Father's day 2022: నువ్వే నా హీరో.. ఐ లవ్ యూ డాడీ.. ఫాదర్స్ డే విషెస్, కోట్స్..
Father's day 2022: తల్లిదండ్రుల ప్రేమ వెల కట్టలేనిది. అందుకే ఈ ఫాదర్స్ డే సందర్భంగా మీ నాన్నపై ఉన్నప్రేమనంతా చెప్పిండి. ఇందుకోసం కొన్ని మెసేజెస్, కోట్స్ ఇక్కడ ఉన్నాయి..

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తండ్రులందరికీ ప్రేమను, కృతజ్ఞతను తెలియజేయడానికి జూన్ మూడవ ఆదివారం ఫాదర్స్ డే ను జరుపుకుంటారు. కుటుంబంలో Emotional గా, ఆర్థికంగా, మానసికంగా తండ్రులు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. వారు కుటుంబాలకు వెన్నెముక వంటివాళ్లు. ముఖ్యంగా పిల్లలకు తండ్రులు రోల్ మోడల్ గా నిలుస్తారు. ఇలాంటి తండ్రికి ఈ ఫాదర్స్ డే సందర్బంగా ఎలా విష్ చేయాలనుకుంటున్నారు. ఇదిగో మీ ఫాదర్స్ ను ఆశ్చర్యపర్చడానికి, వారిపై ఉన్న ప్రేమను తెలియజేయడానికి మీకు ఈ మెసేజెస్, కోట్స్ ఉపయోపడతాయి.
Father's day 2022
"నాన్నా, నువ్వు ఎప్పుడూ చాలా కూల్ గా ఉండేవాడివి - అమ్మ 'నో' అన్నప్పుడు నువ్వు 'అవును' అని చెప్పిన సందర్భాల్లాగే" – అజ్ఞాతవాసి.
"డియర్ డాడీ, నేను జీవితంలో ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఎప్పుడూ నా నంబర్ వన్ మనిషిగా ఉంటావు." – Unknown
"నా హృదయాన్ని దొంగిలించిన ఒక అమ్మాయి ఉంది.. ఆమె నన్ను డాడీ అని పిలుస్తుంది." – Unknown
Father's day 2022
"నాన్న: ఒక కొడుకు మొదటి హీరో, ఒక కూతురి తొలిప్రేమ." —అజ్ఞాతవాసి
"పిల్లల జీవితంలో తండ్రి శక్తి సాటిలేనిది." —జస్టిన్ రిక్లెఫ్స్
"ఒక త౦డ్రి వ౦దమ౦ది స్కూల్ టీచర్ల కంటే ఎక్కువ." —జార్జ్ హెర్బర్ట్
"ఒక అమ్మాయి మొదటి నిజమైన ప్రేమ ఎవరంటే.. ఆమె తండ్రే." —మారిసోల్ శాంటియాగో
Father's day 2022
" తండ్రి ఎప్పుడూ నిన్ను ప్రేమిస్తున్నానని నీకు చెప్పడు. చేతల్లో చూపిస్తుంటాడు" —దిమిత్రి ది స్టోన్ హార్ట్
" ప్రతి గొప్ప కుమార్తె విజయం వెనుక తండ్రే ఉంటాడు."- Unknown
" ప్రతి కూతురుకు తండ్రి పేరు.. ప్రేమకు మారు పేరుగా నిలుస్తుంది. " -ఫన్నీ ఫెర్
"నేను ఎంత పెద్దవాడినైతే, మా నాన్న అంత తెలివైనవాడిలా కనిపిస్తాడు." -టిమ్ రస్సెర్ట్
" నాన్నా అనే పదం తప్ప చెవులకు ఏ స౦గీతమూ అ౦త ఆహ్లాదకర౦గా ఉ౦డదు." —లిడియా మరియా చైల్డ్
fathers day
" తండ్రి అంటే మీరు ఎంత ఎత్తుగా ఎదిగినా.. సరే మీరు పైకి చూసే వ్యక్తి." — Unknown
"ఎవరూ చూడనప్పుడు తన పిల్లలతో ఎలా వ్యవహరిస్తాడనేదే త౦డ్రికి గొప్ప గుర్తు." —డాన్ పియర్స్
"నాన్నలు ప్రేమతో.. హీరోలుగా, సాహసికులుగా, కథ చెప్పేవారిగా, పాటల గాయకులుగా మారిన చాలా సాధారణ పురుషులు." — Unknown
"మీరు పడిపోయినప్పుడు మిమ్మల్ని పట్టుకోవాలనుకునే వ్యక్తి తండ్రి. — Unknown
"ఈ ప్రపంచంలో ఒక అమ్మాయిని ఆమె తండ్రి ప్రేమించినంతగా మరెవ్వరూ ప్రేమించలేరు." -మైఖేల్ రత్నదీపక్
"నా తండ్రి ఎవరు అన్నది ముఖ్యం కాదు. అతను ఎవరనేది నాకు గుర్తున్న విషయం." —అన్నే సెక్స్టన్
"నేనెప్పటి వరకు కలిసిన ఏ వ్యక్తి కూడా మా నాన్నగారితో సమానం కాదు, నేను మా నాన్నను ప్రేమించినంతగా మరెవరినీ ప్రేమించలేదు." -హేడీ లామర్
"మనలో ఉన్నదాన్ని ప్రేమించే ధైర్యం ఉన్న కొంతమంది వ్యక్తులు ఉంటారు. అలాంటి వాళ్లలో ఒకరు నా తండ్రి." -అలిసన్ లోహ్మాన్