లైఫ్ చాలా ఇరిటేటింగ్ గా ఉందా? ఈ చిన్న మార్పులు మీ జీవితాన్నే మార్చేస్తాయి
9-5 జాబ్ చేస్తూ, ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయలేక ఇబ్బంది పడుతున్నారా? జీవితం చాలా ఒత్తిడిగా అనిపిస్తోందా? మీ రెగ్యులర్ వర్క్స్ డిస్టర్బ్ అవ్వకుండా ఈ చిన్న మార్పులు చేసుకుంటే లైఫ్ చాలా హ్యాపీగా సాగిపోతుంది. అవేంటో తెలుసుకుందాం రండి.

ఒకప్పుడు అందరూ హ్యాపీగా జీవించే వారు. కారణం కులవృత్తులు. అంటే కుటుంబం మొత్తం ఒకే పని చేసేవారు. వ్యవసాయమో, వ్యాపారమో.. ఏదైనా కుటుంబంలో అందరూ కలిసిమెలిసి పనిచేసుకొనే వారు. అందులో ఒకరికి ఏదైనా ఇబ్బంది వచ్చినా మిగిలిన వారంతా సాయం చేసే వారు. అది ఫైనాన్షియల్ గానైనా, ఆరోగ్య పరంగానైనా ఎలాంటి సాయమైనా కలిసిమెలిసి చేసేవారు. అందువల్ల ఎలాంటి ఇబ్బందులు వచ్చేవి కావు.
మరి ఇప్పుడు ఎవరి ఉద్యోగాలు వారివి. ఎవరి వ్యాపారాలు వారివి. ఒక కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురు వేర్వేరు ప్రొఫెషన్స్ లో ఉంటున్నారు. ఎవరి పని ఒత్తిడి వారిది. ఎవరి ఇబ్బందులు వారివి. ఫైనాన్షియల్ గానే కాకుండా ఆరోగ్య సమస్యలు వచ్చినా దగ్గరకు వెళ్లి సాయం చేయలేని పరిస్థితులు. భార్య, పిల్లలతోనూ సంతోషంగా గడపలేని విధంగా మారిపోతున్నారు. అందుకే ఎవరికి వారు ఒంటరితనాన్ని బాగా అలవాటు చేసుకుంటున్నారు.
కాని ఇలాంటి జీవన విధానం చాలా ఇబ్బందులు తెచ్చిపెడుతుందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. నేనెప్పుడూ ఒంటరి వాడినే అన్న భావన ఆత్మహత్యకు ప్రేరేపిస్తుందని, తన కోసం నలుగురు ఉన్నారన్న భావన లేకపోతే జీవించడం వ్యర్థంగా అనిపిస్తుందని చెబుతున్నారు.
ఇలాంటి ఆలోచనలకు కారణం.. ప్రస్తుతం మనం గడుపుతున్న ఇబ్బందికరమైన జీవన విధానమే. ఈ కాలంలో ఎవరూ సూర్యోదయానికి ముందు లేవడం లేదు. ముఖ్యంగా పట్టణాల్లో ఉండే వాళ్లు, జాబ్స్ చేసే వాళ్లు అసలు సూర్యోదయాన్నే మర్చిపోయారు. టైమ్ కి ఫుడ్ తీసుకోవడం మానేశారు. సరిగ్గా నిద్ర పోవడం లేదు. ఎప్పుడు ఏది పడితే అది చేయడం వల్ల శరీరంలో సహజంగా జరగాల్సిన పనులు జరగక అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అందుకే ప్రతి ఒక్కరు ఒంటరితనానికి అలవాటు పడుతున్నారు.
ఇలా కాకుండా ఉండాలంటే ఈ ప్లాన్ ఫాలో అయిపోండి. మీ శరీరంలోనూ, జీవితంలోనూ అద్భుతమైన మార్పులు చూస్తారు.
ప్రతి రోజు ఇలా..
రాత్రి 9 దాటిన తర్వాత ఉదయం 9 గంటల లోపు అస్సలు సోషల్ మీడియా జోలికి పోవద్దు.
రోజు సూర్యోదయం టైమ్ లో 20 నిమిషాలు వర్కవుట్స్ చేయండి.
ఉదయం, సాయంత్రం కనీసం 5 నిమిషాలు మెడిటేషన్ చేయండి.
రోజుకు కనీసం 4 లీటర్లు మంచినీరు తాగండి.
వారంలో ఇలా..
వారంలో ఒక రోజు రాత్రి మీ భార్యతో హాయిగా గడపండి. మీకు పెళ్లి కాకపోతే ఒంటరిగా, ఎటువంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా గడపండి.
వారంలో ఒకరోజు రాత్రి అసలు ఫోన్ ముట్టుకోకుండా మీకు నచ్చిన పుస్తకాలు చదవండి.
వారంలో ఒక రోజు కనీసం గంట సేపు మీ భార్యతో గాని, మీకు క్లోజ్ ఫ్రెండ్ తో గాని మనస్ఫూర్తిగా మాట్లాడండి.
నెలలో ఇలా..
వీకెండ్ లో అస్సలు వర్క్ జోలికి వెళ్లకండి.
నెలలో ఒకరోజు మీకు నచ్చిన విధంగా ఎంజాయ్ చేయండి.
నెలలో ఒకరోజు మీ శరీర అందం పెంచుకోవడానికి కేటాయించండి. అంటే హెయిర్ కట్, మసాజ్, ఎక్కువ సేపు పడుకోవడం ఇలాంటివి.