MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • weight loss: లెమన్ వాటర్ తాగితే నిజంగా బరువు తగ్గుతారా?

weight loss: లెమన్ వాటర్ తాగితే నిజంగా బరువు తగ్గుతారా?

weight loss: బరువు తగ్గడానికి క్రమం తప్పకుండా లెమన్ వాటర్ తాగాలని చాలా మంది చెబుతుంటారు. వాస్తవానికి లెమన్ వాటర్ బరువును తగ్గిస్తుందా? నిజ నిజాలేంటో తెలుసుకుందాం పదండి.. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 20 2022, 04:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

వేసవి వచ్చిందంటే చాలు నిమ్మకాయలకు ఎక్కడ లేని డిమాండ్ వస్తుంది. అందులోనూ ప్రస్తుతం నిమ్మ ధర కొండెక్కింది. ఒక్కోటి పది రూపాలు అమ్ముడుపోతోంది. ఈ సంగతిపక్కన పెడితే.. వేసవిలోనే నిమ్మను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అందులో ఈ సీజన్ లో లెమన్ వాటర్ ను ఇష్టంగా తాగుతుంటారు. ఈ వాటర్ ను తాగడం వల్ల వేసవి తాపం తీరడంతో పాటుగా.. హైడ్రేటెడ్ గా కూడా ఉంటారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28
lemon water

lemon water

అంతేకాదు లెమన్ వాటర్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. అలాగే ఈ నిమ్మ శరీరాన్ని కూల్ గా ఉంచుతుంది కూడా. 

38

నిమ్మరసం తాగితే బరువు తగ్గుతారా.. క్రమం తప్పకుండా నిమ్మరసం తాగడం వల్ల సులభంగా బరువు తగ్గుతారని చాలా మంది చెప్తూ ఉంటారు. ఉదయాన్నే ఒక గ్లాస్ నిమ్మరసంలో కాస్త తేనె మిక్స్ చేసి లేదా అలాగే తాగినా బెల్లీ ఫ్యాట్ తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. నిజానికి నిమ్మకాయ నీరు ఎన్నో సమస్యలను దూరం చేస్తుంది. 

48

లెమన్ వాటర్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. నిమ్మకాయ సిట్రస్ ఫ్రూట్. ఇందులో సిట్రిక్ యాసిడ్, విటమిన్ సి, విటమిన్ బి6 పొటాషియం, ఫైబర్, పెక్టిన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే శరీరానికి హానీ చేస్తే ప్రీ రాడికల్స్ నుంచి మనల్ని రక్షిస్తాయి.

58

నిమ్మకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే ప్రాణాంతకమైన క్యాన్సర్ వంటి రోగాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది కూడా. 

68

నిమ్మకాయ నీటిని తాగడం వల్ల కడుపు, నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వు తగ్గడం ప్రారంభమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంటే నిమ్మరసం బరువును తగ్గించడానికి సహాయపడుతుందన్న మాట. 

78

ఆకలి నియంత్రణ.. నిమ్మలో ఉండే పెక్టిన్ అనే పదార్థం ఆకలిని నియంత్రించడానికి ఎంతో సహాయపడుతుంది. లెమన్ వాటర్ తాగడం వల్ల ఆయిల్ ఫుడ్ తినాలన్న కోరిక పోతుంది. ఈ లెమన్ వాటర్ లో ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీవక్రియను మెరుగుపరుస్తాయి. అంతేకాదు వీటిలో ఉండే పొటాషియం శరీరాన్ని హైడ్రేటెగా ఉంచుతాయి. అలాగే రక్తపోటును కూడా తగ్గిస్తుంది. 

88

నిమ్మరసం ఎలా తయారు చేయాలి.. బెల్లీ ఫ్యాట్ తొందరగా తగ్గాలంటే మాత్రం ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లను తీసుకుని అందులో మోతాదు సైజులో ఉండే నిమ్మకాయను పిండండి. అందులో కాస్త జీలకర్ర పొడి, నల్ల ఉప్పు వేసి బాగా కలపండి. దీనితో పాటుగా గ్లాస్ గోరువెచ్చని నీళ్లలో టీస్పూన్ తేనెను వేసుకుని తాగినా బెల్లీ ఫ్యాట్ ఇట్టే తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Kitchen Hack: వంటగదిలో ఈగలతో విసిగిపోయారా? ఇవి మీ ఇంట్లో ఉంటే అస్సలు కనిపించవు
Recommended image2
Railway Rules: టికెట్ తీసుకున్న తర్వాత రైలు మిస్ అయితే ఏం చేయాలి? రిఫండ్ వస్తుందా?
Recommended image3
Ice Apple: తాటి ముంజల్లో ఇన్ని పోషకాలా? తెలిస్తే బుట్టలు బుట్టలు కొంటారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved