MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Karthika Masam: 2026లో కార్తీక మాసం ఏరోజు నుంచి ప్రారంభమవుతుంది? ముఖ్యమైన పండుగల తేదీలు ఇవే

Karthika Masam: 2026లో కార్తీక మాసం ఏరోజు నుంచి ప్రారంభమవుతుంది? ముఖ్యమైన పండుగల తేదీలు ఇవే

Karthika Masam: కార్తీక మాసానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. 2026లో కార్తీక మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ముఖ్యమైన పండుగలేంటి? ఎన్ని రోజులు ఈ మాసం నడుస్తుంది వంటి వివరాలు ఇక్కడ ఇచ్చాము.

2 Min read
Author : Haritha Chappa
Published : Oct 27 2026, 03:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
కార్తీకమాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది?
Image Credit : Chat Gpt

కార్తీకమాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది?

హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. శివుడు, విష్ణుమూర్తిని ఆరాధించే మాసం ఇదే. అందుకే ఈ నెలను పవిత్రమైన కాలంగా భావిస్తారు. తెలుగువారి పంచాంగం ప్రకారం 2026లో కార్తీక మాసం నవంబరు 10, మంగళవారం ప్రారంభమవుతుంది. డిసెంబరు 8, మంగళవారం ముగుస్తుంది. ఈ నెలలో తెల్లవారుజామున నిద్రలేచి పవిత్ర స్నానాలు చేయడం, శివాలయాలను దర్శించడం, తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం ఆనవాయితీ. చాలామంది నెల రోజుల పాటు మాంసాహారానికి దూరంగా ఉంటూ భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. కొందరు కార్తీక సోమవారాల్లో ఉపవాసం పాటిస్తారు. ఈ నెలలో దీపారాధన చేయడం వల్ల శుభం కలుగుతుందని భక్తులు నమ్ముతారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
కార్తీక మాసం ముఖ్యమైన పండుగ
Image Credit : Pixabay

కార్తీక మాసం ముఖ్యమైన పండుగ

కార్తీక మాసంలో నాగుల చవితి, క్షీరాబ్ధి ద్వాదశి, కార్తీక పౌర్ణమి వంటి పర్వదినాలు ప్రత్యేకం. 2026 నవంబరు 13, శుక్రవారం నాగుల చవితి వస్తుంది. ఈ రోజున నాగదేవతను పూజించడం ఆనవాయితీ. నవంబరు 16, సోమవారం మొదటి కార్తీక సోమవారం వస్తుంది. నవంబరు 21, శనివారం క్షీరాబ్ధి ద్వాదశి జరుపుకుంటారు. ఈ రోజును చిలుక ద్వాదశి అని కూడా పిలుస్తారు. తులసి మొక్క దగ్గర ఉసిరి కొమ్మను ఉంచి పూజలు చేసే సంప్రదాయం ఉంది. నవంబరు 23న రెండో కార్తీక సోమవారం వస్తుంది. ఈ రోజున చాలామంది శివాలయాలకు వెళ్లి అభిషేకాలు చేయిస్తారు. శివనామస్మరణతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

33
కార్తీక పౌర్ణమి ఎప్పుడు?
Image Credit : Pixabay

కార్తీక పౌర్ణమి ఎప్పుడు?

కార్తీక మాసంలో అత్యంత ముఖ్యమైన పర్వదినాల్లో కార్తీక పౌర్ణమి ఒకటి. 2026 నవంబరు 24, మంగళవారం కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈ రోజున ఇళ్లలో, ఆలయాల్లో దీపాలు వెలిగిస్తారు. కొన్ని ఆలయాల్లో జ్వాలాతోరణం నిర్వహిస్తారు. 365 వత్తులతో దీపం వెలిగించే సంప్రదాయం కూడా ఉంది. నవంబరు 30న మూడో కార్తీక సోమవారం, డిసెంబరు 7న నాలుగో కార్తీక సోమవారం వస్తాయి. డిసెంబరు 7న మాస శివరాత్రి కూడా వస్తుంది. డిసెంబరు 8న కార్తీక అమావాస్యతో ఈ మాసం ముగుస్తుంది. ప్రాంతం, కుటుంబ సంప్రదాయాన్ని బట్టి కొన్ని పూజల తేదీల్లో మార్పులు ఉండవచ్చు. కాబట్టి పూజలు చేసేవారు స్థానిక పంచాంగాన్ని పరిశీలించడం మంచిది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఆధ్యాత్మిక విషయాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Glass Bangles: చీరల మీదకు సెట్ అయ్యే గ్లాస్ బ్యాంగిల్స్ డిజైన్లు
Recommended image2
Kulcha Capital: మనదేశంలో ‘కుల్చా క్యాపిటల్‌’గా పేరొందిన నగరమేదో తెలుసా? వరల్డ్ వైడ్ ఫేమస్ ఇది
Recommended image3
Bracelet Designs: చేతులకు మెరుపునిచ్చే వెండి బ్రేస్లెట్స్.. ఇవిగో!
Related Stories
Recommended image1
Telangana Village: తెలంగాణాలోని ఆ గ్రామంలో భూమి నుంచి సలసల కాగే నీరు.. వాటితోనే పంటలు పండిస్తున్న రైతులు
Recommended image2
Army Job: భారత సైన్యంలో పెద్ద అధికారి కావాలనుందా? ఆర్మీ ఆఫీసర్ ఎలా అవ్వాలో తెలుసుకోండి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved