Real Facts: పుట్టగానే తల్లిని తినే జీవి ఏదో తెలుసా? వందలో 99 మందికి తెలియదు
తల్లీబిడ్డల మధ్య అనురాగం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బిడ్డ పుట్టగానే తల్లి శరీరానికి అతుక్కునే ఉండేందుకు ఇష్టపడుతుంది. కానీ ఒక జీవి మాత్రం ఎంతో భిన్నం. పుట్టగానే తల్లిని తినేస్తుంది. ఇలాంటి నిజాలు (Real Facts) తరచూ అందించేందుకు ప్రయత్నిస్తాము.

తల్లీ బిడ్డల అనుబంధం
పుట్టిన శిశువుకు ఈ ప్రపంచంలో మొదటి పరిచయం తల్లితోనే. అందుకే పుట్టిన తర్వాత కూడా తల్లి చేతుల్లోనే తల్లిని పొదువుకుని ఉంటాయి బిడ్డలు. కానీ ఒక జీవి విషయంలో మాత్రం అంతా భిన్నం. అవి పుట్టిన తర్వాత తమను తాను రక్షించుకోవడానికి తల్లిని నెమ్మది నెమ్మదిగా తినేస్తాయి. తల్లి కూడా బిడ్డల కోసం తన శరీరాన్ని త్యాగం చేస్తుంది. మరణాన్ని స్వీకరిస్తుంది. ఆ జీవి ఆడ తేలు. ఆడ తేలు ప్రసవించాక బతకడం చాలా కష్టం. ఇది ఒకేసారి బోలెడు పిల్లలకు జన్మనిస్తుంది.
ఆడ తేలు జీవితమే వేరు
ఒకేసారి ఎక్కువమంది పిల్లలకు జన్మనిస్తుంది ఆడ తేలు. వాటిని తన వీపుపైన పెట్టుకుని మోస్తుంది. చర్మం గట్టిపడే వరకు అలానే ఉండి తర్వాత తల్లి వీపును వదిలేస్తాయి. కానీ ఒక్కోసారి తల్లి తేలు ప్రసవం అయ్యాక అలసట వల్ల, డిహైడ్రేషన్ వల్ల ఇతర కారణాల వల్ల చనిపోతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో తేలు పిల్లలు పోషకాల కోసం ఆ తల్లి శరీరాన్ని తినేస్తాయి. ఒక్కొక్కసారి తీవ్రమైన ఆకలి వేసిన సమయంలో తల్లితేలు తాను బతకడానికి చివరి ప్రయత్నంగా తన పిల్లలను కూడా తినే అవకాశం ఉంది.
వంద పిల్లలను మోసేయగలదు
తేలు పిల్లలు పుట్టిన తర్వాత తల్లి వీపుపై ఒక వారం నుంచి 51 రోజులు వరకు ఉండే అవకాశం ఉంటుంది. తల్లితేలు ఎలాంటి సమస్య లేకుంటే 100 కంటే ఎక్కువ పిల్లలను తన వీపుపై మోయగలదు. అలా మోస్తున్నప్పుడు తల్లి చర్మం వాటిని పోషించేందుకు ఒక రకమైన ద్రవాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఆ ద్రవంతోనే తేలు పిల్లలు జీవిస్తాయి. ఆ తర్వాత స్వతంత్ర జీవితాలను గడుపుతాయి.
తల్లి తేలు చనిపోతే...
ఒక్కోసారి మాత్రం తీవ్ర ఆకలి, దప్పికల వల్ల తల్లి ప్రాణాలు కోల్పోతుంది. అప్పుడు మాత్రం పిల్లలన్నీ కలిసి ఆ తల్లి శరీరాన్ని తినేస్తాయి. తల్లి శరీరంలో ఉండే పోషకాలు పిల్లల ఎదుగుదలకు అవసరం. అంతేకానీ తమ ఆకలి తీర్చుకోవడం కోసం మాత్రం తల్లిని తిని తేలు పిల్లలు తినేస్తాయన్నది మాత్రం అపోహ.