Dark Circle Problem: ఇలా చేస్తే డార్క్ సర్కిల్స్ తొందరగా తగ్గిపోతాయి..
Dark Circle Problem: నిద్రలేకపోవడం, ఒత్తిడి, హార్మోన్లలో మార్పులు, జీవన శైలిలో మార్పులు, వంశపారంపర్యం వంటి ఎన్నో కారణాల వల్ల డార్క్ సర్కిల్స్ ఏర్పడుతుంటాయి.
అబ్బాయిలు.. అమ్మాయిలు అంటూ తేడా లేకుండా కళ్ల చుట్టూ నల్లని వలయాలు (Dark Circle )ఏర్పడుతుంటాయి. ఇవి ముఖ అందాన్ని మరింత పాడు చేస్తాయి. ఈ డార్క్ సర్కిల్స్ ఏర్పడటానికి ఎన్నో కారణాలున్నాయి. ఒత్తిడి, నిద్రలేకపోవడం, మారుతున్న జీవన శైలి, హార్బోన్ల అసతుల్యత, వంశపారంపర్యం వంటి కారణాల వల్ల ఈ సమస్య వస్తుంది.
వీటిని వీలైనంత తొందరగా తగ్గించుకోకపోతే ముఖ అందం పాడవడమే కాకుండా.. ముఖం జీవం లేనట్టుగా కనిపిస్తుంది. ఈ నలుపుదానాన్ని మార్కెట్ లో లభించే క్రీమ్స్ తో తగ్గించుకోవచ్చు. కానీ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. వీటిలో ఉండే కెమికల్స్ చర్మాన్ని దెబ్బతీస్తాయి. అందుకే వాటికి బదులుగా ఇంటి చిట్కాలతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. అవేంటో తెలుసుకుందాం పదండి.
టొమాటో (Tomato).. టొమాటోలు డార్క్ సర్కిల్స్ ను వదిలించడంలో దివ్య ఔషదంలా పనిచేస్తాయి. అంతేకాదు ఇవి చర్మాన్ని మృదువుగా కూడా చేస్తాయి. ఇందుకోసం టీ స్పూన్ టొమాటో రసం తీసుకుని అందులో టీ స్పూన్ నిమ్మరసాన్ని కలపండి. దీన్ని డార్క్ సర్కిల్స్ చూట్టూ అప్లై చేయాలి. ఒక 10 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. తరచుగా ఇలా చేస్తే నల్లని వలయాలు తొందరగా తొలగిపోతాయి. కాగా నిమ్మరసం, టమాటా రసం కలిపి తాగొచ్చు కూడా.
బంగాళాదుంప (Potato).. ముందుగా పచ్చి బంగాళాదుంపను నీట్ గా కడిగి మెత్తగా గ్రైండ్ చేయండి. ఈ పేస్ట్ లో రసాన్ని సపరేట్ చేయండి. ఈ రసంలో కాటనన్ క్లాత్ ను నానబెట్టండి. దీన్ని బ్లాక్ సర్కిల్స్ మొత్తం కవర్ అయ్యేలా కప్పండి. 10 నిమిషాల తర్వాత చల్లని నీళ్లతో కడిగేయండి. తరచుగా ఇలా చేస్తే.. ఈ సమస్య తొందరగా వదులుతుంది.
కోల్డ్ టీ బ్యాగ్ (Cold tea bag).. చల్లని టీ బ్యాగులు కూడా కళ్ల కింద నల్లని వలయాలను వదిలించగలవు. ఇందుకోసం టీ బ్యాగులను నీల్లలో నానబెట్టి.. కాసేపు ఫ్రిజ్ లో పెట్టండి. ఆ తర్వాత ఈ టీ బ్యాగ్ లను బ్లాక్ సర్కిల్స్ పై ఉంచండి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే కొద్ది రోజుల్లేనే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
చల్లని పాలు (Cold milk)..కూల్ మిల్క్ కూడా బ్లాక్ సర్కిల్స్ ను వదిలించగలవు. నిజానికి పాలు చర్మానికి, కళ్లకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఒకపోతే చల్లని పాలను తీసుకుని అందులో కాటన్ క్లాత్ ను నానబెట్టి.. డార్క్ సర్కిల్స్ పై 10 నిమిషాల పెట్టండి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.
ఆరెంజ్ జ్యూస్ (Orange juice).. నారింజ రసం కూడా డార్క్ సర్కిల్స్ ను తొలగిస్తుంది. ఇందుకోసం కొన్ని చుక్కల ఆరెంజ్ జ్యూస్ ను తీసుకుని అందులో గ్లిసరిన్ ను మిక్స్ చేయండి. దీన్ని క్రమం తప్పకుండా డార్క్ సర్కిల్స్ పై అప్లై చేయండి. ఇది చర్మాన్ని కాంతివంతంగా తయారుచేస్తుంది. అలాగే డార్క్ సర్కిల్స్ ను కూడా తొలగిస్తుంది.
యోగా లేదా ధ్యానం.. హార్మోన్ల మార్పులు, కంటి నిండా నిద్రలేకపోవడం, జీవన శైలిలో మార్పులు, ఒత్తిడి వంటివి డార్క్ సర్కిల్స్ కు దారితీస్తాయి. ప్రతి రోజూ యోగా లేదా ధ్యానం చేయడం ద్వారా శరీరాన్ని నియంత్రిస్తుంది. దీంతో బ్లాక్ సర్కిల్స్ తగ్గుతాయి.