ఈ క్రీం పెడితే.. మడమల పగుళ్లు వెంటనే తగ్గిపోతాయి
మగవారికంటే ఆడవారే మడమల పగుళ్లతో ఇబ్బంది ఎక్కువగా పడుతుంటారు. ఈ చలికాలంలో అయితే ఆ పగుళ్ల నుంచి రక్తం కూడా కారుతుంటుంది. అయితే ఒక క్రీం ఈ పగుళ్లను తొందరగా తగ్గించడానికి సహాయపడుతుంది. అదేంటంటే?
మడమల పగుళ్లు ఒక సాధారణ సమస్య. కానీ దీనివల్ల ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. మడమల పగుళ్ల వల్ల పాదాలు బాగా నొప్పి పెడతాయి. దీనివల్ల నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని కొన్ని సార్లైతే ఈ పగుళ్ల నుంచి రక్తం కూడా కారుతుంటుంది. చలికాలం, ఎండాకాలంలో మడమలు బాగా పగులుతుంటాయి.
మారుతున్న వాతావరణం వల్ల చర్మంలో తేమ తగ్గి మడమలు పగులుతాయి. అయితే ఇంట్లో తయారుచేసిన ఒక క్రీంతో ఈ పగుళ్లను తొందరగా తగ్గించుకోవచ్చు. మరి ఈ క్రీం ను ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
మడమల పగుళ్లను తగ్గించడానికి క్రీం ని ఎలా తయారుచేయాలి
ఒక టీ స్పూన్ ఆవ నూనె, ఒక టీ స్పూన్ పెట్రోలియం జెల్లీ, ఒక టీ స్పూన్ కలబంద జెల్, ఒక టీస్పూన్ గ్లిజరిన్ ను తీసుకుని అన్నింటినీ మిక్స్ చేసి బాగా కలపండి. అంతే మడమల పగుళ్లను తగ్గించే క్రీం రెడీ అయినట్టే.
పాదాలకు ఎలాపెట్టాలి?
మడమల పగుళ్లు తక్కువ కావాలంటే మీరు ప్రతిరోజూ రాత్రిపూట పడుకునే ముందు ఒక బకెట్ వేడి నీళ్లను తీసుకుని అందులో మీ పాదాలను ఒక 10 నిమిషాల పాటు నానబెట్టండి. ఆ తర్వాత పాదాలను నీళ్లలోంచి తీసి బాగా ఆరబెట్టండి.
మడమలకు అప్లై చేయండి
పాదాలు పొడిగా అయిన తర్వాత మడమలకు కొంచెం ఆవనూనె క్రీం ని తీసుకుని రాయండి. అలాగే కొద్దిసేపు సున్నితంగా మసాజ్ చేయండి. ఆ తర్వాత కాటన్ సాక్సులు వేసుకోండి. వీటిని తీయకుండా అలాగే పడుకుని ఉదయాన్నే కడిగేయండి. ఇలా మీరు గనుక ఒక 10 రోజులు చేశారంటే పగుళ్లు పూర్తిగా నయమై సాఫ్ట్ గా అవుతాయి.
cracked heels
ఆవ నూనె ప్రయోజనాలు
ఆవనూనె మన ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ నూనెను ఉపయోగించి మనం పగుళ్లను సులువుగా తగ్గించుకోవచ్చు. ఈ నూనెలో ఉండే నేచురల్ ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ మన చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తాయి. మంచి పోషణను అందిస్తాయి. ఈనూనెలో ఉండే యాంటీమైక్రోబయల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పాదాలకు సంబంధించిన వ్యాధులను తగ్గించడానికి సహాయపడతాయి.