MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Fig Benefits: అంజీర పండు పురుషులకు ఓ వరం.. దీన్ని తింటే ఎన్ని సమస్యలు తగ్గుతాయో తెలిస్తే షాక్ అవుతారు..

Fig Benefits: అంజీర పండు పురుషులకు ఓ వరం.. దీన్ని తింటే ఎన్ని సమస్యలు తగ్గుతాయో తెలిస్తే షాక్ అవుతారు..

Fig Benefits: అంజీర పండు నోటికి రుచిగానే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. ముఖ్యంగా పురుషుల అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఇది ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 31 2022, 10:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

బిజీ లైఫ్ కారణంగా చాలా మంది పురుషులు తమ ఆరోగ్యం గురించి పూర్తిగా పట్టించుకోవడమే మానేసారు. ముఖ్యంగా పోషకాహారం తీసుకోకపోవడంతో.. ఎన్నో దీర్ఘాకాలిక అనారోగ్య సమస్యలను ఫేస్ చేస్తున్నారు. అయితే పురుషులను ఆరోగ్యంగా ఉంచడంలో అంజీర అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని రోజూ తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

అంజీర లో మెగ్నీషియం, విటమిన్ ఎ, ఐరన్, విటమిన్ బి1, విటమిన్ బి 2, సోడియం, పాస్ఫరస్, క్లోరిన్, కాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు వీటిలో పాలిఫినోల్స్, ఫ్లవనోయిడ్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. 
 

38
అంతేకాదు షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్ లో ఉంటాయట. అధికరక్తస్రావంతో బాధపడేవారికి అంజీర చక్కటి ఔషదం లా పనిచేస్తుంది. దీనిని ఉసిరిపొడితో కలిపి తీసుకుంటే.. రక్తహీనత తగ్గుతుంది. అంజీరా ఆకులను నీళ్లలో కాచిచల్లార్చి తాగితే పొడి దగ్గు, గొంతు నొప్పి తగ్గుతాయి.

అంతేకాదు షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్ లో ఉంటాయట. అధికరక్తస్రావంతో బాధపడేవారికి అంజీర చక్కటి ఔషదం లా పనిచేస్తుంది. దీనిని ఉసిరిపొడితో కలిపి తీసుకుంటే.. రక్తహీనత తగ్గుతుంది. అంజీరా ఆకులను నీళ్లలో కాచిచల్లార్చి తాగితే పొడి దగ్గు, గొంతు నొప్పి తగ్గుతాయి.

కొంచెం తీయగా, కొంచెం వగరుగా ఉండే ఈ పండు పురుషుల్లో ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

48

అంజీరలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీన్నిరెగ్యులర్ గా తినడం వల్ల అజీర్థి సమస్యలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా మలబద్దకం సమస్యతో బాధపడేవారు ఈ పండును ఖచ్చితంగా తినాలి. దీన్ని తినడం వల్ల ప్రేగు కదలికలు మెరుగుపడతాయి. మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం దొరుకుతుంది. 

58

బరువును తగ్గించడంలో కూడా అంజీర పండు ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. అలాగే జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు అంజీరను తింటే ఎక్కువగా ఫుడ్ ను తీసుకోలేరు. ఆకలి కూడా అనిపించదు. 

68

గుండె జబ్బులు తగ్గుతాయి

మన దేశంలో రోజు  రోజుకు హార్ట్ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా గుండె సమస్యలు పురుషులకే ఎక్కువగా వస్తున్నాయి. అందులోనూ అమ్మాయిలతో పోల్చితే అబ్బాయిలు ఇంటి ఫుడ్ కంటే బయట దొరికే ఆయిలీ ఫుడ్ నే ఎక్కువగా తింటుంటారు. దీనివల్ల వారి శరీరంలో కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగిపోయి.. గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. 
 

78

ఇలాంటి పరిస్థితిలో వీళ్లు ఆరోగ్యంగా ఉంచేందుకు అంజీర పండ్లు ఎంతో సహాయపడతాయి. ఎందుకంటే వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే అధిక రక్తపోటును కూడా నియంత్రణలో ఉంచుతాయి. 
 

88

అత్తి పండ్లను ఎన్నో రకాలుగా తీసుకోవచ్చు. వీటిని పచ్చిగా లేదా వండుకుని కూడా తినొచ్చు. అయితే చాలా మంది వీటిని డ్రై ఫ్రూట్స్ గా తింటుంటారు. ఈ పండ్ల ద్వారా పురుషులు బెనిఫిట్స్ ను పొందాలనుకుంటే ఈ డ్రై ఫ్రూట్ ను నీళ్లలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తినాలి. అది కూడా పరిగడుపున. రాత్రి పాలలో కలుపుకుని కూడా వీటిని తీసుకోవచ్చు.  

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Bali Earrings: రూ.150కే అదిరిపోయే బాలి చెవి రింగుల డిజైన్లు
Recommended image2
Plus Size Kurti: బొద్దుగా ఉండే అమ్మాయిలకు సూటయ్యే బెస్ట్ కుర్తీలు
Recommended image3
Helmet: వేస‌విలో హెల్మెట్ ధ‌రిస్తున్నారా.? ఈ త‌ప్పులు అస్స‌లు చేయకండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved