Father's day 2022: ‘నాన్నకు ప్రేమతో’ ఈ గిఫ్టులను ప్రెజెంట్ చేయండి..
Father's day 2022: ఒక పిల్లాడికి తండ్రే రోల్ మోడల్, గైడ్, సూపర్ హీరో, సంరక్షడు. ఏ తండ్రైనా సరే తమ పిల్లలకు తండ్రిలా కాకుండా ఒక మంచి ఫ్రెండ్ లా ఉండటానికే ఇష్టపడతాడు. అంతేకాదు.. మీ ప్రతి కష్టంలో వెన్నంటే ఉంటాడు. అలాంటి నాన్నకు ఫాదర్స్ డే సందర్భంగా ఎలాంటి గిఫ్ట్ ను ఇస్తున్నారు.

Father's day 2022
ఫాదర్స్ డే (Father's day 2022) ను ప్రతి ఏడాది జూన్ మూడో ఆదివారం (జూన్ 19) నాడు జరుపుకుంటారు. సమాజంలో తండ్రి పాత్రను, గొప్పతనాన్ని గుర్తించి కృతజ్ఞతలు చెప్పడానికి ఈ రోజును సెలబ్రేట్ (Celebrate) చేసుకుంటారు. ఇలాంటి గొప్ప నాన్నకు ఈ రోజున తనపై ఉన్న ప్రేమను తెలియజేయండి. మీ డాడ్ పై ఉన్న ప్రేమను గిఫ్ట్ ల రూపంలో కూడా తెలియజేసి వారిని ఆశ్చర్యపరచొచ్చు. మరి ఇందుకోసం ఫాదర్స్ డే నాడు మీ నాన్నకు ఎలాంటి గిఫ్ట్ లు ఇవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
వాలెట్ (Wallet): ఫాదర్స్ డే సందర్భంగా మీ నాన్నకు బహుమతిగా పర్సు ను ప్రెజెంట్ చేయండి. ఎందుకంటే ప్రతి ఫాదర్.. ఖచ్చితంగా వాలెట్ ను వాడుతారు. ఏ తండ్రైనా సరే తన గురించి ఏనాడు ఖర్చు చేయడు. తన పిల్లలకు ఏమవసరమవుతుంది అనే చూస్తాడు తప్ప.. నాకు ఇది కావాలి, అది కావాలి అని ఏనాడు అనుకోడు. అలాంటి నాన్నకు ఈ ఫాదర్స్ డే సందర్భంగా మంచి పర్సును గిఫ్ట్ గా ఇవ్వండి. వీటి ధర ₹ 500 నుంచి ₹ 1000 మధ్య ఉంటుంది.
ఫిట్ నెస్ బ్యాండ్ (Fitness band): ఫాదర్స్ డే సందర్భంగా మీరు మీ డాడ్ ను ఫిట్ గా ఉంచాలనుకున్నట్టైతే.. మీ నాన్నకు ఒక ఫిట్ నెస్ బ్యాండ్ ను బహుమతిగా ఇవ్వండి. ఈ ఫిట్ నెస్ వారి ప్రతి యాక్టివిటీని చూసుకుంటుంది.
Medical equipment: ఒక వయస్సు దాటిన తర్వాత ప్రతి ఒక్కళ్లూ తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంటి భాద్యతలను చూసుకోవడంలో ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే నాన్నలు ఎప్పుడూ తమ ఆరోగ్యాన్ని అస్సలు పట్టించుకోరు. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అటువంటి పరిస్థితిలో ఫాదర్స్ డే నాడు మీరు మీ తండ్రికి రక్తపోటు యంత్రం (Blood pressure machine) లేదా డయాబెటిస్ మెషిన్ (Diabetes machine)వంటి ఏదైనా ఒక Medical equipment ను బహుమతిగా ఇవ్వొచ్చు. వీటి ధర 1,000 రూపాయల నుంచి 1,500 రూపాయల వరకు ఉంటుంది.
చొక్కా (Shirt): మీరు మీ నాన్నకు ఏదైనా స్టైలిష్ గిఫ్ట్ ను ఇవ్వాలనుకున్నట్టైతే.. ఒక మంచి చొక్కా (Shirt)ను బహుమతి (Gift)గా ఇవ్వవొచ్చు. ఎందుకంటే మీ నాన్న తనకోసం ఎప్పుడూ సపరేట్ గా షాపింగ్ కు వెళ్లడు. ఉన్నదాంతోనే సరిపెట్టుకునే వారు చాలా మందే ఉన్నారు. అలా౦టి పరిస్థితిలో.. ఫాదర్స్ డే రోజున వారికి ప్రత్యేక౦గా అనిపి౦చే౦దుకు మంచి చొక్కాను బహుమతిగా ఇవ్వండి.
స్లోగన్ మగ్ (Slogan mug): ఫాదర్స్ డే సందర్భంగా మీ తండ్రిపై ఉన్న ప్రేమను తెలిపే మంచి కోట్స్ ఉన్న మగ్ ను ప్రెజెంట్ చేయొచ్చు. ఆ మగ్ పై మీ నాన్న ఫోటోను కూడా ముద్రించవచ్చు. లేదా దానిపై మీనాన్నపై ఉన్న ప్రేమనంతా అక్షరాల రూపంలో ముద్రించవచ్చు.
పెన్నులు (Pens): ఆఫీసుల్లో పనిచేసే తండ్రులకు పెన్ను అవసరం చాలా ఉంటుంది. ఫాదర్స్ డే రోజున మీరు మీ నాన్న కోసం మంచి పెన్ను తీసుకోవచ్చు. దీని ధర రూ.500 నుంచి రూ .2000 మధ్యన ఉంటుంది. మీ బడ్జెట్ ను బట్టి మీ నాన్న కోసం ఏదైనా ఒక పెన్నును కొనండి.
షూస్ (Shoes): మీ నాన్న కోసం ఈ ఫాదర్స్ డే సందర్బంగా స్పోర్ట్స్ షూస్ (Sports Shoes) లేదా ఆఫీస్ వేర్ షూ (Office wear shoe)లను కొనొచ్చు. ఇవి మీ డాడ్ ను స్టైలిష్ లుక్ (Stylish look) లో కనిపించేలా చేస్తాయి. ఇవి 100 రూపాయల నుంచి అందుబాటులో ఉంటాయి. మీ బడ్జెట్ కు అనుగుణంగా మీ నాన్నకు కంఫర్ట్ ను బట్టి షూలను బహుమతిగా ఇవ్వండి.