MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Drinks for Diabetes: ఈ మ్యాజిక్ డ్రింక్స్ రోజూ తాగారంటే ఎంతటి డయాబెటిస్ అయిన కంట్రోల్ అవ్వాల్సిందే

Drinks for Diabetes: ఈ మ్యాజిక్ డ్రింక్స్ రోజూ తాగారంటే ఎంతటి డయాబెటిస్ అయిన కంట్రోల్ అవ్వాల్సిందే

డయాబెటిస్ (Diabetes) వల్ల ఎంతో మంది సాధారణ జీవితంలో ఇబ్బందులు పడుతున్నారు.  రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అడ్డుకునే శక్తి ఉన్న మ్యాజిక్ డ్రింక్స్ గురించి ఇక్కడ ఇచ్చాము. వీటిలో కనీసం ఒకటైనా రోజులో తాగేందుకు ప్రయత్నించండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Oct 17 2025, 03:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పెద్ద సమస్యగా డయాబెటిస్
Image Credit : Pixabay

పెద్ద సమస్యగా డయాబెటిస్

ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ విపరీతంగా పెరిగిపోతోంది. ప్రతి నగరంలోనూ మధుమేహ రోగుల సంఖ్య పెరుగుతుందే కానీ… తరగడం లేదు. డయాబెటిస్ ఒకసారి వచ్చిందంటే తిరిగి పూర్తిగా తగ్గడం కుదరదు. కానీ దాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. డయాబెటిస్ వల్ల అధిక రక్తపోటు, మూత్రపిండాలు, కళ్ళు, రక్తనాళాలు, నరాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఎన్నో వస్తాయి. రక్తంలో గ్లూకోజ్  స్థాయిలు పెరగకుండా ఉండాలంటే  వైద్యులు సూచించిన మందులు వాడాలి. అలాగే సమతుల్య ఆహారం, వ్యాయామం, కొన్ని రకాల పానీయాలను ఆహారంలో భాగం చేసుకోవాలి.

26
కలబంద రసం
Image Credit : Getty

కలబంద రసం

కలబంద రసం పేరు వింటేనే చాలా మంది ముఖం అదోలా పెడతారు. నిజానికి ఇది ఒక సూపర్ డ్రింక్. దీన్ని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని అదుపులో ఉంచుతుంది. దీని వల్ల అధిక రక్తపోటు కూడా రాకుండా ఉంటుంది. దీన్ని ఉదయాన్నే పరగడుపున తాగితే మీకు మంచి ఫలితాలుంటాయి.

Related Articles

Related image1
Youtubers Income: ఈ యూట్యూబర్ల ముందు టాప్ హీరో హీరోయిన్లు కూడా పనికిరారు, నెలకు వీరి సంపాదన ఎంతంటే..
Related image2
Hair Color: జుట్టుకు వేసిన రంగు నెలల తరబడి పోకుండా ఉండాలంటే ఈ చిన్న పని చేయండి
36
మెంతుల నీరు
Image Credit : Getty

మెంతుల నీరు

మెంతులు గురించి ఎంత చెప్పినా తక్కువే.  మెంతులను రాత్రి నానబెట్టి ఆ నీటిని ఉదయం పరగడుపున తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మలబద్ధకం తగ్గుతుంది. ఇన్సులిన్ పనితీరు మెరుగుపడుతుంది. దీని వల్ల  రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి.

46
కాకరకాయ రసం
Image Credit : Getty

కాకరకాయ రసం

కాకరకాయ చేదుగా ఉంటుంది కానీ అది మనకు రక్షణ కల్పిస్తుంది. కాకర కాయ రసం చిన్న చిన్నగా స్పూనుతో తాగేందుు ప్రయత్నించండి. ఇది డయాబెటిస్ ను చక్కగా అదుపులో ఉంటుంది.  ఇది చక్కెర శోషణను మెరుగుపరుస్తుంది. ఉదయాన్నే పరగడుపున నిమ్మరసం లేదా ఉప్పుతో కలిపి తాగితే మంచి ఫలితాలుంటాయి.

56
దాల్చిన చెక్క టీ
Image Credit : Getty

దాల్చిన చెక్క టీ

దాల్చినచెక్క టీ మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి, రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది. శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. ఉదయం లేదా భోజనం తర్వాత ఈ టీ తాగితే మంచి ఫలితాలుంటాయి.

66
మందార టీ
Image Credit : Getty

మందార టీ

మందార టీ రక్తంలో చక్కెరను నియంత్రించే గుణాలు ఉన్నాయి.  ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. ఎండిన మందార రేకులతో తయారుచేసే ఈ టీ జీవక్రియను పెంచి, చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Mangalsutra: 1 గ్రామ్ గోల్డ్‌తో మంగ‌ళ‌సూత్రాలు.. డిజైన్స్‌ చూస్తే ఫిదా అవ్వాల్సిందే
Recommended image2
Brain Food: ఈ సూపర్ ఫుడ్స్ తో వృద్ధాప్యంలోనూ మెదడు చురుగ్గా పనిచేస్తుంది
Recommended image3
Hair Growth: రోజూ ఇవి తింటే.. ఒత్తైన జుట్టు మీ సొంతం
Related Stories
Recommended image1
Youtubers Income: ఈ యూట్యూబర్ల ముందు టాప్ హీరో హీరోయిన్లు కూడా పనికిరారు, నెలకు వీరి సంపాదన ఎంతంటే..
Recommended image2
Hair Color: జుట్టుకు వేసిన రంగు నెలల తరబడి పోకుండా ఉండాలంటే ఈ చిన్న పని చేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved