- Home
- Life
- Dark Circles: కళ్లకింద నల్లటి వలయాలు ఇబ్బంది పెడుతున్నాయా? ఈ సహజ పద్దతుల్లో ఇవి సులువుగా వదిలిపోతాయి..
Dark Circles: కళ్లకింద నల్లటి వలయాలు ఇబ్బంది పెడుతున్నాయా? ఈ సహజ పద్దతుల్లో ఇవి సులువుగా వదిలిపోతాయి..
Dark Circles: డార్క్ సర్కిల్స్ ఎన్నో కారణాల వల్ల ఏర్పడుతుంటాయి. అయితే వీటిని సహజ పద్దతుల్లో చాలా సులువుగా వదిలించుకోవచ్చు.

ఈ రోజుల్లో కింటికింద నల్లటి వలయాలు ఏర్పడటం సర్వ సాధారణ విషయంగా మారిపోయింది. కళ్లు ఒత్తిడికి గురికావడం, రాత్రుళ్లు ఎక్కువ సేపు మేల్కోవడం, కంప్యూటర్, ల్యాప్ టాప్ ల ముందు ఎక్కువ సమయం పనిచేయడం, ఫోన్ ను ఎక్కువగా యూజ్ చేయడం, నిద్రలేమి మొదలైన కారణాల వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి.
కానీ డార్క్ సర్కిల్స్ వల్ల ముఖ సౌందర్యం పూర్తిగా దెబ్బతింటుంది. వీటిని ఎంత మేకప్ వేసుకున్నా అస్సలు దాచలేం. అయితే కొన్ని సింపుల్ టిప్స్ తో డార్క్ సర్కిల్స్ ను సులువుగా తొలగించొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బంగాళాదుంప జ్యూస్
బంగాళాదుంపల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ముఖ్యమైన విటమిన్లు అధికంగా ఉంటాయి. బంగాళాదుంప రసాన్ని ఉపయోగించి కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ను సులువుగా వదిలించుకోవచ్చు. ఇందుకోసం.. బంగాళాదుంపలను సన్నగా తురుమి.. దాన్నుంచి రసాన్ని తీయండి. ఆ రసంలో కాటన్ ను అద్ది డార్క్ సర్కిల్స్ చుట్టూ అప్లై చేయండి. ఈ పద్దతిని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల క్రమంగా నల్లటి వలయాలు మటుమాయం అవుతాయి.
కోల్డ్ టీ బ్యాగులు
టీ బ్యాగుల్లో ఉండే కెఫిన్ రక్తప్రవాహాన్ని పెంచుతుంది. అలాగే రక్తనాళాలను సంకుచితం చేస్తుంది. అంతేకాదు ఈ టీ బ్యాగులు డార్క్ సర్కిల్స్ ను కూడా తొలగిస్తుంది. ఇందుకోసం గ్రీన్ టీ బ్యాగులను కొద్ది సేపు ఫ్రిడ్జ్ లో పెట్టి ఆ తర్వాత కళ్లపై పెట్టుకోవాలి. క్రమం తప్పకుండా ఈ పద్దతిని ఫాలో అయితే కొద్ది రోజుల్లోనే డార్క్ సర్కిల్స్ మటుమాయం అవుతాయి.
చల్లని పాలు
చల్లని పాలు మన చర్మానికి ఎన్నో విధాలా ఉపయోగపడతాయి. వీటిని ఉపయోగించి డార్క్ సర్కిల్స్ సమస్య నుంచి తొందరగా బయటపడొచ్చు కూడా. ఇందుకోసం ఒక గిన్నెలో కొన్ని చల్లని పాలను తీసుకుని.. అందులో కాటన్ ను అద్ది కళ్ల చుట్టూ అప్లై చేయండి. 10 నిమిషాల తర్వాత ముఖాన్ని చల్లని నీళ్లతో క్లీన్ చేయండి. దీనివల్ల కంటి చుట్టూ ఉండే నల్లని వలయాలు మటుమాయం అవుతాయి.