దీపావళి 2023: ఈ మొక్కలు దీపావళికి మీ ఇంటిని ఎంత అందంగా మారుస్తాయో ..!
Diwali 2023: దీపావళి సందర్భంగా ఇంటినంతా శుభ్రం చేసి అందంగా పూలతో డెకరేట్ చేస్తుంటారు. అయితే కేవలం పువ్వులే కాదు కొన్ని రకాల మొక్కలు కూడా మీ ఇంటిని మరింత అందంగా చేస్తాయి. మీ ఇంటికి పండుగ వాతావరణాన్ని తీసుకొస్తాయి. అంతేకాదు ఈ మొక్కలు మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి తెలుసా? ఇంతకీ అవేం మొక్కలంటే?
Diwali 2023: మొక్కలు మనకు ఎన్నో విధాలుగా మేలుచేస్తాయి. ఇవి మనం బతకడానికి ఆక్సిజన్ ను ఇవ్వడమే కాకుండా ఆహారాన్ని కూడా ఇస్తున్నాయి. అందుకే కాదు వీటితోనే మన ఇళ్లను అందంగా మారుస్తాము కూడా. అయితే ఈ దీపావళి సందర్భంగా కొన్ని మొక్కలతో మీ లివింగ్ రూం ఎంతో అందంగా, ఆకర్షణీయంగా చేయొచ్చు తెలుసా? ఈ మొక్కలను లివింగ్ రూం మూలల్లో పెట్టొచ్చు. వీటితో మీ లివింగ్ రూం ఎంతో అందంగా కనిపిస్తుంది. మరి ఇందుకోసం ఎలాంటి మొక్కను పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..
indoor plants
ఇంగ్లిష్ ఐవీ
ఇంగ్లీష్ ఐవీ మొక్కలను కామన్ ఐవీ అని కూడా అంటారు. వీటిని ఇంటి లోపల పెట్టొచ్చు. ఈ మొక్కలు గొప్ప నేచురల్ ఎయిర్ ప్యూరిఫైయర్లు కూడా. వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. ఇంగ్లిష్ ఐవీ మొక్క సమాంతరంగా పెరుగుతుంది. అలాగే పర్వతం మాదిరిగా కూడా పెరుగుతుంది. ఇవి మీ ఇంటి లుక్ ను మార్చుతాయి.
ఎరీకా పామ్
ఈ దీపావళి సందర్భంగా మీ లివింగ్ రూమ్ ను బోహేమియన్ లేదా స్కాండినేవియన్ స్టైల్ ఇంటీరియర్లతో అందంగా మార్చాలనుకుంటే అరేకా పామ్స్ ను ఖచ్చితంగా పెట్టండి. ఇవి మీ ఇంటికి ఒక ఫ్యాన్సీ అనుభూతిని కలిగిస్తాయి. అలాగే ఇవి మీరు బీచ్ లో ఉన్న అనుభూతిని కూడా కలిగిస్తాయి. ఈ మొక్కలు చిన్నగా ఉంటాయి. సో వీటిని తక్కువ స్థలంలో కూడా పెట్టొచ్చు.
Monstera
ఈ మొక్కలు చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తాయి. మాన్ స్టర్నా భారతదేశంలో అత్యధికంగా పెరిగిన ఇండోర్ మొక్కలలో ఒకటి. ఇవి నేచురల్ ఎయిర్ ప్యూరిఫైయర్లు. కాబట్టి దీపావళి సమయంలో వాయు కాలుష్యాన్ని అదుపులో ఉంచడానికి మీ ఇంట్లో ఇవి పెట్టండి. మీకు తెలుసా? ఈ మొక్కలు వెచ్చని, తేమతో కూడిన వాతావరణంలో కూడా పెరగగలవు. వీటి ఆకులు దుమ్మును పట్టుకుంటాయి. కాబట్టి వీటిని రెగ్యులర్ గా శుభ్రం చేయాలి.
Zebra Plant
జీబ్రా ప్లాంట్
జీబ్రా ప్లాంట్ అందమైన ఆకులు మీ లివింగ్ రూమ్ ను మరింత అందంగా మార్చుతాయి. డ్యూయల్ కలర్ ఆకులు చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి. ఇండోర్ జీబ్రా ప్లాంట్ 3 సంవత్సరాలలో కొన్ని అడుగులు మాత్రమే పెరుగుతుంది.
Chinese Evergreens
చైనీస్ ఎవర్ గ్రీన్
చైనీస్ ఎవర్ గ్రీన్ మొక్కను అగ్లోనెమా అని కూడా పిలుస్తారు. ఇది ఉష్ణమండల బహువార్షిక మొక్క. ఇది ఇంట్లో సరిగ్గా పెరుగుతుంది. ఈ మొక్క సహజ వాయు శుద్ధి లక్షణాలను కలిగి ఉంటుంది. గాలిలో ఉండే టాక్సిన్స్ ను తొలగించడానికి కూడా ఇది సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.