ఈ పండు తింటే శృంగారంలో రెచ్చిపోతారంతే..
అంజీరా పండులో ప్రోటీన్లు, కాల్షియం, పాస్ఫరస్, మెగ్నీషియం, ఐరన్, విటమిన్లు , ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని ప్రతిరోజూ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాదు వీటిని తినడంతో రతిక్రీడలో రెచ్చిపోతారట.
- FB
- TW
- Linkdin
Follow Us

అంజీరా పండుగా పిలవబడే అత్తిపండులో పోషక విలువలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ముఖ్యంగా వీటిలో జింక్, ఐరన్, ఖనిజాలు, మాంగనీస్, పాస్ఫరస్, మెగ్నీషియం, ఫైబర్, విటమిన్ ఎ, బి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మన ఆరోగ్యానికే కాదు, చర్మం సౌందర్యానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది.
ముఖంపై ఉండే మొటిమలను, మొటిమల తాలూకు నల్లని మచ్చలను మటుమాయం చేయడంలో ఇవి ఎంతో సహాయపడతాయి. అంతేకాదు స్కిన్ పట్టుకుచ్చులా మెరిసిపోవడానికి, కాంతి వంతంగా, మృదువుగా మారడానికి అత్తిపండ్లు ఎంతో సహాయపడతాయి. ఈ అంజీరా పండ్లను తింటే Digestive system మెరుగుపడుతుంది.
ఇమ్యూనిటీ: అంజీరా పండును తింటే మలబద్దకం, కడుపు ఉబ్బరం సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ అత్తి పండ్లలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే ఈ పండ్లు మన బాడీకి అవసరమయ్యే శక్తిని కూడా ఇస్తాయి. ముఖ్యంగా వీటిని తినడం వల్ల మన బరువు నియంత్రణలో ఉంటుంది.
వీటిని తరచుగా తింటే Blood circulation మెరుగుపడుతుంది. అంతేకాదు అత్తిపండ్లు ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి సహాయపడతాయట. ఈ పండ్లలో ఉండే సల్ఫర్, ప్రోటీన్లు, కాల్షియం, విటమిన్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాదు ఇవి బలహీనతను, అలసటను దూరం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
డయాబెటిస్ పేషెంట్లకు మేలు: అత్తి పండు ఎన్నో రోగాలను దూరంగా చేస్తుంది. వీటిని తరచుగా తినడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి. కాగా మధుమేహులు వీటిని వల్ల డయాబెటీస్ నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబతున్నారు. అంతేకాదు నెలసరి సక్రమంగా అవడానికి కూడా ఈ పండ్లు బాగా ఉపయోగపడతాయి. పురుషుల్లో వీర్యకణాలు వృద్ధి చెందేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయని వైద్యులు పేర్కొంటున్నారు. ఎండిన అత్తిపండ్లను నీటిలో రాత్రంతా నానెబట్టి ఉదయం తినాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
హైపర్ టెన్షన్ ను నియంత్రించడంలో అత్తిపండులోని పోటాషియం, మినరల్స్ బాగా ఉపయోగపడతాయి. పెదాల పగుళ్లు, నోట్లో పుండ్లు, నాలుక మంట వంటి సమస్యలకు చక్కటి పరిష్కారంలా ఉపయోగపడుతుంది. ఈ సమస్యలున్న వారు ప్రతిరోజూ అత్తిపండ్లను తింటే మంచి ప్రయోజనం కలుగుతుంది.
శృంగారానికి సన్నద్ధం చేస్తుంది.. సెక్స్ లో చురుగ్గా ఉండేందుకు అత్తి పండు బాగా ఉపయోగపడుతుంది. దీన్ని తినడం వల్ల బలహీనత పోయి సెక్స్ కు సన్నదమవుతారని నిపుణులు చెబుతున్నారు. ఈ అత్తిపండ్లను అలాగే లేదా ఖర్జూర లేదా బాదం లేదా ఇతర డ్రై ఫ్రూట్స్ తో తింటే మంచి ఫలితం ఉంటుంది. వీటిని వెన్నతో కలిపి తింటే శరీరానికి శక్తి లభిస్తుంది. బీపీ తగ్గుతుంది. హై బ్లడ్ ప్రెజర్ తో బాధపడేవారు ప్రతిరోజూ ఈ పండ్లను తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది.