MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • పెదవులు పగలకూడదంటే ఏం చేయాలి?

పెదవులు పగలకూడదంటే ఏం చేయాలి?

చలికాలంలో ఒక్క మడమలే కాదు.. పెదవులు కూడా బాగా పగులుతుంటాయి. మడమల మాదిరిగానే పెదవులు కూడా బాగా పగిలితే వాటి నుంచి రక్తం కారుతుంటుంది. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే పెదవులు చలికాలంలో కూడా పగలవు. అలాగే పగిలిన పెదవులు తొందరగా నయమవుతాయి. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Dec 01 2024, 10:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

చలికాలంలో వచ్చే అతి పెద్ద సమస్య పెదవులు పగలడం.ఈ సీజన్ లో ఇది సర్వ సాధారణ సమస్య. కానీ దీనివల్ల పెదవుల రూపు రేఖలు పూర్తిగా మారిపోతాయి. పెదవుల మంట కలుగుతుంది. దీనివల్ల ప్రతి ఒక్కరూ ఇబ్బందిగా ఫీలవుతారు. అయితే పెదవులు పగలకుండా ఉండేందుకు చాలా మంది ఎన్నో చిట్కాలను పాటిస్తుంటారు. అయినా ఎలాంటి ఫలితం ఉండదు. 

25

అంతేకాకుండా చలికాలంలో పెదవులు పగలడం వల్ల కొన్ని కొన్ని సార్లు వాటినుంచి రక్తం కూడా కారుతుంటుంది.  లేదా తినేటప్పుడు పెదవులకు కారం అంటుకుంటుంది. దీనివల్ల చాలా నొప్పి కలుగుతుంది. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే మాత్రం చలికాలంలో కూడా మీ పెదవులు పగలకుండా ఉంటాయి. అలాగే సాఫ్ట్ గా , అందంగా ఉంటాయి. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

35

చలికాలంలో పెదవులు పగిలిపోకుండా ఉండటానికి చిట్కాలు:

కొబ్బరి నూనె & తేనె:

కొబ్బరి నూనె, తేనెను ఉపయోగించి చలికాలంలో పెదవులు పగిలిపోకుండా చూసుకోవచ్చు. ఇందుకోసం ఒక గిన్నె తీసుకుని అందులో ఒక స్పూన్ కొబ్బరి నూనె, తేనె వేసి బాగా కలపండి. దీన్ని రాత్రిపడుకునే ముందు పెదవులకు రాయండి. మరుసటి రోజు ఉదయాన్నే నీళ్లతో పెదవులను కడగండి. ఇలా చేస్తే పెదవుల పగుళ్లు తగ్గి, మృదువుగా మారుతాయి.

కలబంద గుజ్జు:

అవును కలబంద గుజ్జు పగిలిన పెదాలను నయం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం కొంచెం తాజా కలబంద గుజ్జును తీసుకుని పెదవులకు రాయండి. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో పెదవులను కడగండి. ఇలా చేస్తే మీ పెదవులు తేమగా ఉంటాయి. మృదువుగా మారుతాయి.

45

కీరదోసకాయ

 కీరదోసకాయ డ్రైగా మారిన పెదవులకు తేమను అందిస్తుంది. మీ పెదవులు పగిలితే కీరదోసకాయ ముక్కను తీసుకుని పెదవులపై బాగా రుద్దండి. దీనివల్ల మీ పెదవులు మృదువుగా మారుతాయి.

నెయ్యి:

నెయ్యి కూడా పెదాల పగుళ్లను నయం చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. నెయ్యిలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు  పుష్కలంగా ఉంటాయి. ఇవి మన చర్మ కణాలకు తేమను అందిస్తాయి. పగిలిన పెదవులపై నెయ్యిని తరచుగా రాస్తే అవి త్వరగా నయమవుతాయి. 

55

చలికాలంలో పెదవులను ఎలా సంరక్షించుకోవాలి : గుర్తుంచుకోండి: 

1. పెదవులు తేమగా ఉంటే పగుళ్లు ఏర్పడవు. ఇందుకోసం మీరు వాజ్ లైన్ వాడొచ్చు. ఇది మీ పెదవులను మృదువుగా ఉంచుతుంది. పగుళ్లు ఏర్పడకుండా రక్షిస్తుంది. 

2. ఒక్క మన చర్మానికి మాత్రమే కాదు.. పెదవులకు కూడా ఎండ నుంచి రక్షణ అవసరం. కాబట్టి పగటివేళ మీరు బయటకు వెళితే.. ఎస్‌పీఎఫ్ ఉన్న లిప్ బామ్ ను వాడండి. ఇది అతినీలలోహిత కిరణాల వల్ల కలిగే నష్టం నుంచి మీ పెదవులను రక్షిస్తుంది.

3. చాలా మందికి పెదవులను కొరికే లేదా నాకే అలవాటు ఉంటుంది. కానీ ఇది అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది కూడా పెదవులు పగలడానికి కారణమవుతుంది. కాబట్టి మీకు ఈ అలవాటుంటే వెంటనే మానుకోండి. 

4. మీ పెదవులు పగిలితే లిప్‌స్టిక్ ను అస్సలు వాడకండి. లేదంటే పెదవులు మరింగ పగులుతాయి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Floral Hairstyles: ఈ ఫ్లోరల్ హెయిర్ స్టైల్స్ చూస్తే మతిపోతుంది
Recommended image2
Couple Bracelets: క్యూట్ కపుల్ మ్యాచింగ్ బ్రేస్‌లెట్ డిజైన్లు
Recommended image3
Gold Earrings: అరగ్రాము బంగారంతో చిన్నారికి అదిరిపోయే చెవిపోగులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved