Pulses: పప్పులను అతిగా తింటే మీ పని అంతే ఇక..
Pulses: పప్పులు మన శరీరానికి మంచి చేసేవే అయినా.. వీటిని మితిమీరి తింటే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Pulses: ఎండాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది ఇళ్లల్లో పప్పుచార్లే కనిపిస్తుంటాయి. ఎండాకాలంలో ఫ్రై ల కూరలను తినడానికి జనాలు ఇష్టపడరు. అందుకే పల్చగా పప్పు చార్లను చేసుకుని తింటుంటారు. రోజు తప్పించి రోజు తినమన్నావిసుక్కోకుండా లాగించేస్తుంటారు. ఇవి మన ఆరోగ్యానికి మంచి చేసేవే. అంతేకాదు వీటి నుంచి మనకు ఎన్నో పోషకాలు లభిస్తుంటాయి కూడా.
pulses
అయితే పప్పు చార్లు అతిగా తింటే మాత్రం అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోకతప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవును.. పప్పులు మంచి చేసేవే అయినా.. వాటిని మితిమీరితింటే మాత్రం ఎన్నో ప్రాబ్లమ్స్ ను ఏరికోరి మన జీవితంలోకి ఆహ్వానించినట్టే అవుతుంది.
పప్పుల్లో ప్రోటీన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటివల్ల కడుపు నొప్పి,గ్యాస్ట్రిక్, అజీర్థి వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు పప్పులను ఎక్కువగా తింటే కిడ్నీలపై చెడు ప్రభావం పడుతుంది.
పప్పులను అధికంగా తీసుకోవడం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఈ పప్పుల్లో ఉండే ఆక్సలేట్ వల్లే రాళ్లు ఏర్పడతాయి.
థైరాయిడ్ పేషెంట్లు పప్పులను ఎక్కువగా తినడం ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే పప్పులు ముందే ప్రోటీన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇక థైరాయిడ్ పేషెంట్లు పప్పులను ఎక్కువగా తీసుకుంటే వారి బాడీలో ప్రోటీన్లు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల థైరాయిడ్ సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది.
మీకో విషయం తెలుసా.. పప్పులను ఎక్కువగా తీసుకుంటే చాలా ఫాస్ట్ గా వెయిట్ పెరుగుతారు. ఎందుకంటే ఇందులో ఉండే ప్రోట్లను కేలరీలను పెంచుతాయి. కాబట్టి పప్పు చార్లను ఎక్కువుగా తినకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.