Hair Growth tips: జుట్టు ఆరోగ్యంగా, పొడుగ్గా పెరగాలంటే వీటిని రోజూ తినండి..
Hair Growth tips: ఈ రోజుల్లో చాలా మందిని వేధించే సమస్య హెయిర్ ఫాల్, చుండ్రు. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండటమే కాదు.. జుట్టు రాలడం, చుండ్రు, డ్రై హెయిర్ వంటి సమస్యలన్నీ తొలగిపోతాయి.

వెంట్రుకలు వయసుతో సంబంధం లేకుండా ఊడిపోతాయి. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. పోషకాహారం తీసుకోకపోవడం, వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి వివిధ కారణాల వల్ల హెయిర్ ఊడిపోతూ ఉంటుంది.
ఆడవారికనే కాదు మగవారికి కూడా జుట్టంటే ఎంతో ఇష్టం. నల్లగా, ఒత్తుగా ఉండే జుట్టును ఇష్టపడుతుంటారు. అందుకే జుట్టు కోసం రకారకాల షాంపూలు, నూనెలను ట్రై చేస్తుంటారు. కానీ ఏ ప్రొడక్ట్ వెంట్రుకలకు మంచి చేస్తుంది ఏది చేయదు.. అన్న విషయాలను తెలుసుకోకుండా వాడితే మాత్రం జుట్టు రాలిపోయే అవకాశం ఉంది. జట్టుకు మంచి ప్రొడక్ట్స్ వాడుతూ.. తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే హెయిర్ ఫాల్ సమస్య నుంచి మీరు తొందరగా బయటపడగలుగుతారు.
అంతేకాదు కొన్ని రకాల కూరగాయలను మీ రోజు వారి ఆహారంలో చేర్చుకున్నా హెయిర్ ఫాల్ సమస్య తగ్గడంతో పాటుగా చుండ్రు కూడా వదులుతుంది. ఇందుకు ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ఆకు కూరలు.. ఆకు కూరలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీ శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు లభిస్తాయి. ఇవి జుట్టును కూడా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.
గుడ్లు.. జుట్టు ఆరోగ్యానికి గుడ్లు ఎంతో సహాయపడతాయి. గుడ్లు సంపూర్ణ ఆహారం. దీనిలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే ప్రోటీన్ కాంపోనెంట్ జుట్టు ఆరోగ్యానికి మంచి మేలు చేస్తుంది. గుడ్డులో ఉండే వివిధ పోషకాలు జట్టు రాలడాన్ని తగ్గించి.. జుట్టును బలంగా చేస్తాయి.
Sprouts
మొలకలు.. మొలకలు, చిక్కుళ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే జుట్టు బాగా పెరుగుతుంది. అంతేకాదు వీటిలో ఉండే ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. పప్పు ధాన్యాలలో ఇనుము, జింక్, బయోటిన్ వంటివి పుష్కలంగా ఉంటాయి.
చేపలు.. చేపల జుట్టు పెరుగుదలకు ఎంతో సహాయపడతాయి. సాల్మన్, మాకేరెల్, సార్డినెస్ వంటి కొవ్వు చేపలు జుట్టు పెరుగుదలకు అవసరమైన ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.
జుట్టు ఆరోగ్యానికి, పెరుగుదలకు సెలీనియం, ప్రోటీన్, విటమిన్ డి వంటి ఇతర పోషకాలు కూడా చేపల్లో పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది.