MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • బీర్‌ బాటిల్స్‌ ఆ రంగులోనే ఎందుకు ఉంటాయి.? అసలు కారణం ఏంటంటే..

బీర్‌ బాటిల్స్‌ ఆ రంగులోనే ఎందుకు ఉంటాయి.? అసలు కారణం ఏంటంటే..

మన రోజువారి జీవితంలో ఎన్నో వస్తువులను చూస్తుంటాం. అయితే వాటిలో కూడా మనకు తెలియని ఎంతో కొంత సైన్స్‌ దాగి ఉంటుంది. ప్రతీ వస్తువు సైన్స్‌ ఆధారంగా తయారైనవే. అలాంటి వాటిలో ఒకదాని గురించి ఈరోజు తెలుసుకుందాం. దాదాపు మీరు చూసే ప్రతీ బీర్‌ బాటిల్స్‌ ఏదో ఒక రంగులో ఉంటాయి. పాదర్శకంగా ఉండే బాటిల్స్‌ను బీర్‌లకు ఉపయోగించరు. దీనికి గల అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..  

2 Min read
Narender Vaitla
Published : Dec 15 2024, 04:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

మద్యపానం ఆరోగ్యానికి హానికరమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మద్యం సీసాపైనే ఈ విషయాన్ని స్పష్టంగా రాస్తారు కూడా. అయినా మద్యం ప్రియులు మాత్రం ఆ అలవాటును మానుకోవడానికి ఇష్టపడురు. ఆరోగ్యానికి మంచిది కాదని ఎంత చెప్పినా వినరు. ఇక బీర్‌ ప్రియుల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చలికాలంలో కూడా బీరు అమ్మకాలు పెరగడడమే దీనికి ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. సాధారణంగా చలికాలం బీర్ల అమ్మకాలు తగ్గుతాయి కానీ ఈసారి మాత్రం గతంతో పోల్చితే ఏకంగా 33శాతం బీర్ల అమ్మకాలు పెరగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 
 

24
Prabhas

Prabhas

ఇదంతా పక్కన పడితే. బీరు ప్రియులు ఎంతో ఇష్టంగా తాగే బీరు బాటిల్‌లో కూడా సైన్స్‌ దాగి ఉందని మీలో ఎంత మందికి తెలుసు. దాదాపు మనం చూసే బీర్‌ బాటిల్స్‌లన్నీ కేవలం రెండు రకాల రంగుల్లోనే కనిపిస్తాయి ఎప్పుడైనా గమనించారా.? అయితే గ్రీన్‌ లేదా గ్రే కలర్‌ బాటిల్స్‌లోనే బీర్లను ఎక్కువగా విక్రయిస్తుంటారు. సాధారణంగా లైట్‌ బీర్‌ అయితే గ్రీన్‌, స్ట్రాంగ్ బీర్‌ అయితే గ్రే కలర్‌ బాటిల్‌గా భావిస్తుంటాం. కానీ దీని వెనకాల వేరే కారణం ఉంది. బీర్‌ బాటిల్స్‌కు కేవలం ఈ రెండు రంగులు మాత్రమే ఉండడానికి అసలు కారణం ఏంటంటే. 
 

34

నిజానికి కొన్నేళ్ల క్రితం ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ట్రాన్స్‌పరెంట్‌ సీసాలను బీర్‌ కోసం ఉపయోగించే వారు. అయితే ఇలాంటి బాటిల్స్‌పై ఎండ పడితే కిరణాల వల్ల బాటిల్‌ లోపల ఉండే బీర్‌ రసాయన సమ్మేళనాన్ని వేగంగా మార్చినట్లు గుర్తించారు. దీంతో బీరు రుచి మారడంతో పాటు ఆ బీర్‌ తాగిన వారు అస్వస్తతకు గురైనట్లు గుర్తించారు. దీంతో బీర్‌ బాటిళ్ల తయారీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెట్టారు. సన్‌లైట్ రిఫ్లెక్ట్‌ అయ్యే విధంగా సన్‌గ్లాస్‌ టెక్నాలజీని ఉపయోగించారు. 
 

44

దీంతో సూర్యకాంతి బాటిల్‌పై పడగానే చెదరగొట్టే రంగులలో బీరు సీసాలను తయారు చేయడం ప్రారంభించారు. అందుకే బీరు బాటిల్స్‌ను బ్రౌన్‌ కలర్‌లో తయారు చేస్తూ వచ్చారు. అందుకే మనకు కేవలం రెండు రకాల కలర్స్‌తో కూడిన బాటిల్స్‌ కనిపిస్తుంటాయి. అయితే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో గోధుమ రంగు సీసాల్లో బీరును నింపడం ప్రారంభించారు. అందులో నిల్వ ఉంచిన బీరు కూడా పాడవకుండా ఉండడంతో వాటిని కూడా తయారు చేస్తూ వచ్చారు. అయితే ఇప్పటికే కొన్ని ట్రాన్స్‌పరెంట్‌ బాటిల్స్‌ను ఉపయోగిస్తున్నా మెజారిటీ మాత్రం ఆకుపచ్చ, బ్రౌన్ రంగులోనే విక్రయిస్తున్నారు. ఇదండి బీర్‌ బాటిల్్‌ కలర్‌ వెనకాల ఉన్న అసలు లాజిక్‌. 
 

About the Author

NV
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved