Diabetes: డయాబెటీస్ పేషెంట్లు మామిడి పండ్లను తినొచ్చా? లేదా?
Diabetes: పండ్లలో రారాజుగా మామిడి పండు ప్రత్యేక గుర్తింపును పొందింది. అయితే ఈ పండులో షుగర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. మరి ఈ పండును మధుమేహులు తినొచ్చా? దీన్ని తినడం వల్ల వారి రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయా? లేదా?

వేసవి వచ్చిందంటే చాలు మామిడి పండ్లకు ఏ కొదవా ఉండదు. ఈ సీజన్ లో తప్ప మరే సీజన్ లో దొరకవని ప్రజలు కూడా వీటిని ఎక్కువగా లాగించేస్తుంటారు. అయితే ఈ పండులో షుగర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటంది. మరి దీన్ని మధుమేహులు తినొచ్చా? లేదా అన్న అనుమానాలు కలుగుతుంటాయి. నిజానికి మామిడి పండ్లలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ పండును స్మూతీలుగా, సలాడ్లు చేసుకుని తీసుకున్నా ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుంది. మరి ఈ పండ్లను మధుమేహులు తినొచ్చో లేదో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి.
మధుమేహులు మామిడి పండ్లను తినొచ్చా.. మామిడి పండ్లలో 90 కేలరీలు ఉంటాయి. ఇదంతా షుగర్ కంటెంట్ యే. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడానికి దారితీస్తుంది. అంతేకాదు ఈ పండులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో షుగర్ పెరుగుదలను తగ్గించడానికి సహాయపడతాయి. మామిడిలో గ్లైసెమిక్ ఇండెక్స్ 51. ఇది తక్కువగా పరిగణించబడుతుంది.
mango
మామాడి పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగడానికి దారి తీసే ఒత్తిడి ప్రభావాన్ని తగ్గించడానికి సహాయపడితే.. ఫైబర్ చక్కెరను రక్త ప్రవాహంలో శోషించుకునే రేటును నెమ్మదింపజేస్తుంది. కాబట్టి మధుమేహులు ఎలాంటి భయాలు పెట్టుకోకుండా మామిడి పండ్లను తొనచ్చు. అయితే ముందుగా వైద్యుడిని సంప్రదించిన తర్వాతే మామిడి పండ్లను తినాల్సి ఉంటుంది.
మామిడి పండే కాదు మామిడి ఆకులు కూడా మధుమేహులకు ఎంతో మేలు చేస్తాయి. ఈ ఆకులు ఇన్సులిన్ ఉత్పత్తిని అలాగే మీ శరీరంలో గ్లూకోజ్ పంపిణీలను మెరుగుపరుస్తాయి. ఈ ఆకుల్లో ఫైబర్, పెక్టిన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకులు మధుమేహులకే కాదు అధిక కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్నవారికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. అందుకే ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో ఈ ఆకులను వండుకుని తింటుంటారు.
డయాబెటీస్ పేషెంట్లు మామిడి పండ్లను ఎలా తినాలి.. మధుమేహులు మామిడి పండ్లను మితంగా తీసుకుంటేనే మంచిదని ఆరోగ్య నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఇవి మీ శరీర ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తాయి. మధుమేహులు తాగా మామిడి పండ్లను తింటే మంచిది. ముఖ్యంగా వీరు రోజుకు 1 లేదా 2 మామిడి పండ్ల కంటే ఎక్కువగా తినకూడదు. వీటిని సలాడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు.
mango
మామిడి పండ్ల ఇతర ప్రయోజనాలు.. మామిడి పండ్లలో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఈ పండు పొటాషియం, మెగ్నీషియం యొక్క గొప్ప మూలం.
2. ఇది అధిక రక్తపోటును తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది.
3. గుండె వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.
4. మీ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.
5. రోగ నిరోధక శక్తిని పెంచే పోషకాలను అందిస్తుంది.
6. కంటి చూపునుు మెరగుపరచడానికి సహాయపడుతుంది.
7. యాంటీ క్యాన్సర్ లక్షణాలను కలిగి ఉంటుంది.