Holi 2025: మీ పిల్లలకు హోలీ గురించి ఈ విషయాలు చెప్పారా?
హోలీ పండగ గురించి మీ పిల్లలకు ఏం చెప్పారు..? కచ్చితంగా చెప్పాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. మరి, అవేంటో తెలుసుకుందామా...

హోలీని ఇష్టపడనివారు ఎవరైనా ఉంటారా? ఒకరిని మరొకరు రంగులు పూసుకుంటూ ఆనందంగా గడుపుతారు. ఈ పండగను ప్రతి సంవత్సరం అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ, ఈ హోలీ పండగ గురించి మీ పిల్లలకు ఏం చెప్పారు..? కచ్చితంగా చెప్పాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. మరి, అవేంటో తెలుసుకుందామా...
ఐక్యతతో ఆడుకోవడం..
హోలీ పండగ ముఖ్య ఉద్దేశం.. రంగులతో ఆడుకోవడం. ఎలాంటి బేధాలు, తేడాలు లేకుండా ఆడుకోవడం అనే విషయాన్ని పిల్లలకు చెప్పాలి. అంతేకాదు ఈ పండగ ప్రేమ, ఆనందం, ఐక్యతను సూచిస్తుంది. ఉన్న సమస్యలన్నీ పక్కన పెట్టి.. సంతోషంగా, నవ్వుతూ ఈ పండగను జరుపుకోమని పిల్లలకు మనం నేర్పించాలి.
రంగుల పండుగ
హోలీని రంగుల పండుగ అని పిలుస్తారు.ఉత్సాహభరితమైన రంగులు,నీటి బుడగలతో ఒకరిని మరొకరు కొట్టుకుంటూ, ఆటపాటలతో డ్యాన్సులు చేస్తూ.. ఒకరితో మరొకరు మనస్ఫూర్తిగా, ఐక్యతగా జరుకుపుకోవాలి. ఇక్కడి వరకు అందరికీ తెలుసు. కానీ.. ఈ పండగ వెనక కూడా ఓ కథ ఉంది. హోలీ కూడా చెడు పై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది. నర్సింహస్వామి అవతారం, ప్రహ్లాదుని పుట్టుక నేపథ్యంలో ఈ పండగ మొదలైంది. నర్సింహుడు... హిరణ్యకశ్యపుడిని చంపడం, హోలికా పురాణాలు వినే ఉంటారు. ఆ కథలను కూడా మీరు ఈ పండగ నేపథ్యంలో పిల్లలకు చెప్పాలి.
హోలీ హోలికా దహన్‌తో ప్రారంభమవుతుంది, ఇది ప్రతికూలత ,చెడును తగలబెట్టడాన్ని సూచించే ఆచారం.దయ, సానుకూలత,కొత్త అవకాశాలను స్వీకరించడానికి ప్రజలను ప్రోత్సహిస్తుంది.
రుచికరమైన స్వీట్లు
పండుగ సమయంలో గుజియా, మాల్పువా,తండై వంటి ప్రత్యేక హోలీ విందులను ఆస్వాదిస్తారు, ఇళ్లను ఆహ్లాదకరమైన సువాసనలతో నింపుతారు.వేడుకను మరింత పండుగగా,రుచికరంగా చేస్తారు.హోలీ ప్రజలను ఒకచోట చేర్చుతుంది, కులం, మతం ,హోదా అడ్డంకులను తొలగిస్తుంది. పిల్లలకు.ఐక్యత , స్నేహం విలువ నేర్పుతుంది.
సంగీతం ,నృత్యం
ఈ పండుగ శక్తివంతమైన సంగీతం, జానపద పాటలు ,ఉల్లాసమైన నృత్య ప్రదర్శనలతో నిండి ఉంటుంది, ఇది పిల్లలు మరియు పెద్దలకు ఒక ఉత్సాహభరితమైన,ఆహ్లాదకరమైన అనుభవంగా మారుతుంది.హోలీ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుకుంటారు.వివిధ దేశాలలో రకరకాలుగా ఈ పండగను జరుపుకుంటారు.