Beauty Tips: మెరిసే కళ్ళ కోసం ఈ చిట్కాలు వాడండి.. డార్క్ సర్కిల్స్ ను తగ్గించుకోండి?
Beauty Tips: ఒత్తిడి నిద్రలేమి జీవనశైలి లో మార్పుల వల్ల ఏర్పడే నల్లటి వలయాలతో బాధపడుతున్నారా.. అయితే ఈ సింపుల్ చిట్కాలు పాటించండి డార్క్ సర్కిల్స్ ని తగ్గించుకోవడంతోపాటు మెరిసే కళ్ళని సొంతం చేసుకోండి.

నిరంతరం లాప్టాప్ ముందు గడుపుతున్న ఈ రోజుల్లో కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అనేవి సాధారణంగా అందరూ ఎదుర్కొనే సమస్యే. అయితే ప్రారంభ దశలోనే వీటిని గుర్తించి తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలి లేదంటే ఆ నల్లటి మచ్చలు శాశ్వతంగా ఉండిపోయే ప్రమాదం ఉంది.
సౌందర్య ఉత్పత్తుల ద్వారా వీటిని తగ్గించుకోవచ్చు కానీ మన ఇంట్లోనే ఉండే సహజ వనరులతో ఈ సమస్యను ఎదుర్కోవటం చాలా ఉత్తమం. కళ్ళ కింద ఏర్పడే నల్లటి వలయాలోకి టమాట ఎంతో మంచిది టమోటాలు చర్మంపై మచ్చలను తొలగించి మెరిసేందుకు తోడ్పడుతాయి.
ఒక టీ స్పూన్ టమాటా జ్యూస్ కి నిమ్మరసం కలిపి కళ్ళ కింద రాసుకోవాలి పది నిమిషాలు ఆగిన తర్వాత చల్లనిటితో కడిగేసుకోవాలి. రోజుకి రెండుసార్లు ఇలా చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. బంగాళదుంప ని మెత్తని జ్యూస్ గా చేసి అందులో ముంచిన కాటన్ బాల్స్ ని కళ్ళ మీద ఉంచుకోవాలి.
ఇలా చేయడం వలన కళ్ళ కింద నల్ల మచ్చలు తగ్గడమే కాకుండా కళ్ళని మెరిసే లాగా చేస్తుంది. అలాగే గ్రీన్ టీ బ్యాగ్ కూడా బ్లాక్ సర్కిల్స్ కి మంచి రెమిడీ ముందుగా గ్రీన్ టీ బ్యాగ్ ని నీటిలో ముంచి కాసేపు ఫ్రిజ్లో ఉంచండి తర్వాత దాన్ని కళ్ళపై ఉంచుకోవడం వలన అద్భుతమైన ఫలితాలని చూస్తారు.
అలాగే కీరదోషని గుండ్రటి మొక్కలుగా తరిగి తలపై ఉంచుకోవడం వలన నల్లటి వలయాలు తగ్గుముఖం పడతాయి. రోజ్ వాటర్ చర్మానికి పునరుత్తేజాన్ని ఇస్తుంది దూదిని రోజు వాటర్లో ముంచి డాక్టర్ సర్కిల్స్ పై ఉంచాలి 15 నిమిషాలు ఆగాక చల్లటి నీటితో కడిగేసుకోవాలి.
నెలరోజుల పాటు ప్రతి రాత్రి ఇలా చేయడం వలన మెరుగైన ఫలితాలు ఉంటాయి. మరొక ముఖ్యమైన రెమిడి యోగ. ప్రతిరోజు యోగా చేయటం వలన ఒత్తిడి తగ్గి కళ్ళకింద వలయాలు కూడా తగ్గుతాయి.అన్ని ఇంట్లో ఉండే వస్తువులే కాబట్టి మనం సులువుగా ఇంట్లో కూర్చునే సమస్యకి చెక్ పెట్టవచ్చు.