రాత్రి పూట పెరుగు తినకపోవడమే మంచిదంటున్న నిపుణులు.. ఎందుకంటే?
కాలాలతో పాటుగా మన ఆహారపు అలవాట్లలో కూడా మార్పూ వస్తూ ఉంటుంది. అయితే కొన్ని అనారోగ్య సమస్యలున్న వారు రాత్రి పూట పెరుగును తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే..?

ఎండాకాలం ఈ మధ్యనే మొదలైంది. అప్పుడే ఎండలు పొద్దంతా దంచి కొడుతున్నాయి. ఎండ దాటికి చాలా మంది పగటి పూట బయటకి వెల్లడానికి జంకుతున్నారు. ఈ సంగతి పక్కన పెడితే.. ఎండాకాలం రాకతో మన ఆహారపు అలవాట్లు కూడా మారాయనే చెప్పాలి. ఈ వేడి నుంచి మనల్ని రక్షించడానికి కొన్ని రకాల ఆహారాలు ఎంతో సహాయపడతాయి.
ఇక వేసవి కాలం రాగానే అన్ని ఇండ్లల్లో పెరుగు పక్కాగా ఉంటుంది. పెరుగుతో మజ్జిక, పెరుగు పులుసు వంటి వెరైటీలను చేసుకుని తింటూ ఉంటారు.
పెరుగు వేసవి తాపం నుంచి మనల్ని రక్షించడంతో పాటుగా .. ఎన్నో అనారోగ్య సమస్యను కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా ఈ వేడికి మన బాడీలోని తేమ పూర్తిగా తగ్గిపోకుండా చూస్తుంది. అంతేకాదు మన రోగ నిరోధక శక్తిని కూడా పెంచడానికి పెరుగు ఎంతో సహాయపడుతుంది.
పెరుగును క్రమం తప్పకుండా తినడం వల్ల జీర్ణ శక్తి మెరుగు పడుతుంది. అలాగే ఎముకలను బలంగా చేస్తుంది. ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు ప్రతి రోజూ పెరుగును తమ డైట్ లో చేర్చుకోవాలని చెబుతున్నారు. ఎందుకంటే పెరుగు బరువు తగ్గించడానికి ఎంతో సహాయపడుతుందట.
ఎండాకాలం ప్రతిరోజూ పెరుగును తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. అయితే జలుబు, దగ్గు ఇతర అనారోగ్య సమస్యలున్న వారు పెరుగును రాత్రిపూట ఎట్టిపరిస్థితిలో తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా పెరుగును పండ్లతో కలిపి అస్సలు తినకూదని హెచ్చరిస్తున్నారు. పెరుగును చేపలు, మాసం, కోడికూర వంటి కూరలను తినే సమయంలో పెరుగు జోలికి పోకపోవడమే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పెరుగుకు బదులుగా మజ్జిగను తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవని నిపుణులు పేర్కొంటున్నారు. పెరుగులో కొద్దిమొత్తంలో మిరియాల పౌడర్, ఉప్పు, జీలకర్రను మిక్స్ చేసి తాగితే Digestive system మెరుగ్గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది నిత్యం తాగడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అలాగే ఎముకలు బలంగా మరుతాయి. వెయిట్ లాస్ అవుతారు. శరీరంలో పేరుకుపోయిన ఫ్యాట్ కరుగుతుంది.