- Home
- Life
- ఛాతిలో నొప్పి, గుండె ఫాస్ట్ గా కొట్టుకోవడం, అలసట వంటి సమస్యలు మీకు ఉన్నాయా? అయితే డౌటే లేదు..
ఛాతిలో నొప్పి, గుండె ఫాస్ట్ గా కొట్టుకోవడం, అలసట వంటి సమస్యలు మీకు ఉన్నాయా? అయితే డౌటే లేదు..
జుట్టు విపరీతంగా రాలడం, గుండె ఫాస్ట్ ఫాస్ట్ గా కొట్టుకోవడం, చిన్న చిన్న పనులకే విపరీతంగా అలసిపోవడం, ఛాతిలో నొప్పి వంటి సమస్యలు మీకు ఉన్నాయా? అయితే డౌటే లేదు మీరు లాంగ్ కోవిడ్ బారిన పడినట్టేనంటున్నారు నిపుణులు.

మన జీవితాలను తలకిందులుగా చేసి.. లక్షల మంది ప్రాణాలను తీసేసిన కరోనా మహమ్మారి నేటికి పట్టిపీడిస్తూనే ఉంది. పోయిందనుకున్న కరోనా మళ్లీ వ్యాపిస్తోంది. అందుకే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కరోనా ఒకసారి సోకిన వారికి మళ్లీ మళ్లీ సోకొచ్చు. అయితే చాలా మందికి కరోనా వచ్చి తగ్గినా.. లాంగ్ కోవిడ్ తో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ లాంగ్ కోవిడ్ వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. అయితే ఒక కొత్త అధ్యయనం దీర్ఘకాలిక కోవిడ్ -19 తో నేరుగా సంబంధం ఉన్న 7 లక్షణాల గురించి కనుగొంది.
long covid
మిస్సోరి విశ్వవిద్యాలయ పరిశోధకులు యునైటెడ్ స్టేట్స్ లో 52,351 మంది ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డులను విశ్లేషించారు. వీరందరికీ 14 ఏప్రిల్ 2022 కు ముందు కోవిడ్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు నిర్దారణ అయ్యింది. లాంగ్ కోవిడ్ నుంచి సాధారణంగా నివేదించబడ్డ టాప్ 47 ఆరోగ్య లక్షణాలను పరిశోధకులు అధ్యయనం చేశారు. అయితే ఈ వైరస్ సోకిన వయోజన రోగుల ఉప సమూహానికి వర్తించే ఏడు లక్షణాలను మాత్రమే వారు కనుగొన్నారు. ఇవి ఒక సంవత్సరం వరకు ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
గుండె వేగంగా కొట్టుకోవడం
మీ గుండె వేగంగా లేదా సక్రమంగా కొట్టుకోనట్టుగా అనిపిస్తుంది. అలాగే తేలికపాటి తలతిరగడం లేదా మైకంగా కూడా అనిపించొచ్చు. ముఖ్యంగా నిలబడి ఉన్నప్పుడు.
Increase in hair loss among those who have won Covid
జుట్టు రాలడం
టెలోజెన్ ఎఫ్లూవియం పరిస్థితి కారణంగా.. కోవిడ్ తర్వాత చాలా కాలం పాటు జుట్టు రాలిపోతుంది. కోవిడ్ సంక్రమణతో పోరాడుతున్నప్పుడు మీ శరీరం శారీరక, భావోద్వేగ ఒత్తిడికి గురైతుంది. దీనివల్లే జుట్టు రాలిపోతుంది. కోవిడ్ వల్ల కలిగే ఒత్తిడి మీ శరీరాన్ని బాగా దెబ్బతీస్తుంది. ఇది శరీరానికి రెస్ట్ లేకుండా చేస్తుంది. దీనివల్ల వెంట్రుకలు ఊడిపోతాయి.
అలుపు
ఇది సర్వసాధారణమైన లాంగ్ కోవిడ్ లక్షణాలలో ఒకటి. దీర్ఘకాలిక కోవిడ్ అభివృద్ధి చెందుతున్న వారిలో 42.5% మందికి దీర్ఘకాలిక అలసట ఉందని వారు పరిశోధకులు కనుగొన్నారు. దీనికి చికిత్స తీసుకున్నా.. నెలల తరబడి ఉంటుంది.
ఛాతీ నొప్పి
ఛాతీ నొప్పి లేదా ఛాతీ అసౌకర్యం కూడా లాంగ్ కోవిడ్ సాధారణ లక్షణం. ఈ రకమైన నొప్పి మీ ఛాతీలోని కండరాలలో పుండ్లు ఉన్నట్టుగా అనిపిస్తుంది. మీరు దానిని తాకినప్పుడు నొప్పిగా అనిపిస్తుంది. అలాగే తిరగడం లేదా శరీరాన్ని సాగదీయడం వంటి కదలికల వల్ల కూడా నొప్పి తీవ్రమవుతుంది.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా కోవిడ్ సర్వ సాధారణ లక్షణం. కోవిడ్ ఇన్ఫెక్షన్ ను తగ్గించుకోవడానికి చికిత్స అవసరం లేకపోయినా ఈ సమస్య తలెత్తొచ్చు.
కీళ్ల నొప్పులు
దీర్ఘకాలిక కోవిడ్ కు సంకేతంగా కీళ్ల నొప్పులతో కూడా బాధపడొచ్చు. ప్రత్యేకించి మీరు కోవిడ్ సమయంలో ఆసుపత్రిలో ఉంటే. ఈ నొప్పి కొన్ని కొన్ని సార్లు ఎక్కువగా ఉంటుంది.
ఊబకాయం
జర్నల్ ఆఫ్ క్లినికల్ మెడిసిన్ లో ప్రచురించిన 2021 అధ్యయనం ఫలితాల ప్రకారం.. లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ రోజువారీ ఇంటి పనులను చేయకపోవడం వల్ల ఊబకాయం ప్రమాదం పెరుగుతుంది.