Health Tips: కరివేపాకును ఇలా తింటే ఫాస్ట్ గా బరువు తగ్గడమే కాదు.. ఈ రోగాలు కూడా నయమవుతాయి..
Health Tips: కరివేపాకులో ఎన్నో ఔషదగుణాలున్నాయి. వీటిని ప్రతిరోజూ పరిగడుపున తింటే ఫాస్ట్ గా బరువు తగ్గడమే కాదు.. మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

దక్షిణ భారతదేశంలో కరివేపాకును ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఇప్పుడు ఈ ఆకును ఉత్తరాదిన కూడా వాడటం మొదలుపెట్టారు. కరివేపాకు ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకున్నందునే ప్రజలు వంటల్లో కరివేపాకును ఎక్కువగా వాడటం మొదలుపెట్టారు. కరివేపాకు ఆహారాలను రుచిగా చేయడంతో పాటుగా మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అందులోనూ ఈ ఆకును ఖాళీ కడుపుతో తినడం వల్ల ఎన్నో వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ప్రతిరోజూ రెండు మూడు కరివేపాకు ఆకులను నమిలితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మధుమేహాన్ని నియంత్రిస్తుంది.. ప్రస్తుతం కాలంలో డయాబెటీస్ సమస్య సర్వ సాధారణ వ్యాధిగా మారిపోయింది. చిన్న వయసు వారు సైతం దీని బారిన పడుతున్నారు. కానీ వీరి రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగితే అస్వస్థతకు గురవుతారు. అయితే కరివేపాకులో హైపోగ్లైసీమిక్ గుణాలున్నాయి. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నియంత్రిస్తుంది. అందుకే రెగ్యులర్ గా మధుమేహులు కరివేపాకును తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
జీర్ణవ్యవస్థను దృఢంగా ఉంచుతుంది.. ప్రతిరోజూ ఉదయాన్నే మూడు నుంచి నాలుగు కరివేపాకు ఆకులను నమలడం వల్ల ఉబ్బరం, మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యల నుంచి బయటపడతారు. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థ సక్రమంగా ఉంటేనే అనేక వ్యాధులు వాటంతట అవే నయమవుతాయి. అంటే జీర్ణక్రియకు సంబంధించిన వ్యాధులన్నీ తగ్గిపోతాయని అర్థం.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. కరివేపాకు తినడం వల్ల కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం దృఢంగా ఉంటుంది. ఖాళీ కడుపుతో కరివేపాకును తినడం వల్ల మీరు ఎన్నో వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చు.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది.. కరివేపాకు ఆకులను ప్రతిరోజూ పరిగడుపున తినడం వల్ల సులభంగా బరువు తగ్గుతారంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది జీవక్రియను పెంచుతుంది. అంతేకాదు శరీరంలో ఉన్న విషాన్ని కూడా బయటకు పంపుతుంది.
కళ్ళకు వరం కరివేపాకు.. కరివేపాకులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. రెగ్యులర్ గా ఖాళీ కడుపుతో కరివేపాకును తినడం వల్ల కంటి కాంతి పెరుగుతుంది.
కాలేయాన్ని దృఢంగా ఉంచుతుంది.. ఖాళీ కడుపుతో కరివేపాకును తినడం వల్ల కాలేయం ఫిట్ గా ఉంటుంది. బలహీనమైన కాలేయం ఉన్న వ్యక్తులకు కరివేపాకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది కొవ్వు కాలేయ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అందుకే మీ రోజు వారి వంటలో వీటిని తప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.