Monkeypox: పిల్లల్లో కనిపించే మంకీపాక్స్ లక్షణాలు ఇవే.. నిర్లక్ష్యం చేయకండి..
Monkeypox: మంకీపాక్స్ వ్యాప్తి చెందుతున్న ఈ సమయంలో పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బిడ్డ శరీరంలో ఏవైనా మార్పులను గమనించినట్టైతే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు.

కోవిడ్ మహమ్మారి తర్వాత చాలా దేశాలు మంకీపాక్స్ గుప్పిట్లోకి వచ్చాయి. గల్ఫ్ లో మంకీ ఫీవర్ నివేదించబడిన తరువాత భారతదేశం కూడా హై అలర్ట్ లో ఉంచబడింది. ప్రస్తుతం మన దేశంలో దీని కేసులు నమోదుకాకపోయినప్పటికీ.. మంకీ ఫీవర్ లేదా మంకీ పాక్స్ ను ఎదుర్కోవడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ త్వరలో మార్గదర్శకాలను జారీ చేయనుంది.
మంకీ ఫీవర్ లేదా మంకీ పాక్స్ అనేది మశూచి వంటి రోగమే. ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) ప్రకారం.. మంకీపాక్స్ ( Monkeypox)సంక్రమణ కేసులు 1970 లో మనుషులలో మొదటి సారిగా గుర్తించారు. అప్పటి నుంచి 11 ఆఫ్రికా దేశాల్లో ఈ వైరస్ నిర్ధారణ అయింది.
మంకీపాక్స్ వేగంగా వ్యాపిస్తున్న సమయంలో పిల్లల్ని మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం చాలా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లల శరీరంలో ఏవైనా మార్పులు లేదా ఏవైనా అసాధారణ లక్షణాలు గమనించినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. ఒక మాదిరి నుంచి తీవ్రమైన జ్వరం, దద్దుర్లు మరియు శరీర నొప్పులు పిల్లలలో మంకీపాక్స్ యొక్క అత్యంత సాధారణ మొదటి లక్షణాలు అని నిపుణులు సూచిస్తున్నారు.
మీకు మంకీపాక్స్ ఇన్ఫెక్షన్ సోకినట్లయితే, మొదట్లో చర్మంపై దద్దుర్లు కనిపిస్తాయి. ఈ దద్దుర్లు చేతులు మరియు కాళ్ళకు వ్యాపిస్తాయి. దద్దుర్లు నీటి బుడగల్లా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మంకీపాక్స్ వైరస్ సోకిన పిల్లలలో జ్వరం పెద్దవారి కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది 101 F నుంచి 102 F వరకు ఉండవచ్చు. లేదా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండవచ్చు.
పిల్లలు మంకీపాక్స్ బారిన పడకూడదంటే.. చేతుల పరిశుభ్రత అన్నింటికంటే చాలా ముఖ్యమైనది. మీ పిల్లలు బయటకు వెళ్లి ఆడుకున్నప్పుడు వారి చేతులను నీటితో లేదా ఆల్కహాల్ కలిగిన శానిటైజర్ తో 20 సెకన్ల పాటు చేతులను శుభ్రం చేసుకునేలా చూసుకోండి.
అలాగే మాంసాన్ని బాగా ఉడికించి తినాలి. దద్దుర్లు లేదా జ్వరం ఉన్న వ్యక్తిని అస్సలు తాకకూడదు. రోగి యొక్క ఏవైనా ద్రవాలు లేదా పదార్థాలను తాకడం మానుకోవాలి.
మంకీపాక్స్ (Monkeypox) ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి?
మంకీ పాక్స్ అనేది మశూచి వంటి అనారోగ్యం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. మంకీపాక్స్ 1970 లో మనుషులకు సోకిందని నిర్దారణ అయ్యింది. అప్పటి నుంచి 11 ఆఫ్రికా దేశాల్లో ఈ వైరస్ నిర్ధారణ అయింది. ఆఫ్రికాలో అడవి జంతువుల నుంచి ఈ వ్యాధి మనుషులకు వ్యాపించింది. ఇది సోకిన వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వైరస్ గాలి ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందుతుంది.