ప్లేట్ లెట్స్ పెరగాలంటే బొప్పాయి పండును తినాల్సిందే..
Papaya Benefits: బొప్పాయి పండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వీటిని తినడం వల్ల ప్లేట్ లేట్స్ బాగా పెరుగుతాయి. మలేరియా, డెంగ్యూ వంటి ప్రమాదకర జబ్బుల నుంచి తొందరగా కోలుకోవడానికి బొప్పాయి పండు ఎంతో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Papaya Benefits: కలుషితమైన వాతావరణం, మారుతున్న జీవన శైలి కారణంగా ఎన్నో రోగాలు మనల్ని అటాక్ చేస్తున్నాయి. వాటినుంచి బయటపడాలన్నా, ఎలాంటి జబ్బులు సోకకూడదన్నా.. మనం తీసుకునే ఆహారం పోషకాలతో కూడినదై ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
మనకు మంచి చేసే ఆహార పదార్థాల్లో బొప్పాయి పండు ఒకటి. దీనిని తరచుగా తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ పండును తినడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
ప్రమాదకరమైన డెంగ్యూ, మలేరియా వంటి సమస్యల నుంచి త్వరగా కోలుకోవడానికి బొప్పాయి పండు ఎంతో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే బొప్పాయి పండులో యాంటీ మలేరియా లక్షణాలు ఉంటాయని.. వాటిని తింటే ఈ సమస్య నుంచి తొందరగా కోలుకుంటారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
బొప్పాయి పండే కాదు బొప్పాయి చెట్టు ఆకు తిన్నా డెంగ్యూ లక్షణాల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు వీటివల్ల ప్లేట్ లెట్స్ సంఖ్య కూడా పెరుగుతుందట.
బొప్పాయి పండును జ్యూస్ చేసి అందులో కాస్త నిమ్మరసం కలిపి తాగితే డెంగ్యూ జ్వరం నుంచి తొందరగా బయటపడతారని నిపుణులు చెబుతున్నారు. ఈ జ్యూస్ ను రోజుకు రెండు మూడు సార్లు తాగితే చక్కటి ఫలితం ఉంటుంది.
ఈ బొప్పాయి పండును చర్మం సౌందర్యానికి కూడా ఉపయోగిస్తారు. మంచిగా పండిన పండును పేస్ట్ లా చేసుకుని ముఖానికి రాసుకుంటే చర్మంపై పేరుకు పోయిన మలినాలన్నీ తొలగిపాతాయి. ముఖం నిగ నిగా మెరిసిపోతుంది.
ఈ పండులో పీచు పదార్థం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అంతేకాదు ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఈ పండును డిన్నర్ తర్వాత తింటే Digestion బాగా అవుతుందట.
బొప్పాయి పండులో పొటాషియం, ఫైబర్, ఫ్లవనోయిడ్స్, మినరల్స్, మెగ్నీషియం ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే విషపదార్థాలను బయటకు పంపడానికి సహాయపడతాయి.
బొప్పాయి పండును తింటే బరువు పెరుగుతామన్న భయం ఉండదు. ఎందుకంటే ఈ పండులో కేలరీలు చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి.
కిడ్నీల్లో రాళ్లున్న వారికి బొబ్బాయి బెస్ట్ మెడిసిన్ లా పనిచేస్తుంది. ఈ పండును తినడం వల్ల కిడ్నీల్లో రాళ్లు కరిగిపోతాయట.
అలాగే తరచుగా నీరసంగా, అలసటగా ఉన్న వారు బొప్పాయిని తింటే మంచిది. ఈ పండు Red blood cells ను పెంచి మనల్ని బలంగా తయారుచేస్తుంది. అంతేకాదు ఇందులో భయంకరమైన క్యాన్సర్ తో పోరాడగల గుణాలను కలిగి ఉంటుంది.
గర్భాశయ క్యాన్సర్ నుంచి త్వరగా బయటపడటానికి బొప్పాయి పండు మెడిసిన్ లా పనిచేస్తుంది. అంతేకాదు కళ్ల సమస్యలను ఎదుర్కొనే వారికి ఇది మేలు చేస్తుంది. అయితే ఈ పండును గర్భిణులు మాత్రం ఎట్టిపరిస్థితిలో తినకూడదు.