ఉదయం నీళ్లను తాగకపోతే మీరెన్ని బెనిఫిట్స్ ను మిస్ అవుతారో తెలుసా..?
ఉదయం పరిగడుపున నీళ్లను తాగడం వల్ల ఎలాంటి జబ్బు సోకే ప్రమాదం ఉండదు. ఒకరకంగా నీళ్లను సర్వ రోగ నివారిణీ అనొచ్చు.

మన శరీరంలో నీరే 70 శాతం ఉంటుంది. అందుకే మన ఆరోగ్యానికి నీళ్లు అత్యవసరం. నీళ్లను పుష్కలంగా తాగినప్పుడే మనం ఎలాంటి జబ్బు సోకకుండా ఆరోగ్యంగా ఉంటాం. ఒక వేళ శరీరంలో నీటి శాతం తగ్గితే ఎన్నో అనారోగ్య సమస్యలొస్తాయి. కీళ్ల నొప్పులు, మలబద్దకం, తలనొప్పి, రక్తపోటు తగ్గడం, బ్రెస్ట్ క్యాన్సర్, ఊబకాయం వంటి సమస్యలొచ్చే ప్రమాదం ఉంది. అందుకే శరీరానికి అవసరమయ్యే నీటిని ఖచ్చితంగా తాగాలి. ఇందుకోసం రోజు నీటిని ఎంత తాగాలి.. ఏ సమయంలో తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం..
నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు
శరీరాన్ని ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంచడంలో నీరే కీలక పాత్ర పోషిస్తుంది. మనిషి శరీరంలో 50 నుంచి 60 శాతం నీటి పరిమాణం ఉంటుంది. ఈ నీరు శరీరంలోని కణజాలాలను, అవయవాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. వీటికి రక్షణ కల్పిస్తుంది.
ప్రతిరోజూ పరిగడుపున చల్లని లేదా గోరువెచ్చని నీళ్లను తాగడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థ పనితీరు కూడా మెరుగుపడుతుంది. అలాగే జీవక్రియ రేటు కూడా బాగా పెరుగుతుంది. మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
నీరు బరువును తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. పరిగడుపున నీటిని తాగడం వల్ల ఎక్కువగా తినలేరు. ఆకలి కూడా తక్కువగానే అయితుంది.
drink water
నిద్రలేచిన వెంటనే గ్లాస్ లేదా రెండు గ్లాసుల నీటిని తాగడం వల్ల శరీరంలో ఉండే విష పదార్థాలు మూత్రం ద్వారా బయటకు వెళతాయి.
నీళ్లను తాగడం వల్ల తక్షణ లభిస్తుంది. అలసిపోయినప్పుడు గ్లాస్ నీటిని తాగితే తేడాను మీరే గమనిస్తారు. ఎందుకంటే శరీరం డీహైడ్రేషన్ గురయినప్పుడు అలసిపోతుంది. ఇలాంటి సమయంలో నీటిని ఖచ్చితంగా తాగాలి. దీనివల్ల అలసట పోయి.. రక్తప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. శరీరానికి శక్తి కూడా అందుతుంది. ఒత్తిడిని తగ్గించడానికి కూడా నీరు సహాయపడుతుంది.
జుట్టు ఆరోగ్యానికి సహాయపడుతుంది
శరీరానికి తగినంతగా నీరు అందకపోతే జుట్టు సున్నితంగా మారుతుంది. అంతేకాదు శరీరంలో నీరు లేకపోతే జుట్టు రాలిపోయి.. సన్నబడుతుంది. అలాగే నీర్జీవంగా, గరుకుగా మారుతాయి.
ఉదయం పరిగడుపున నీటిని తాగడం వల్ల డ్రై హెయిర్ నుంచి ఉపశనం లభిస్తుంది. జుట్టు కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది.
ఉదయం, మధ్యాహ్నం ఎంత నీరు తాగాలి
పొద్దున్న లేచిన వెంటనే మూడు కప్పుల నీటిని తాగాలని నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే మధ్యహ్నం పూట తినడానికి గంట ముందు నీరు తాగి.. మళ్లీ భోజనం చేసిన గంట తర్వాతే తాగాలి. ఇక ఉదయం నీళ్లు తాగిన 45 నిమిషాల తర్వాతే అల్పాహారం తినాలి.