Raw Eggs: పచ్చి గుడ్డు తినడం ఎంత ప్రమాదకరమో తెలుసా? ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు
పచ్చి గుడ్డును తినడం ఆరోగ్యకరమని చాలా మంది భావన. నిజానికి పచ్చి గుడ్డును తినడం ప్రమాదకరమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. పచ్చి గుడ్డు తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో కూడా వారు వివరిస్తున్నారు.

పచ్చి గుడ్డు ఎందుకు తినకూడదు?
పచ్చి గుడ్డు తినడం ఏమాత్రం మంచిది కాదు. పచ్చిగా లేదా సగం ఉడికించిన గుడ్లలో సాల్మొనెల్లా బాక్టీరియా ఉంటుంది. ఇది అనుకోకుండా పొట్టలోకి చేరితే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. కడుపు నొప్పి, విరేచనాలు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశం ఉంది. అదే ఆ గుడ్డును ఉడికిస్తే ఆ వేడికి సాల్మొనెల్లా బ్యాక్టిరియా నాశనం అయిపోతుంది. కాబట్టి పచ్చి గుడ్డును ఎట్టి పరిస్థితుల్లో తినకపోవడమ మంచిది. ఇప్పుడున్న ఆధునిక కాలంలో బ్యాక్టిరియాలు విపరతంగా పెరిగిపోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి.
పచ్చి గుడ్డు లేక ఉడికించిన గుడ్డు
పూర్వం ఎక్కువ మంది పచ్చి గుడ్లను తినేవారని చెబుతారు. అవే ఎక్కువ ప్రోటీన్ ఇస్తాయని ఇప్పటికీ అనుకుంటారు. నిజానికి పచ్చిగుడ్డుతో పోలిస్తే ఉడికించిన గుడ్లు సురక్షితమైనవి. వాటిలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. పచ్చిగుడ్డును తినడం వల్ల ఎలాంటి లాభం లేదు. పైగా సమస్యలు కొని తెచ్చుకున్నవారవుతారు.
ఎంత ప్రొటీన్ ఉంటుంది?
పరిశోధనల ప్రకారం పచ్చి గుడ్డులోని ప్రోటీన్‌లో దాదాపు 51 శాతం మాత్రమే మానవ శరీరం గ్రహిస్తుంది. అదే ఉడికించిన గుడ్డులో అయితే దాదాపు 91 శాతం ప్రోటీన్ ను మన శరీరం శోషించుకుంటుంది. అంటే ఉడికించిన గుడ్డు దాదాపు రెట్టింపు ఆరోగ్యాన్ని అందిస్తుంది.
ఇలా వాడండి
పచ్చి గుడ్డులో అవిడిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది బయోటిన్ అంటే విటమిన్ బి7 శోషణను అడ్డుకుంటుంది. కాబట్టి మీరు గుడ్డును తినాలనుకుంటే ఉడికించాకే తినాలి. అంటే సౌందర్య పోషణ కోసం అయితే నేరు చర్మం, జుట్టుపై అప్లై చేయచ్చు. ఇది చర్మానికి , జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది.
ఉడికించిన గుడ్డు
ఉడికించిన గుడ్డును తినడం చాల సులభం. చాలా రుచిగా ఉంటుంది. ఉడికించిన గుడ్డుతో సులువగా రకరకాల వంటలు వండుకోవచ్చు. నూనె లేదా మసాలాలు లేకుండా తయారుచేసిన ఉడికించిన గుడ్డులో కేలరీలు తక్కువ. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. గుడ్డు ఉడికించేటప్పుడు పోషకాలు కోల్పోకుండా ఉండాలంటే ఎక్కువ సేపు ఉడికించుకూడదు. 10 నుండి 12 నిమిషాలు పాటూ ఉడికిస్తే సరిపోతుంది. ఇలా ఉడకబెట్టడం వల్ల గుడ్డులోని బాక్టీరియ నాశనం అవుతుంది కాన పోషకాలు మాత్రం గుడ్డులోనే ఉంటాయి.