MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • దీపావళికి ఇవ్వడానికి బెస్ట్ గిఫ్ట్స్ ఇవే..!

దీపావళికి ఇవ్వడానికి బెస్ట్ గిఫ్ట్స్ ఇవే..!

Diwali 2023: దీపావళికి బహుమతులను కూడా ఇచ్చిపుచ్చుకుంటారు. మనం ఇచ్చే బహుమతి అవతలి వారు నచ్చే, మెచ్చే విధంగా ఉండాలి. అయితే ఈ దీపావళికి మీరు కొన్ని రకాల గిఫ్ట్ లను ఇస్తే వారు మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేరు. అవేంటంటే?

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Nov 06 2023, 02:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా బహుమతులను కూడా ఇచ్చిపుచ్చుకుంటారు. అయితే కొన్ని రకాల బహుమతులు చాలా రొటీన్ గా అనిపిస్తాయి. మీరెచ్చే బహుమతులు అవతలివారికి ఎంతో నచ్చే విధంగా ఉండాలి. అలాగే ఉపయోగపడేదై ఉండాలి. మీకు ఎలాంటి బహుమతులు ఇవ్వాలో తెలియడం లేదా? అయితే ఈ టిప్స్ మీకోసమే.. 
 

25
diwali 2023

diwali 2023

హ్యాండ్ మేడ్ దీపాలు, కొవ్వొత్తులు

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపాలను, కొవ్వొత్తులు దీపావళి నాడు పక్కాగా వెలిగిస్తారు. అందుకే ఈ దీపావళికి మీరు మీ చేత్తో తయారుచేసిన దీపాలు, సువాసనలు వెదజల్లే కొవ్వొత్తులను బహుమతిగా ఇవ్వండి. ఇది అవతలి వారికి ఎంతో నచ్చుతుంది. ఈ బహుమతులు వారిని సంతోషపెట్టడమే కాకుండా వారి ఇంటి అందాన్ని కూడా పెంచుతాయి. 
 

35

స్వీట్లు, స్నాక్స్

దీపావళికి టేస్టీ టేస్టీ స్వీట్లు, స్నాక్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. స్వీట్లు లేకుండా పండుగ సంపూర్ణం కాదు మరి. అందుకే ఈ పండుగ సందర్భంగా లడ్డూలు, జిలేబీలు లేదా డ్రై ఫ్రూట్స్ వంటి సాంప్రదాయ భారతీయ స్వీట్ల బాక్సును బహుమతిగా ఇవ్వండి. 

45

దుస్తులు

దీపావళి కి కొత్త బట్టలను వేసుకునే సంప్రదాయం కూడా ఉంది. అందుకే ఈ పండుగ సందర్భంగా చీరలు, కుర్తా-పైజామా వంటి సాంప్రదాయ భారతీయ దుస్తులను లేదా ఆభరణాలు వంటి స్టైలిష్ యాక్సెసరీలను బహుమతిగా కూడా ఇవ్వొచ్చు. ఇది మీ ప్రియమైన వారిని ఎంతో సంతోషపెడుతుంది. 
 

55

వెల్ నెస్ బహుమతులు

దీపావళికి బట్టలు, స్వీట్లే కాకుండా వారి శ్రేయస్సు కోసం వెల్ నెస్ బహుమతులను కూడా ఇవ్వొచ్చు. ఎసెన్షియల్ ఆయిల్ డిఫ్యూజర్లు, యోగా మ్యాట్లు లేదా స్పా వోచర్లు వంటి వెల్నెస్ వస్తువులను కూడా దీపావళి బహుమతిగా ఇవ్వండి. ఈ బహుమతులు విశ్రాంతి తీసుకోవడానికి, స్వీయ సంరక్షణను ప్రోత్సహిస్తాయి. ఈ గజిబిజీ ప్రపంచంలో ఇది చాలా అవసరం.
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
దీపావళి

Latest Videos
Recommended Stories
Recommended image1
Sabja Water: ఎండాకాలంలో సబ్జా వాటర్ తాగితే బరువు తగ్గుతారా?
Recommended image2
Polki Earrings: పోల్కీ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే రాయల్ లుక్ మీదే!
Recommended image3
Holi Colour Removal: బట్టలపై పడిన హోలీ కలర్స్ వదిలించేదెలా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved