ప్రపంచంలో ఎక్కువ మంది ఇంగ్లిష్ మాట్లాడే దేశం ఏంటో తెలుసా.? అమెరికా కాదు, బ్రిటన్ కాదు..
ఇంగ్లిష్.. ఇదొక గ్లోబల్ లాంగ్వేజ్. ప్రపంచంలో ఎక్కువమందితో కమ్యూనికేట్ కావడానికి ఇంగ్లిష్ ఉపయోగపడుతుంది. మాతృ భాషతో ఎంత ప్రేమ ఉన్నా అనివార్యంగా ఇంగ్లిష్ నేర్చుకోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రపంచంలో ఎక్కువ మంది ఇంగ్లిష్ ఏ దేశంలో మాట్లాడుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే భాషల్లో ఇంగ్లిష్ ముందు వరుసలో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గ్లోబల్ మార్కెట్ నేపథ్యంలో డాలర్ ఎలాగైతే ప్రామాణిక కరెన్సీగా మారిందో ఇంగ్లిష్ సైతం అలాగే ప్రామాణిక భాషగా అవతరించింది. అనకాపల్లిలో ఉన్న వారు కూడా అమెరికాలో ఉన్న వారితో కమ్యూనికేట్ చేయడానికి ఇంగ్లిష్ ఉపయోగపడుతుంది. అయితే ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కువ మంది ఇంగ్లిష్ మాట్లాడుతున్నారన్న దానికి సంబంధించి తాజాగా పియర్సన్స్ గ్లోబల్ ప్రొఫిషియన్సీ ఓ రిపోర్టును విడుదల చేసింది.
సాధారణంగా ఇంగ్లిష్ ఎక్కువ మాట్లాడే వారంటే అమెరికా గుర్తొస్తుంది కానీ ఇది నిజం కాదు. ఈ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో ఎక్కువ మంది ఇంగ్లిష్ మాట్లాడే దేశాల్లో జిబ్రాల్టర్ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 100 శాతం మంది ఆంగ్లంలో మాట్లాడుతారు.
అయితే ఈ ద్వీప దేశంలో ఉన్న జనాభా కేవలం 32,669 మాత్రమే. ఇక ఇంగ్లిష్ అధికంగా మాట్లాడే దేశాల్లో బ్రిటన్ 98.3 శాతం మంది ఇంగ్లిష్ మాట్లాడుతారు. ఇక ఆ తర్వాత అమెరికాలో 95 శాతం మంది ఇంగ్లిష్ మాట్లాడుతారు. మిగతా వారి వారి వారి స్థానిక భాషల్లో మాట్లాడుతారు.
భారత దేశం ఏ స్థానంలో ఉంది.?
భారత దేశం ఏ స్థానంలో ఉంది.?
భారతదేశ జనాభాలో కేవలం 20 శాతం మంది మాత్రమే అనర్గళంగా మాట్లాడుతారు. అయితే జనాభా పరంగా చూస్తే మాత్రం ఇంగ్లిష్ మాట్లాడే దేశాల్లో భారత్ ప్రపంచంలోని టాప్ 5 దేశాల్లో ఒకటిగా ఉంది. పియర్సన్స్ గ్లోబల్ ఇంగ్లీషు ప్రొఫిషియన్సీ రిపోర్ట్ ప్రకారం, భారతదేశంలో ఇంగ్లీష్ మాట్లాడేవారిలో రాజధాని ఢిల్లీ ముందంజలో ఉంది. ఢిల్లీలో ఇంగ్లిష్ మాట్లాడే సామర్థ్యం ఎక్కువగా ఉంది.
ఇక దేశంలో తర్వాతి స్థానాల్లో రాజస్థాన్, పంజాబ్ ఉన్నాయి. ఈ నివేదిక ప్రకారం, ఇంగ్లిష్ మాట్లాడే విషయంలో ఢిల్లీకి 63 పాయింట్లు వచ్చాయి, ఇది దేశంలోనే అత్యధికం. ఆ తర్వాత రాజస్థాన్‌కు 60 పాయింట్లు, పంజాబ్‌కు 58 పాయింట్లు వచ్చాయి.
తక్కువ మంది ఎక్కడో తెలుసా.?
తక్కువ మంది ఎక్కడో తెలుసా.?
ప్రపంచంలో తక్కువ మంది ఇంగ్లిష్ మాట్లాడే దేశాల్లో చైనా చివరి స్థానంలో ఉంది. చైనాలో కేవలం 0.9 శాతం మంది మాత్రమే ఇంగ్లిష్‌లో మాట్లాడుతారని నివేదికలో తేలింది. చైనాలో ఎక్కువగా మాతృ భాషనే ప్రోత్సహిస్తారు.
అక్కడి ప్రభుత్వం సైతం స్థానిక భాషకే పెద్ద పీట వేస్తుంది. ఇక్కడ కొన్ని వెబ్ సైట్స్ కూడా చైనీస్ భాషలోనే ఉంటాయి. చైనాలో ఎక్కువగా చైనీస్, మంగోలియన్, టిబెటన్, ఉయ్ఘర్, జువాంగ్ భాషలు మాట్లాడుతారు.