MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Rice: బరువు పెరుగుతున్నామని అన్నం తినడం మానేసారా? అదెంత ప్రమాదమో తెలుసా..

Rice: బరువు పెరుగుతున్నామని అన్నం తినడం మానేసారా? అదెంత ప్రమాదమో తెలుసా..

Rice: ప్రస్తుత కాలంలో చాలా మంది అన్నాన్ని తినడం చాలా వరకు తగ్గించారు. దీనికి కారణం శరీర బరువు పెరుగుతుందని. నిజానికి అన్నం తినడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కాదు..

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 04 2022, 04:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18


Rice: శరీర బరువు తగ్గాలనకునేవారు ముందుగా చేసే పనేంటో తెలుసా.. అన్నాన్ని తినడం పూర్తి మానేయడం లేదా తగ్గించడం. అన్నం తింటేనే బరువు పెరుగుతారని వీరు ఒక అపోహలో ఉంటారు. ఈ కారణం చేతనే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు అన్నాన్ని తినడం పూర్తిగా పెడుతున్నారు. అన్నాన్ని పూర్తిగా మానేయడం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారు కేవలం అన్నాన్నే కాదు.. ఇతర ఆహార పదార్థాలను కూడా తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. కానీ ప్రతి రోజూ ఏదో ఒక పూట మాత్రం ఖచ్చితంగా అన్నాన్ని తినాలని చెబుతున్నారు. అన్నం తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
 

28

రైస్ prebiotic గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజూ అన్నాన్ని తినడం వల్ల మన పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియాకు మంచి మేలు జరుగుతుంది. అంతేకావు ఈ మంచి బ్యాక్టీరియాకు కావాల్సిన ఆహారం కూడా అందుతుంది. మన ప్రేగులు గానీ పొట్ట గానీ ఆరోగ్యంగా ఉండేందుకు మంచి బ్యాక్టీరియాలు ఎంతో అవసరం. అందుకే ఈ బ్యాక్టీరియా ఆరోగ్యానికి అన్నం ఎంతో ఉపయోగపడుతుంది.

38

అన్నం తినేటప్పుడు ఈ విషయాలను ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. పాలిష్ చేసిన అన్నాన్ని తినడం వల్ల మన శరీరానికి ఎటువంటి లాభం ఉండదు. అందుకే పాలిష్ చేయని బియ్యాన్నే వండుకుని తినాలి. అంతేకాదు గంజి కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
 

48

అన్నం తినడం వల్ల మన బ్లడ్ లో షుగుర్ లెవెల్స్ పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అటువంటప్పుడు అన్నం తక్కువ మొత్తంలో తీసుకుని అందులో కూరలు, పప్పులు, నెయ్యి వంటివి ఎక్కువ మొత్తంలో వేసుకుని తింటే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. 

58

అన్నం తినడం వల్ల నిద్ర తొందరగా పడుతుంది. అంతేకాదు అన్నం చాలా ఫాస్ట్ గా డైజెస్ట్ అవుతుంది. దాంతో పొట్ట తేలిగ్గా ఉంటుంది. అంతేకాదు అన్నం తినడం వల్ల హర్మోన్లు సమతుల్యంగా కూడా ఉంటాయి.

68

అన్నం తినడం వల్ల చర్మానికి మేలు జరుగుతుంది. అంతేకాదు ఇది జుట్టు పెరుగుదలకు కూడా బాగా సహకరిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

78
Curd rice

Curd rice

అన్నంలో కొలెస్ట్రాల్, ఎలాంటి ఫ్యాట్స్ ఉండవు. కాబట్టి మనం అన్నాన్ని తింటే బరువు పెరుగుతామన్న అపోహలేమీ పెట్టుకోవద్దు. అన్నానికి బదులుగా మనం నిత్యం తీసుకునే నూనె పదార్థాలు, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. అంతేకాదు వ్యాయామం చేయకపోవడం వల్ల కూడా శరీర  బరువు పెరుగుతుంది. అంతేకాని అన్నం తినడం వల్ల మన శరీరానికి కొవ్వు పెరగదు. 
88


బియ్యంలో పిండి పదార్థాలు ఎక్కువగానే ఉంటాయి. కానీ ప్రోటీన్లు ఉండవనేది మాత్రం పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే ఈ అన్నంలో పుష్కలంంగా ప్రోటీన్లు లభిస్తాయి. ఇవి శరీర నిర్మాణానికి ఎంతగానో సహాయపడతాయి. సుమారుగా ఒక కప్పు బియ్యం ద్వారా మనకు 3 నుంచి 4 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 


 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
Latest Videos
Recommended Stories
Recommended image1
Summer Drinks: ఇవి తాగితే చాలు..వేసవి అంతా కూల్ కూల్‍గా ఉండొచ్చు
Recommended image2
Spring Onion Benifits: ఆహారంలో ఇవి తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
Recommended image3
Baby Anklets: 15 గ్రాముల్లో చిన్నారుల కోసం వెండి పట్టీలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved