Wrinkles : షుగర్ ను ఎక్కువగా తీసుకున్నారో మీ ముఖంపై ముడతలు రావడం ఖాయం..!
Wrinkles : చక్కెను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల చర్మం Softness దెబ్బతింటుంది. దీంతో ముఖంపై ముడతలు రావడం మొదలవుతుంది.

షుగర్ మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే దీనికి బదులుగా బెల్లాన్ని వాడమని సలహాలు ఇస్తుంటారు. ఈ సంగతి పక్కన పెడితే.. ప్రస్తుత కాలంలో చిన్నవయసు వారికి కూడా ముఖంపై ముడతలు పడుతున్నాయి. దీంతో వారు ముసలివాళ్లలాగ కనిపిస్తున్నారు. మన లైఫ్ స్టైల్, పోషకలేమి ఆహారం, వాతావరణ కాలుష్యం వంటి అనేక కారణాల వల్ల ఈ సమస్య తలెత్తుతుంది.
wrinkles
ఇక అసలు విషయానికొస్తే షుగర్ ను మోతాదుకు మించి తీసుకునే వారిలో కూడా వృద్ధాప్య ఛాయలు ఎక్కువగా కనిపిస్తాయని నిపుణులు తేల్చి చెబుతున్నారు. తగిన మోతాదులో షుగర్ ను తీసుకోవడం మన శరీరానికి ఎంతో ముఖ్యం కూడా. అలా అని పరిమితికి మించి చక్కెరను తీసుకుంటే మాత్రం మన ఆరోగ్యంపై పెద్ద దెబ్బ పడ్డట్టే అంటున్నారు నిపుణులు.
పరిమితికి మించి షుగర్ ను తీసుకోవడం వల్ల మన శరీరంలో గ్లైకేషన్ అనే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. దీంతో చర్మం సాఫ్ట్ నెస్ ను కోల్పోతుంది. తద్వార ముఖంపై ముడతలు ఏర్పడుతాయని నిపుణులు చెబుతున్నారు.
మన శరీరంలో మంచి కొవ్వులు మోతాదులో ఉంటేనే మీ చర్మం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. కానీ చాలా మంది ఒంట్లో కొవ్వులు విపరీతంగా పెరిగిపోతాయని కొన్ని రకాల ఆహారాలను తినడమే మానేస్తుంటారు. ఇలా అస్సలు చేయకూడదు. శరీరానికి మంచి చేసే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మీరు మరింత అందంగా తయారవుతారు.
ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు స్కిన్ ను కాంతివంతంగా, యవ్వనంగా ఉండటానికి ఎంతో సహాయపడుతుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. అందుకే కొవ్వు పదార్థాలు ఉండే ఆహార పదార్థాలను మోతాదులో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహానిస్తున్నారు.
నాణ్యమైన మాయిశ్చరైజర్లను వాడితో కూడా ముఖంపై ముడతలను పోగొటొచ్చు. ముఖ్యంగా స్నానానికి ఏ సబ్బులు మంచివో వాటినే వాడాలి. మార్కెట్ లోకి వచ్చిన ప్రతి సబ్బును ట్రై చేస్తే మాత్రం మీ ముఖ సౌందర్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. రకరకాల సబ్బులను వాడటం వల్ల చర్మం డ్రైగా మారడమే కాదు.. నిర్జీవంగా కూడా తయారవుతుంది. ముడతలు కూడా ఏర్పడొచ్చు. అందుకే సబ్బులను వాడే ముందు ఒకసారి చర్మ సౌందర్య నిపుణులను సంప్రదించడం బెటర్.
పోషకాహార లోపం కారణంగా కూడా ముఖంపై ముడతలు ఏర్పడొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా కావొద్దంటే మీరు తీసుకునే ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఎక్కువ మొత్తంలో ఉండాలి. ఇవి లేకపోతేనే చర్మం ముడతలు పడుతుంది. పొడిగా కూడా మారుతుంది. కాబట్టి పోషకాహారమైన డార్క్ చాక్లెట్, బ్రోకలి, పండ్లు, టమోటాలను ఎక్కువగా తీసుకోండి.