MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ఈ ఏడూ ఉంటే ఏ గ్రహంపైనైనా జీవించొచ్చు

ఈ ఏడూ ఉంటే ఏ గ్రహంపైనైనా జీవించొచ్చు

ఒక గ్రహంపై జీవం ఉండాలంటే చాలా విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా నీరు, గాలి, ఆహారం ఉంటే సరిపోతుందని అంతా అనుకుంటారు. కానీ శాస్త్రవేత్తల లెక్కలు వేరుగా ఉంటాయి. వారి పరిశోధనల్లో ఇప్పటివరకు జీవం ఉండటానికి అన్ని సానుకూల పరిస్థితులు ఉన్న ఏకైక గ్రహం భూమి.  మరి ఇలాంటి నివాస యోగ్యమైన గ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకొనేందుకు శాస్త్రవేత్తలు ఏమేం పరిశీలిస్తారో తెలుసుకుందామా..

1 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Aug 08 2024, 05:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

1. స్థిరమైన వాతావరణం..
సదరు గ్రహం నీటిని స్థిరంగా ద్రవ రూపంలో ఉంచాలి. ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు ఉండాలి. ఇలా ఉంటేనే ఆ గ్రహంపై జీవం నిలబడుతుంది. 
2. నక్షత్రం నుంచి సరైన దూరం
సదరు గ్రహం దాని ఆధారమైన నక్షత్రానికి కచ్చితంగా రక్షణ దూరంలో ఉండాలి. అంటే తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఉండకూడదు. నీటిని స్థిరంగా ఉంచేంత దూరంలోనే సదరు గ్రహం ఉండాలి. దీని వల్ల గ్రహంపై నీరు మరిగిపోవడం, లేక గడ్డకట్టుకుపోకుండా ఉంటుంది. అప్పుడు మాత్రమే జీవం మనుగడ సాధ్యమవుతుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

3. దట్టమైన వాతావరణం
గ్రహం చుట్టూ ఉన్న వాతావరణంలో ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్ వంటి వాయువులు కచ్చితంగా ఉండాలి. ఇవి పొరలుగా ఉండి అంతరిక్షంలోని ప్రమాదకర రేడియేషన్ నుంచి గ్రహాన్ని కాపాడతాయి. 
4.రక్షిత అయస్కాంత క్షేత్రం
అయస్కాంత క్షేత్రం హానికరమైన రేడియేషన్ నుంచి గ్రహాన్ని కాపాడుతుంది. అంతేకాకుండా సౌర గాలుల వల్ల వాతావరణం దెబ్బతినకుండా రక్షిస్తుంది. 

34

5. నీటి లభ్యత అత్యవసరం..
జీవం మనుగడ సాగించాలంటే ద్రవ రూపంలో ఉండే నీరు అత్యవసరం. ఆహారం లేకపోయినా జీవులు కొన్ని రోజుల వరకు బతకగలవు. కానీ నీరు లేకపోతే వెంటనే చనిపోతాయి. అందువల్ల సదరు గ్రహంపై నీటి ఉనికి కోసం శాస్త్రవేత్తలు పరీక్షలు చేస్తారు. 
6. శక్తి వనరుల కలయిక అవసరం..
ఏ గ్రహంపైనైనా జీవం మనుగడ సాగించాలంటే అనేక రకాల శక్తుల కలయిక అవసరం. అవి నక్షత్ర శక్తి, ఉష్ణ శక్తి, వాయు శక్తి, ఇతర గ్రహాల మధ్య దూరం మొదలైనవి. ఇవన్నీ సక్రమంగా పనిచేస్తేనే జీవం పుట్టుక, మనుగడ సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

44

7.భౌగోళిక మార్పులుండాలి..
అగ్ని పర్వతాలు ఎంతో ప్రమాదకరమని అందరూ భావిస్తారు. కాని అవి బద్దలవుతూ ఉండాలి. అప్పడు మాత్రమే వాయువులు రీసైక్లింగ్ అవుతాయి. పర్వతాలు కూడా కాలానుగుణంగా మార్పులు చెందాలి. ఇతర గ్రహాలపై ఇలాంటి వాతావరణం కోసం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తారు.  

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
IRCTC : స్లీపర్ టికెట్‌తో ఏసీలో ప్రయాణించవచ్చు.. ఈ సీక్రెట్ ట్రిక్ మీకు తెలుసా?
Recommended image2
Cotton Tops: చూడచక్కని డిజైన్ లో ప్రింటెడ్ కాటన్ టాప్స్.. ఇవిగో
Recommended image3
Silver Vaddanam: నడుము అందాన్ని పెంచే వెండి వడ్డాణాలు..భలే ఉన్నాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved