చంకలు నల్లగా మారాయా? కారణం ఇదే కావొచ్చు..
underarms : వ్యాక్సింగ్, షేవింగ్ వల్ల చంకలు నల్లగా మారుతూ ఉంటాయి. షేవింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య తలెత్తే అవకాశమే ఉండదు.

ప్రస్తుతం చాలా మంది యువతులు ఎదుర్కొంటున్నాసమస్య అండర్ ఆర్మ్స్ . ఈ సమస్య వారిని కుదురుగా ఉండనివ్వదు. నాకే ఎందుకయ్యింది? నాకే ఇలా కావాలా? ఇది పోవాలంటే ఏం చేయాలంటూ స్ట్రెస్ కు గురవుతుంటారు. ఈ సమస్య కారణంగా వారు స్లీవ్ లెస్ డ్రస్ లను వేసుకోలేక పోతుంటారు.
ఈ అండర్ ఆర్మ్స్ సమస్యకు చెక్ పెట్టేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. మన చర్మంపై రంగు మారడం అనేది కామన్. కానీ చంకల్లో రంగు మారితే మాత్రం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. పైగా చంకల్లో నలుపు దనం పోవడం అంత సులువు కాదు కూడా. హెయిర్ రిమూవల్ టెక్నిక్స్ తెలియకపోతే, కొన్ని రకాల డియోడరెంట్స్ యూజ్ చేయడం వల్ల కూడా స్కిన్ కలర్ మారుతుందని నిపుణులు చెబుతున్నారు.
మరి చంకలు నల్లగా మారకూడదంటే ఎలాంటి చిట్కాలో ఫాలో అవ్వాలో తెలుసుకుందాం పదండి.. చంకలు నల్లగా మారుతుంటే మీ డియోడ్రెంట్ బ్రాండ్ ను ఛేంజ్ చేయండి. దీనివల్ల మీకు అండర్ ఆర్మ్స్ సమస్య తగ్గొచ్చు.
షేవింగ్: రేజర్ కారణంగా స్కిన్ ఇరిటేషన్ కు గురవుతుంది. ముఖ్యంగా షేవింగ్ సమయంలో ఎక్కువ ప్రెషర్ ను పెడితే ఈ సమస్య వస్తుంది. కాబట్టి షేవింగ్ చేసేటప్పుడు ప్రెజర్ ఎక్కువ పెట్టకండి.
సన్ స్క్రీన్: చంకలు నల్లగా మారకూడదంటే.. సీజన్ తో సంబంధం లేకుండా సన్ స్ట్రీన్ లోషన్ ను ఉపయోగించండి. దీనిని అప్లై చేస్తే కూడా అండర్ ఆర్మ్స్ సమస్య రాదు.
వదులుగా ఉండే దుస్తులు: మరీ బిగుతుగా దుస్తులను కూడా వేసుకోకూడదు. అలా వేసుకుంటే హైపర్ పిగ్మెంటేషన్ సమస్య వస్తుంది. కాబట్టి వదులుగా ఉండే బట్టలనే ధరించండి.
ఫిట్నెస్: ఫిట్ గా ఉంటే కూడా ఈ సమస్య రాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శరీర బరువు మరీ ఎక్కువగా కూడా ఈ సమస్య వస్తుంది. కాబట్టి బరువును నియంత్రించండి. అప్పుడే చంకలు నల్లబడవు. ఈ టిప్స్ ను రెగ్యులర్ గా ఫాలో అయితే అండర్ ఆర్మ్స్ ప్రాబ్లమ్ కి సెల్యూషన్ దొరుకుతుంది.