ఆలుమగల మధ్య ఎక్కువగా వచ్చే సమస్యలేంటో తెలుసా?
వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు ఎంత సాధారణమో.. గొడవలు, కొట్లాటలు కూడా అంతే సర్వసాధారణం. కానీ కొన్ని విషయాలు మాత్రం ఆలుమగల మధ్య పెద్ద చిక్కు సమస్యలుగా మారిపోతుంటాయి. ఇవి ఎవరూ పరిష్కరించలేని ప్రశ్నగా మారి విడాకుల వరకు దారి తీస్తాయి.
పెళ్లి అంటేనే ప్రేమలు, అలకలు, మద్దు ముచ్చట్లు, అంతకు మించి అప్పుడు చిన్న చిన్న కొట్లాటలు. ఇవి లేకుండా వైవాహిక జీవితం ఉండదు. ప్రతి జంట వీటిని తప్పకుండా చవిచూడాల్సిందే. మగుడూ పెళ్లాం అన్నప్పుడు కాస్త కొట్లాటలు ఉండటం చాలా సహజం. కానీ కొన్ని చిన్న సమస్యలే ఆలుమగల మధ్య అంతులేని దూరాన్ని పెంచుతాయి. అవే ఆఖరికి వారిద్దరూ వారి వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పేలా చేస్తాయి. ఇంతకి ఎలాంటి గొడవలు విడాకుల వరకు తీసుకెళ్తాయో తెలుసా.. ఈ ఆర్టికల్ దానికి దారితీసే కారణాలను తెలుసుకుందాం.
భాగస్వామితో సరిగ్గా మెసలకపోవడం కూడా గొడవలకు దారితీస్తుంది. తను మీ పక్కన ఉన్నా మీరు పనిగట్టుకుని ఫోన్లలోనో, టీవీలోనో, ల్యాప్ టాప్ లోనో తలదూర్చడం మీ మధ్య దూరాన్ని మరింత పెంచుతుంది. ఇలాంటి పనులు చేస్తుంటే మీ భాగస్వామిని మీరు పట్టించుకోవట్లేదని అర్థం. మీ పక్కన కూర్చున్నప్పుడు వారితో సానిహిత్యంగా ఉండండి. కబుర్లు చెప్పుకోండి. ఫ్యూచర్ పై ప్లానింగ్స్ వేసుకోండి. అంతేకాని వారిని వారి దారిన వదిలేస్తే మీ రిలేషన్ షిప్ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇదే ఆఖరికి విడాకుల వరకు దారితీయొచ్చు.
వైవాహిక జీవితం అన్నప్పుడు ఒకరికొకరు అన్ని విషయాలను షేర్ చేసుకుంటేనే ఆ బంధం ఫుల్ ఫిల్ అవుతుంది. అలాకాకుండా మీ భాగస్వామిని పట్టించుకోకుంటే వారు మానసికంగా బలహీనంగా మారే ప్రమాదం ఉంది. అందుకే మీ మధ్య ఎలాంటి గ్యాప్ లేకుండా చూసుకోవాలి. అందులోనూ ఆఫీస్ టెన్షన్స్, పని ఒత్తిడి నుంచి బయటపడాలంటే వారితో కమ్యునికేషన్ బాగుండాలి. లేదంటే మీ మధ్య గొడవలకు దారి తీస్తుంది. దాంతో మీ బంధం బలహీనపడుతుంది.
పెళ్లైన కొన్నాళ్లకు ప్రతి జంట సెక్సువల్ సమస్యలను ఎదుర్కోవడం సాధారణ విషయం. ఎందుకంటే వర్క్ ప్రెజర్ వల్ల కావొచ్చు, ఇతర సమస్యలు, ఒత్తిడి మూలంగా ఈ సెక్సువల్ లైఫ్ కు కాస్త గ్యాప్ ఏర్పడే అవకాశం ఉంది. అలాంటి విషయాలు కూడా మీ మధ్య దూరాన్నిఏర్పరచవచ్చు.
మీ భాగస్వామిపై యజమాయిషీ చేయడం మానేయండి. వీలైతే వారితో ఫ్రీగా ఫ్రెండ్లీగా ఉండేట్లు ప్రవర్తించండి. లేదంటే తరచుగా కొట్టుకోవడం, కొట్లాడటం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఒకరికొకరు సలహాలు సూచనలు చేసుకుంటూ ఉంటే ఎటువంటి సమస్యలు ఎదురవవు. ముఖ్యంగా రోజు ఎలా గడిచిందో ఒకరికొకరు షేర్ చేసుకుంటే మీ బంధం మరింత బలపడే అవకాశం ఉంటుంది.
ప్రతి చిన్న విషయానికి కూడా మీ మధ్య గొడవలు జరుగుతుంటే వీలైనంత వరకు ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చొని ఎలాంటి విషయాలు మీ మధ్య ఇబ్బందులను తెస్తున్నాయో చర్చించండి. పరిష్కారం చేసుకోండి. ఇది మీ ఇద్దరికీ సాధ్యపడకపోతే మ్యారెజ్ కౌన్సిలర్ ను కలవండి. దీని వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాని విడాకుల వరకు వెళ్లకండి. మీ వల్ల మీ పిల్లలు ఫ్యూచర్ లో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.