లీప్ ఇయర్.. ఫిబ్రవరి 29న పుట్టిన ప్రముఖులు ఎవరో తెలుసా?
నిజానికి ఈ అరుదైన రోజున పిల్లలు కనాలని ఎవరూ అనుకోరు. ఎందుకంటే.. పుట్టిన రోజు నాలుగేళ్లకు వస్తుందని ఫీలౌతూ ఉంటారు. అయితే.. ఈ లీప్ సంవత్సరంలో జన్మించిన సెలబ్రెటీలు కొందరు ఉన్నారు. వాళ్లెవరో ఈ రోజు తెలుసుకుందాం..

leap year
లీప్ ఇయర్..ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఫిబ్రవరి నెలలో మామూలుగా అయితే 28 రోజులే ఉంటాయి. కానీ నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఫిబ్రవరి నెలలో 29 రోజులు వస్తాయి. అందుకే దానిని లీప్ సంవత్సరం అంటారు. ఈ అరుదైన రోజున చాలా తక్కువ మంది పుట్టడం జరుగుతుంది. నిజానికి ఈ అరుదైన రోజున పిల్లలు కనాలని ఎవరూ అనుకోరు. ఎందుకంటే.. పుట్టిన రోజు నాలుగేళ్లకు వస్తుందని ఫీలౌతూ ఉంటారు. అయితే.. ఈ లీప్ సంవత్సరంలో జన్మించిన సెలబ్రెటీలు కొందరు ఉన్నారు. వాళ్లెవరో ఈ రోజు తెలుసుకుందాం..
1.మెరార్జీ దేశాయ్...
భారత మాజీ ప్రధాని మెరార్జీ దేశాయ్ అందరికీ సుపరిచితమే. స్వాతంత్ర్య సమరంలో పాలు పంచుకున్నఈ మహనీయుడు ఫిబ్రవరి 29వ తేదీనే పుట్టారు.1896 ఫిబ్రవరి 29న ఆయన జన్మించారు. ఆయన తన జీవితకాలంలో కేవలం 24 పుట్టిన రోజులు మాత్రమే జరుపుకున్నారు. ఆయన 99 సంవత్సరాలు జీవించారు.
2.ప్రకాష్ నంజప్ప..
ప్రముఖ ఇండియన్ షూటర్,, ఒలంపిక్ విజేత, అర్జున అవార్డు విజేత ప్రకాష్ నంజప్ప సైతం లీపు సంవత్సరంలోనే జన్మించారు.ఆయన ఫిబ్రవరి 29,1976లో జన్మించారు. 2014 కామన్ వెల్త్ గేమ్స్ లో ఆయన సిల్వర్ పతకం గెలిచారు.2014 ఇంచియాన్ ఏషియన్ గేమ్స్ లో బ్రోంజ్ మెడల్ కూడా సాధించారు.
3.రుక్మిణీ దేవి..
ప్రముఖ భరతనాట్యం డ్యాన్సర్ రుక్మిణీ దేవి కూడా లీపు ఇయర్ లో జన్మించారు. 1904, ఫిబ్రవరి 29న జన్మించారు. కలాక్షేత్ర ఫౌండర్ గా గుర్తింపు పొందారు.
4.పెడ్రో సాంచెజ్..
స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ కూడా లీప్ ఇయర్ లోనే జన్మించారు. ఆయన 1972లో ఫిబ్రవరి 29వ తేదీన జన్మించారు.