జలుబు తగ్గాలని కాషాయం మరీ ఎక్కువగా తాగేయకండి.. లేదంటే ఈ సమస్యలొస్తయ్ జాగ్రత్త..
దగ్గు, జలుబు తగ్గాలని కాషాయాన్ని రోజూ తాగే వారు చాలా మందే ఉన్నారు. నిజానికి కాషాయం మన ఆరోగ్యానికి మంచిదే.. కానీ అతిగా అస్సలు తాగకూడదు. తాగితే ఈ సమస్యలు వస్తాయి.

చలికాలం వచ్చేసింది. ఇక ఈ సీజన్ లో జలుబు, దగ్గు, జ్వరాలు ఎక్కువగా వస్తుంటాయి. వీటిని తగ్గించుకోవడానికి చాలా మంది మెడిసిన్స్ కంటే కాషాయాన్నే ఎక్కువగా తాగుతుంటారు. నల్ల మిరియాలు, దాల్చిన చెక్క, శొంఠి, పసుపు, అశ్వగంద, యాలకులు వంటి వాటితో కాషాయాన్ని తయారుచేస్తారు. కాషాయాన్ని తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలా అని రోజుకు 3 నుంచి 5 కప్పుల కాషాయాన్ని తాగితే శరీరానికి మంచి జరిగేది పోయి.. హాని జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం పదండి.
గ్యాస్ సమస్య
ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవడానికి, దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది అవసరానికి మించి కాషాయాన్ని తెగ తాగేస్తుంటారు. కానీ దీన్ని అతిగా తాగడం వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడుతంది. అందుకే దీన్ని మోతాదుకు మించి అసలే తాగకూడదు.
ముక్కు సమస్యలు
కాషాయాన్ని మరీ ఎక్కువగా తాగేస్తే ముక్కుకు సంబంధించిన సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే కాషాయం ఎక్కువగా తాగితే ముక్కు పొడిబారుతుంది. లేదా ముక్కులోంచి రక్తం కారే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు.
కడుపులో ఆమ్లం ఏర్పడుతుంది
కొంతమంది జలుబు తొందరగా తగ్గాలని కాషాయాన్ని ఎక్కువగా తాగేస్తుంటారు. ఇలా తాగేవారి కడుపులో ఆమ్లం ఏర్పడుతుంది. దీనివల్ల కడుపులో చికాకు పెడుతుంది. అజీర్థి సమస్యలువ స్తాయి. అందుకే దీన్ని ఎక్కువగా తాగకండి.
నోటిలో బొబ్బలు
ముఖ్యంగా పగటిపూట కాషాయాన్ని మళ్లీ మళ్లీ తాగితే.. దాని నుంచి ప్రయోజనాలను పొందాల్సింది పోయి.. తీవ్రమైన హాని కలుగుతుంది. ఎందుకంటే దీనివల్ల నోట్లో బొబ్బలు ఏర్పడతాయి. దీనివల్ల తినడానికే కాదు.. నీళ్లు, ఇతర పానీయాలు తాగడానికి కూడా కష్టంగానే ఉంటుంది.
తరచుగా మూత్రవిసర్జన
కాషాయం ఎక్కువగా తాగడం వల్ల మూత్ర వ్యవస్థపై కూడా చెడు ప్రభావం పడుతుంది. కాషాయాన్ని ఎక్కువగా తాగడం వల్ల వాష్ రూం కు మళ్లీ మళ్లీ వెళ్లాల్సి వస్తుంది. అంతేకాదు మూత్రంలో చికాకు కూడా ఉంటుంది.