- Home
- Life
- Father's Day 2022: ఈ ఫాదర్స్ డే ను మీ నాన్న ఎన్నటికీ మర్చిపోకూడదంటే.. ఇలా సెలబ్రేట్ చేయండి..
Father's Day 2022: ఈ ఫాదర్స్ డే ను మీ నాన్న ఎన్నటికీ మర్చిపోకూడదంటే.. ఇలా సెలబ్రేట్ చేయండి..
Father's Day 2022: నాన్న గొప్పతనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తన జీవితాన్ని పిల్లల కోసం ధారపోసి.. ఎప్పుడూ వెన్నంటే ఉండి నడిపిస్తాడు మన నాన్న. అలాంటి నాన్నకోసం ఈ ఫాదర్స్ డే ఎన్నటికీ మర్చిపోకుండా సెలబ్రేట్ చేయండి.

ప్రేమ తప్ప స్వార్థం అంటే ఏంటో తెలియని వ్యక్తి నాన్న. పిల్లలు పుట్టాక ఆ తండ్రికి పిల్లలే ప్రపంచం బతుకుతాడు. అప్పటి నుంచి వాళ్ల జీవితమంతా పిల్లల గురించి ఆలోచిస్తారు. పనిచేస్తారు. అలాంటి నిస్వార్థ తండ్రి గురించి చెప్పడానికి అక్షరాలు సరిపోవు. మా అమ్మే నన్ను ఎక్కువగా ఇష్టపడుతుంది. మా నాన్నకు నేనంటే ఇష్టం లేదు అనేవాళ్లు చాలా మందే ఉంటారు. మీకు ఒకటి తెలుసా.. అమ్మలు లాగ నాన్నలు ప్రేమను మాటల్లో చెప్పలేరు. చేతల్లో చూపిస్తారు. మీ కోసం కష్టపడటం, మంచి చదువులు చదివించడం, నచ్చినవి కొనిపించడం ఇవన్నీ మీ నాన్న ప్రేమకు గుర్తులే. మీ ఆనందమే మీ నాన్న ఆనందం. మీరు బాధపడుతుంటే చూడలేరు. మీ ప్రతి కష్టంలో తోడుంటారు. మీరు సరైన మార్గంలో వెళ్లాలనే గంభీరంగా ఉంటారు తప్ప మీపై ప్రేమ లేక కాదు. వాళ్ల భవిష్యత్తంతా మీ కోసం ధారపోస్తారు. అలాంటి నాన్నకోసం ఈ ఫాదర్స్ డే (జూన్ 19) రోజున మీనాన్న విష్ చేయండి. మీ నాన్న అంటే ఎంత ఇష్టమో తెలియజేయండి. ఈ ఫాదర్స్ డే కు మీ నాన్నను సంతోష పెట్టే సెలబ్రేషన్స్ ఐడియాలు ఇక్కడ ఉన్నాయి. అవేంటంటే..
Father's day 2022
1. ట్రిప్ ప్లాన్ చేయండి: ఫాదర్స్ డే జూన్ 19న అంటే ఆదివారం కాబట్టి మీరు నాన్నతో ఎక్కడైనా ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. ఎలాగు సండేలు సెలవులే కాబట్టి.. మీ నాన్నతో జాలీగా గడపండి. మీ నాన్నకు ఇష్టమైన ప్రదేశం.. వెళ్లాళని ఉన్నా.. ఇంతవరకు వెళ్లని ప్లేస్ కు ట్రిక్ తీసుకెళ్లండి. శుక్రవారం సాయంత్రం లేదా శనివారం ఉదయం బయలుదేరండి. పని ఒత్తిడి, కుటుంబ భాద్యతల ఉపశమనం కలిగించడానికి ఇదే మంచి అవకాశం కూడా. ఇది ఆయనను ఎంతో సంతోషపెడుతుంది కూడా.
2. వారికి నచ్చిన వంటకాన్ని తయారు చేయండి: ఫాదర్స్ డే సందర్భంగా మీరు మీ నాన్నకు నచ్చిన వంటకాన్ని వండటం లేదా.. మీ నాన్నతో కలిసి ఆ వంటను వండితే.. మీ నాన్న ఆనందానికి అవదులు ఉండవేమో.. ఆ సందర్భాన్ని ఎన్నటికీ మర్చిపోడు కూడా. మీ చేతితో మీ నాన్నకు ఇష్టమైన వంటను వండటం ఆయనకు ఎంతో సంతోషాన్నిస్తుంది కూడా.
Father's day 2022
3. పార్టీని ప్లాన్ చేయండి: మీరు కావాలనుకుంటే ఈ రోజును ప్రత్యేకంగా చేయడానికి ఇంట్లో పార్టీని కూడా ప్లాన్ చేయొచ్చు. ఈ పార్టీకి మీ నాన్నగారి పాత స్నేహితులను, కొలిగ్స్ ను కూడా ఆహ్వానించవచ్చు. బిజీ లైఫ్ స్టైల్ కారణంగా చాలాసార్లు స్నేహితులతో కలిసి కూర్చునే సమయం దొరకదు. అందుకే ఇలా పార్టీని ఏర్పాటు చేస్తే మీ నాన్న వాళ్లను చూసి ఎంతో సంతోషిస్తారు. పాత స్నేహితులు, స్నేహితులతో కలుసుకోవడం వాళ్లతో టైం స్పెండ్ చేయడం చాలా సరదాగా ఉంటుంది. ఇది వారికి ఒక రకమైన ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది.
Father's Day
4. వెరైటీగా ఏదైనా చేయండి: నాన్నతో ఎక్కువ సమయం గడపడానికి ఆ రోజును డిఫరెంట్ గా ప్లాన్ చేయండి. గోర్డింగ్ (Gording), పెయింటింగ్ (Painting), డ్యాన్స్ లేదా వ్యాయామాలను చేయొచ్చు. అలాగే వారికి ఇష్టమైన సినిమాలను కలిసి చూడటానికి లేదా ఆటలు ఆడటానికి లేదా బయట భోజనం లేదా విందు వంటి వాటి ద్వారా కూడా మీ నాన్నను సర్ ప్రైజ్ చేయొచ్చు.