Gold Storage: బంగారం ఎలా దాచిపెట్టాలో తెలుసా?
బంగారం కొన్నప్పుడు మెరుస్తూ కనపడుతుంది. కానీ రాను రాను దాని మెరుపు తగ్గిపోతుంది. ఎన్ని సంవత్సరాలు అయినా.. కొత్తవాటిలా మెరవాలంటే వాటిని మనం దాచిపెట్టే విధానంపై ఆధారపడి ఉంటుందట. మరి, బంగారు నగలను ఎలా దాచిపెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..

బంగారం అంటే ఇష్టం లేనివాళ్లు ఎవరైనా ఉంటారా? ముఖ్యంగా భారతీయులు బంగారాన్ని అమితంగా ఇష్టపడతారు. ఇంట్లో ఏ శుభకార్యం ఉన్నా కచ్చితంగా బంగారం కొనాల్సిందే. బంగారాన్ని మంచి ఎసర్ట్ గా భావిస్తారు. అమ్మాయిలకు అయితే.. సమయం, సందర్భంతో పని లేదు.. ఎప్పుడైనా బంగారం కొనుక్కోవడానికి ఆసక్తి చూపిస్తూనే ఉంటారు.
అయితే, బంగారం కొన్నప్పుడు తళతళా మెరుస్తూ ఉంటుంది. ఆ బంగారం వేసుకుంటే మన అందం కూడా రెట్టింపు అవుతుంది. కానీ, రాను రాను అది దాని మెరుపును కోల్పోతుంది. అలా కాకుండా... ఎప్పుడు వేసుకున్నా.. కొన్నప్పుడు ఎలా మెరిసిందో అలా మెరవాలంటే.. దానిని మనం చాలా జాగ్రత్తగా దాచి పెట్టాలి. మరి, ఇంట్లో బంగారాన్ని ఎలా స్టోర్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
బంగారం ఎవరికి ఇష్టం ఉండదు? ముఖ్యంగా అమ్మాయిలకు బంగారు నగలు అంటే చాలా ఇష్టం. భారతీయులు బంగారాన్ని సంపదకు చిహ్నంగా భావిస్తారు.
అన్ని నగలను కలపకూడదు
చాలా మంది చేసే అతి పెద్ద తప్పు ఇది. తమకు ఉన్న బంగారం మొత్తాన్ని ఒకేచోట ఉంచుతారు. అంటే.. ఒకే బాక్సులో రెండు, మూడు చైన్లు ఉంచుతారు. కానీ అలా చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. అలా కలిపి ఉంచడం వల్ల ఒకదానికి మరొకటి చిక్కుకొని పాడయ్యే అవకాశం ఉంది. అందుకే.. మీ నగల భద్రత కోసం వాటిని ఒకదానికొకటి చిక్కుకోకుండా ఉండటానికి, వేర్వేరుగా ఉంచడం మంచిది.
నగలను జాగ్రత్తగా నిల్వ చేయండి
బంగారం మెత్తటి లోహం. సరిగ్గా నిల్వ చేయకపోతే గీతలు పడవచ్చు లేదా విరిగిపోవచ్చు. కాబట్టి అన్ని నగలను ఒకేచోట ఉంచడం మానుకోండి. ప్రతి నగలను వేర్వేరు సంచుల్లో ఉంచి నగల పెట్టెలో భద్రపరచండి.
నగలను తేమ నుండి రక్షించండి
తేమ నుండి నగలను రక్షించండి: తేమ బంగారానికి హానికరం. తేమకు గురైతే బంగారం మెరుపు తగ్గుతుంది. దీన్ని నివారించడానికి, మీ నగలను పొడి ప్రదేశంలో ఉంచండి. పొడి కారక పదార్థాలు లేదా సిలికా జెల్ ప్యాకెట్లను ఉపయోగిస్తే మీ నగలు తేమ నుండి రక్షించవచ్చు.
నగలను శుభ్రంగా ఉంచుకోండి
నగలను క్రమం తప్పకుండా శుభ్రం చేయండి: దుమ్ము, ధూళి మీ బంగారు నగలపై పేరుకుపోవచ్చు, దీనివల్ల నగలు మసకబారుతాయి. మృదువైన వస్త్రంతో క్రమం తప్పకుండా నగలను శుభ్రం చేయడం వల్ల దుమ్ము, ధూళి తొలగిపోతాయి.
వెండితో కలిపి ఉంచవద్దు: బంగారం సాధారణంగా దాని మెరుపును కోల్పోదు, కానీ అది వెండితో చర్య జరుపుతుంది. రంగు మారడం లేదా దెబ్బతినడం నివారించడానికి, మీ బంగారు నగలను వెండి నగల నుండి వేరుగా ఉంచండి.