curd with sugar: పెరుగులో చక్కెరను కలుపుకుని తింటే ఇన్ని సమస్యలు తగ్గుతాయా..!
Curd with sugar: పెరుగు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో కాస్త షుగర్ ను కలుపుకుని తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

curd with sugar: పెరుగు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. దీనిలో కాల్షియం (Calcium) పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను (Bones) బలంగా చేస్తుంది. ఇక పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా (Good bacteria)పేగులను హెల్తీగా ఉంచుతుంది.
ఇలాంటి పెరుగులో షుగర్ ను కలుపుకుని తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెరుగును ఇలా తినడం వల్ల మానసిక ఆరోగ్యంతో పాటుగా శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పెరుగు హెల్తీ ఫుడ్. దీనిలో మంచి బ్యాక్టీరియా మనకు ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. పెరుగులో చక్కెరను కలిపి తీసుకుంటే గ్లూకోజ్ స్థాయిలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ ఎండాకాలం పెరుగును తింటే హైడ్రేటెడ్ గా ఉండటంతో పాటుగా ఎనర్జిటిక్ గా కూడా ఉంటారు.
పెరుగులో చక్కెరను కలుపుకుని తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. అలాగే జీర్ణవ్యవస్థ కూడా మెరుగ్గా పనిచేస్తుంది. అలాగే దీనిలోని మంచి బ్యాక్టీరియా Colon cancer బారి నుంచి మనల్ని రక్షిస్తుంది.
మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో పంచదార పెరుగును మిక్స్ చేసి తింటే పొట్ట ఆరోగ్యంగా.. చల్లగా ఉంటుంది. ఇలా ఉదయం పూట తినడం వల్ల ఎసిడిటీ, కడుపులో చికాకు, మంట వంటి సమస్యలు తగ్గిపోతాయి.
అంతేకాదు ఇది మన శరీరంలో ఉండే విష పదార్థాలను సైతం బయటకు పంపిస్తుంది. పెరుగు పంచదార మిశ్రమం మెమోరీ పవర్ ను కూడా పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే అలసట, ఒత్తిడి వంటి సమస్యలను కూడా తగ్గించడానికి సహాయపడుతుంది.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (Urinary tract infection) సమస్యతో బాధపడేవారికి చక్కెర కలిపిన పెరుగు మంచి మెడిసిన్ లా పనిచేస్తుంది. దీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఈ సమస్య తొందరగా తగ్గుతుంది. అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
అయితే దీనిని కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని తీసుకోకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు పెరుగు చక్కెర మిశ్రమాన్ని డాక్టర్ ను సంప్రదించిన తర్వాతే వాడాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.