట్టుకు నూనెను రాసుకుంటే సరిపోదు.. దాని ప్రయోజనాలను పొందాలంటే మాత్రం సరైన పద్దతిలోనే జుట్టుకు రాయాలి. ఇక నుంచి జుట్టును నూనెను ఇలానే పెట్టండి. హెయిర్ ఫాల్, డ్రై హెయిర్ వంటి ఎలాంటి సమస్యలున్నా.. ఇట్టే తొలగిపోతాయి.
ముందుగా మీ జుట్టు రకాన్ని బట్టి నూనెను కొనండి. అంటే డ్రై హెయిర్, చుండ్రు సమస్యలతో బాధపడేవారికి మార్కెట్ లో రకరకాల నూనెలు అందుబాటులో ఉంటాయి. వాటిలో మంచి వాటిని ఎంచుకోండి.
ముందుగా నూనె తీసుకోండి. దీన్ని ఒక గిన్నెలో పోసి వేడి చేయండి. ఇంకో గిన్నెలో చల్లని నీళ్లను తీసుకోండి. దీనిలో నూనె గిన్నెను పెట్టి చల్లారబెట్టండి.
ఈ నూనె గోరు వెచ్చగా అయిన తర్వాత మాడుకు అప్లై చేసి మసాజ్ చేయండి. కనీసం 20 నిమిషాలైనా నూనెను ఉంచాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో నీళ్లను వేడి చేయండి. ఈ వాటర్ లో ఒక టవల్ లో నిండా ముంచండి. ఈ టవల్ కు నీరు లేకుండా బాగా పిండండి. ఈ టవల్ ను తల మొత్తం చుట్టండి. గంట లేదా రెండు గంటల తర్వాత షాంపూతో తలస్నానం చేయండి. ఇది ఎన్నో జుట్టు సమస్యలను పోగొడుతుంది.
hair
జుట్టు విషయంలో చాలా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా హెయిర్ ఫాల్, చిన్న వయసులోనే తెల్లజుట్టు, చుండ్రు, పొడి జుట్టు వంటి సమస్యలను ఫేస్ చేస్తున్నవారు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా శీతాకాలంలో ఈ సమస్యలు మరీ ఎక్కువగా ఉంటాయి. అందుకే స్నానం చేసే రెండు గంటల ముందు జుట్టుకు నూనె పెట్టడం మర్చిపోకండి.
చుండ్రు వల్ల కూడా జుట్టు విపరీతంగా ఊడిపోతుంది. అయితే కర్ఫూరంతో చుండ్రు సులువుగా వదిలిపోతుంది. ఇందుకోసం కొద్దిగా కొబ్బరి నూనె తీసుకుని అందులో కర్పూరం కలపండి. కాసేపటి తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే సరి.
కొన్ని హెయిర్ ప్యాక్ లు కూడా చుండ్రును, హెయిర్ ఫాల్ ను పొడుతాయి. గుడ్లు, దాల్చినచెక్క నూనెతో కూడా హెయిర్ ప్యాక్ ను తయారు చేసుకోవచ్చు. దీన్ని వల్ల వెంట్రుకల గరుకుదనం పోతుంది. జుట్టు ఆరోగ్యంగా ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇందుకోసం గుడ్డు పచ్చసొనను మాత్రమే తీసుకుని బీట్ చేయండి. దీనిలో దాల్చినచెక్క నూనెను వేయండి. దీన్ని బాగా కలపండి. ఈ మాస్క్ ను నెత్తి నుంచి కొనల వరకు అప్లై చేయండి.
కొబ్బరి నూనెలో ఆముదం నూనెను మిక్స్ చేసి జుట్టుకు పెడితే.. జుట్టు సాంద్రత పెరుగుతుంది. ఈ హెయిర్ ఆయిల్ ను జుట్టుకు పెడితే.. జుట్టుకు సంబంధించిన ఎలాంటి సమస్యలైనా ఇట్టే తొలగిపోతాయి.